టి.ఆర్.సుబ్రహ్మణ్యం

టి.ఆర్.సుబ్రహ్మణ్యం (20 సెప్టెంబరు 1929 – 4 అక్టోబరు 2013) కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు.

టి.ఆర్.సుబ్రహ్మణ్యం
T.R.Subramanyam.jpg
జననం(1929-09-20)1929 సెప్టెంబరు 20
మరణం2013 అక్టోబరు 4(2013-10-04) (వయస్సు 84)
వృత్తిభారత శాస్త్రీయ గాత్ర విద్వాంసుడు
తల్లిదండ్రులురాజగోపాల అయ్యర్
పురస్కారాలు

ఆరంభ జీవితం, విద్యాభ్యాసంసవరించు

ఇతడు ఒక మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో 1929, సెప్టెంబరు 20వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి రాజగోపాల అయ్యర్ ఇండియన్ మ్యూచువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్‌లో పనిచేసేవాడు. అతడు తరచూ బదిలీ అయ్యేవాడు. అతడు సంగీతాభిమాని కావడం వల్ల ఇతని ఇంటికి మదురై మణి అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, అరియకుడి రామానుజ అయ్యంగార్ వంటి మహామహులైన సంగీత విద్వాంసులు హాజరై వీరి ఆతిథ్యం స్వీకరించేవారు. ఇతని తండ్రి ఉద్యోగరీత్యా మాయవరం, కుంభకోణం, తిరునల్వేలి మొదలైన ప్రదేశాలలో ఇతని విద్యాభ్యాసం జరిగింది. మాయవరంలో ఇతడు శివరామ అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. తిరునల్వేలిలో ఎ.డి.రాజగోపాల అయ్యర్, సీతారామ భాగవతార్లు ఇతని సంగీత గురువులు. ఇతని సోదరి రాధ కూడా సంగీతం ఇంటివద్దనే అభ్యసించింది.[1] తరువాత ఇతడు ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద శిక్షణ పొందాడు. ఆ తరువాత మద్రాసు ప్రభుత్వ సంగీత కళాశాలలో గాత్ర సంగీతము, మృదంగము చదువుకున్నాడు. 1964-1994 మధ్య కాలంలో ఇతడు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీతం బోధించాడు. ఉత్తర భారతదేశంలో కర్ణాటక సంగీతానికి విశేష ప్రచారం కల్పించాడు. ఇతడు పల్లవులపై రెండు సంపుటాల గ్రంథం రచించాడు. కర్ణాటక సంగీతానికి సంబంధించి దృశ్య శ్రవణ పాఠ్యాంశాలను తయారు చేశాడు[2].

ఇతడు 19యేళ్ళ వయసులో ఉన్నప్పుడు మద్రాసు సంగీత అకాడమీ వారు నిర్వహించిన ఒక సంగీత పోటీలో ఒక పల్లవిని పరీక్షకులు అడిగిన రాగంలో,అడిగిన తాళంలో పాడి వినిపించి వారి మెప్పును పొంది ప్రథమ స్థానం సంపాదించాడు.[3]

ఇతడు ఆంగ్లంలో స్నాతకోత్తర పట్టభద్రుడు. బహుభాషా పండితుడు. ఇతనికి తెలుగు భాషలో ఉన్న పరిజ్ఞానం త్యాగరాజకృతులు ఆలపించడంలో తోడ్పడింది. ఇతడు సంగీతంలో రెండు పి.హెచ్.డి. పట్టాలు పొందాడు.

అవార్డులుసవరించు

మూలాలుసవరించు

  1. R, Swaminathan. "An adventurer and a reformer". Sruti Magazine.
  2. web master. "T. R. Subramanyam". Sangeet Natak Akademi. Sangeet Natak Akademi. Retrieved 23 February 2021.
  3. "Carnatic musician TRS passes away". The Hindu. 5 October 2013. Retrieved 26 July 2020.
  4. "Experts Advisory Committee, Madras Music Academy". Madras Music Academy. Archived from the original on 2016-10-01. Retrieved 2021-02-23.