పూర్ణిమా రామస్వామి

భారతీయ ఫ్యాషన్ కాస్ట్యూమ్ డిజైనర్, వ్యాపారవేత్త

పూర్ణిమా రామస్వామి, భారతీయ ఫ్యాషన్ కాస్ట్యూమ్ డిజైనర్, వ్యాపారవేత్త. తన మొదటి సినిమా పరదేశి (2013) కు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. నాటకరంగంలో కూడా పనిచేసింది.[1][2]

పూర్ణిమా రామస్వామి
వృత్తిఫ్యాషన్ కాస్ట్యూమ్ డిజైనర్, వ్యాపారవేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఫ్యాషన్ డిజైనింగ్

కెరీర్ మార్చు

పూర్ణిమ కుటుంబానికి నాయుడు హాల్ అనే ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్ ఉంది. మొదట్లో కుటుంబ వ్యాపారంతోపాటు స్నేహితుల కోసం కాస్ట్యూమ్ డిజైన్ చేయడం ప్రారంభించింది. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తిచేసిన తరువాత గ్రూప్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు చేపట్టింది.[3]

దర్శకుడు బాలా భార్య మలార్‌తో ఉన్న పరిచయం వల్ల బాలా 2013లో తీసిన పరదేశి సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసే అవకాశం వచ్చింది.[4] 1930ల నాటి భారతీయ హిల్ కంట్రీలోని బానిస కార్మికుల నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది.[5][6][7]

పరదేశి సినిమా తర్వాత, మిచెల్ స్పినోసా దర్శకత్వం వహించిన సన్ ఎపౌస్ అనే ఫ్రెంచ్ సినిమాకి పనిచేయడానికి అవకాశం వచ్చింది.[8] 36 వయదినిలే (2015), మగలిర్ మట్టుం (2017), నాచియార్ (2018) సినిమాలకి జ్యోతికతో కలిసి పనిచేసింది.[9] ఆమె ముఖ్యంగా ఇరుధి సుట్రు (2006)లో మాధవన్ రూపాన్ని, ధనుష్ పా పాండి (2017)లో రాజ్‌కిరణ్ రూపాన్ని తిరిగి రూపొందించడంలో కూడా పనిచేసింది.[4] సినిమాలలో చేనేత వస్త్రాన్ని ఉపయోగించాలని ముందుకు వచ్చింది, తరచుగా ఆర్గానిక్ కాటన్ మెటీరియల్‌లో కాస్ట్యూమ్స్ రూపొందించింది.[10]

సినిమాలు (కొన్ని) మార్చు

మూలాలు మార్చు

  1. Gautam, Savitha (October 30, 2014). "The king was captivated and…" – via www.thehindu.com.
  2. "I'm honoured to recieve [sic] National Award: Poornima". News18. March 19, 2013.
  3. "Second-hand saris and a National Award". The New Indian Express.
  4. 4.0 4.1 Anantharam, Chitra Deepa (April 24, 2017). "Stylist of the stars" – via www.thehindu.com.
  5. Reddy, T. Krithika (March 20, 2013). "Throwback to the Thirties" – via www.thehindu.com.
  6. "I'm waiting to share my happiness with Bala sir: Poornima". Deccan Herald. March 18, 2013.
  7. "Threading into history". Deccan Herald. December 7, 2013.
  8. Ronnie Scheib (24 March 2014). "Film Review: 'His Wife'". Variety.
  9. "Jyothika's Costume Designer Spills The Beans On 'Kaatrin Mozhi'!".
  10. Rao, Subha (March 29, 2019). "Handloom at the movies" – via www.thehindu.com.