ఝున్‌ఝును జిల్లా

రాజస్థాన్ లోని జిల్లా

రాజస్థాన్ రాష్రం లోని జిల్లాలలో ఝంఝునూన్ జిల్లా ఒకటి. ఝున్‌ఝును పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

ఝున్‌ఝును జిల్లా
झुन्झुनू जिला
రాజస్థాన్ పటంలో ఝున్‌ఝును జిల్లా స్థానం
రాజస్థాన్ పటంలో ఝున్‌ఝును జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
డివిజనుజైపూర్ విభాగం
ముఖ్య పట్టణంఝున్‌ఝును
మండలాలు1. ఝున్‌ఝును , 2. చిరవా, 3. బుహానా, 4. ఖేత్రి, 5. నవాల్ గఢ్ 6. ఉదయపూర్‌వతి 7.మల్సీసార్ 8. సూరజ్ గఢ్
Government
 • లోకసభ నియోజకవర్గాలుఝున్‌ఝును[1]
విస్తీర్ణం
 • మొత్తం5,926 కి.మీ2 (2,288 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం2 1,39,658
 • Urban
22.89 percent
జనాభా వివరాలు
 • అక్షరాస్యత74.72
 • లింగ నిష్పత్తి950
ప్రధాన రహదార్లురాష్ట్ర రహదారులు 8
అక్షాంశ రేఖాంశాలు75°01′N 76°04′E / 75.02°N 76.06°E / 75.02; 76.06 - 27°23′N 28°19′E / 27.38°N 28.31°E / 27.38; 28.31
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర

మార్చు

ఝంఝునున్ జిల్లా రాజస్థాన్ రాష్ట్రంలోని షెకావతీ భూభాగంలో ఉంది. ఝున్‌ఝును ప్రాంతాన్ని కైంఖాని నవాబులు 1730 వరకు పాలించారు. ఝంఝనున్‌ చివరిపాలకడు రోహిల్లా ఖాన్.280 సంవత్సరాల తరువాత నవాబుల పాలన ముగింపుకు వచ్చింది.

రోహిల్లాఖాన్ షర్దుల్ సింగ్‌కు విశ్వాసపాత్రుడుగా ఉండి, షర్దుల్ సింగ్‌కు దివానుగా పనిచేసాడు. షర్దుల్ సింగ్‌కు ధైర్యసాహసాలు, శక్తివంతమైన పాలకుడుగా గుర్తించబడ్డాడు.

1730లో రోహిల్లాఖాన్ మరణించిన తరువాత షర్దుల్ సింగ్‌ ఝున్‌ఝును ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు.తరువాత మహారాజా షర్దుల్ సింగ్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని 12 సంవత్సరాల కాలం పాలించాడు.

అతను మరణించిన తరువాత కుమారులు ఈ ప్రాంతాన్ని 5 సమాన భాగాలుగా పంచుకున్నారు. వారి వారసులు ఈ ప్రాంతాన్ని 1947 వరకు పాలించారు. షర్దుల్ సింగ్ ఝున్‌ఝునులో కల్యాణ్‌జీ మందిర్, గోపీనాథ్‌జీ కా మందిర్ నిర్మించాడు. మహారావు షర్దుల్ సింగ్ కుమారులు పరసరంపురా మహారావు, షర్దుల్ సింగ్ కొరకు స్మారక మందిరం నిర్మించి ఫ్రెస్కో పెయింటింగులతో అలంకరించాడు.

నైసర్గికం

మార్చు

జిల్లా షెకావతీ భూభాగంలో ఉంది. జిల్లా ఈశాన్య, తూర్పు సరిహద్దులో హర్యానా రాష్ట్రం, ఆగ్నేయ, దక్షిణ, నైరుతీ సరిహద్దులలో సికార్ జిల్లా, వాయవ్య సరిహద్దులో చురు జిల్లా ఉంది.

ప్రముఖులు

మార్చు
 
ఝున్‌ఝును పట్టణంలో జిల్లా వ్యవస్థాపకుడు జుజార్ సింగ్ నెహ్రా విగ్రహం

పసరి, పిరమల్, చందక్, బిర్లా కుటుంబం వంటి పారిశ్రామికుల 4 కుటుంబాలు ఈ జిల్లాకు చెందినవారే.

పర్యాటక ఆకర్షణలు

మార్చు
  • రామకృష్ణ మిషన్, ఖెత్రి పట్టణంలో ఉన్న ఖెత్రి సెంటర్.
  • ధొసి హిల్.
  • రాణి సాతి ఆలయం.

పరిశ్రమలు

మార్చు

జిల్లాలోని ఖెత్రిలో రాగి గనులు ఉన్నాయి. ఖెత్రి కాపర్ కాంప్లెక్స్ ఆఫ్ హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్, (భారతదేశంలో అతి పెద్ద రాగి గనులు) ఖెత్రి పట్టణానికి 10 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ సల్ఫరిక్ ఆమ్లం, ఎరువులు ఉత్పత్తి జరుగుతుంది.

విద్య

మార్చు
  • బిట్స్ పిలాని
  • శ్రీ జగదీష్ ప్రసాద్ ఝబర్మల్ తిబెర్వాలా విశ్వవిద్యాలయం.
  • సి.ఎస్.ఐ.ఆర్ - సి.ఇ.ఇ.ఆర్, పిలాని
  • శ్రీధర్ విశ్వవిద్యాలయం
  • షేఖావతి పబ్లిక్ స్కూల్ హెతాంసర్

2011 లో గణాంకాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19013,41,572—    
19113,69,081+0.78%
19213,53,140−0.44%
19314,05,519+1.39%
19414,91,003+1.93%
19515,88,736+1.83%
19617,19,650+2.03%
19719,29,230+2.59%
198112,11,583+2.69%
199115,82,421+2.71%
200119,13,689+1.92%
201121,37,045+1.11%
source:[2]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,139,658, [3]
ఇది దాదాపు. నమీబియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 214వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 631 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.81%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 950:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 74.72%.[3]
జాతీయ సరాసరి (72%) కంటే. అధికం

సరిహద్దులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Parliamentary Constituencies of Rajasthan" (PDF). 2012. Archived from the original (PDF) on 2013-06-16. Retrieved 2012-02-23.
  2. Decadal Variation In Population Since 1901
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Namibia 2,147,585
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

వెలుపలి లింకులు

మార్చు