టిమ్ బెర్నర్స్ లీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సర్ తిమోతీ బెర్నర్స్ లీ ఒక బ్రిటీష్ కంప్యూటర్ శాస్త్రవేత్త. వరల్డ్ వైడ్ వెబ్ (World Wide Web or www) సృష్టికర్తగా సుపరిచితుడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ లో ప్రొఫెషనల్ ఫెలో,[1] ఈయన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (MIT) కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసరు.[2][3] ఈయన 1989 మార్చి 12లో ఒక ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం ప్రతిపాదించాడు.[4][5]
ప్రొఫెసర్ సర్ టిమ్ బెర్నర్స్ లీ | |||||
---|---|---|---|---|---|
![]() 2014 లో బెర్నర్స్ లో | |||||
జననం | తిమోతీ జాన్ బెర్నర్స్ లీ 1955 జూన్ 8 లండన్, ఇంగ్లండ్ | ||||
ఇతర పేర్లు | TimBL TBL | ||||
విద్య | ద క్వీన్స్ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్ (BA) | ||||
జీవిత భాగస్వామి | నాన్సీ కార్ల్‌సన్
(m. 1990; విడాకులు 2011) రోస్‌మేరీ లీత్ (m. 2014) | ||||
పిల్లలు | 2 పిల్లలు; 3 సవతి పిల్లలు | ||||
తల్లిదండ్రులు | కాన్వే బెర్నర్స్ లీ మేరీ లీ వూడ్స్ | ||||
పురస్కారాలు | ట్యూరింగ్ అవార్డు (2016) క్వీన్ ఎలిజబెత్ ప్రైజ్ (2013) ఫారెన్ అసోసియేట్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (2009) ఆర్డర్ ఆఫ్ మెరిట్ (2007) ACM సాఫ్ట్‌వేర్ సిస్టమ్ అవార్డ్ (1995) | ||||
|
2004 లో రెండవ ఎలిజబెత్ రాణి వెబ్ రంగంలో ఆయన చేసిన మార్గనిర్దేశమైన పరిశోధనలకు గాను నైట్ హుడ్ తో సత్కరించింది.[6][7]
వరల్డ్ వైడ్ వెబ్ సృష్టించినందుకు గాను 2007 లో నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్ కు ఎంపికయ్యాడు. 2016లో ఈయనకు కంప్యూటర్ సైన్స్ లో ప్రతిష్టాత్మకమైన ట్యూరింగ్ అవార్డు లభించింది. వరల్డ్ వైడ్ వెబ్ సృష్టించినందుకు, మొదటి వెబ్ బ్రౌజర్ తయారు చేసినందుకు, వెబ్ ను విస్తృత పరిచేందుకు అవసరమైన అల్గారిథమ్స్, ప్రోటోకాల్స్ (నియమావళి) ని రూపొందించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది.[8]
బాల్యం, విద్యాభ్యాసం మార్చు
టిం బెర్నర్స్ లీ 1955 జూన్ 8 న ఇంగ్లండు లోని లండన్ లో మేరీ లీ వుడ్స్, కాన్వే బెర్నర్స్ లీ దంపతులకు జన్మించాడు.[9] నలుగురు పిల్లల్లో ఈయన పెద్దవాడు. ఈయన తల్లిదండ్రులు మొదటి తరం కంప్యూటర్ అయిన ఫెర్రాంటి మార్క్ 1 మీద పనిచేసిన కంప్యూటర్ శాస్త్రవేత్తలు. ఇతని సోదరుడు మైక్ బెర్నర్స్ లీ పర్యావరణ శాస్త్రంలో ప్రొఫెసరు. ప్రాథమిక విద్య షీన్ మౌంట్ ప్రైమరీ స్కూల్లో చదివాడు. 1969-73 మధ్యలో ఎమ్మాన్యుయేల్ స్కూల్లో చదివాడు.[10]
మూలాలు మార్చు
- ↑ "Tim Berners-Lee". Department of Computer Science.
- ↑ "Sir Tim Berners-Lee joins Oxford's Department of Computer Science". University of Oxford.
- ↑ "Tim Berners-Lee | MIT CSAIL". www.csail.mit.edu (in ఇంగ్లీష్).
- ↑ "30 years on, what's next #ForTheWeb?". World Wide Web Foundation (in ఇంగ్లీష్).
- ↑ "info.cern.ch – Tim Berners-Lee's proposal". Info.cern.ch. Retrieved 21 December 2011.
- ↑ "Web's inventor gets a knighthood". BBC News. 31 December 2003. Retrieved 10 November 2015.
- ↑ "Creator of the web turns knight". BBC News. 16 July 2004. Retrieved 10 November 2015.
- ↑ "A. M. Turing Award". Association for Computing Machinery. 2016. Retrieved 4 April 2017.
- ↑ "Berners-Lee Longer Biography". World Wide Web Consortium. Retrieved 18 January 2011.
- ↑ మూస:Who's Who (subscription required)