అరియకుడి రామానుజ అయ్యంగార్

అరియకుడి రామానుజ అయ్యంగార్ (19 మే 1890– 23 జనవరి 1967[1]) ఒక కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. ఇతడు పాడటంలో సరికొత్త శైలిని అభివృద్ధి చేశాడు. దానిని అరియకుడి సంప్రదాయంగా అతని శిష్యులు అనుసరిస్తున్నారు. ఇతడు కర్ణాటక సంగీత కచేరీలలో నూతన పద్ధతులను స్థిరపరిచాడు.[2][3][4]

అరియకుడి రామానుజ అయ్యంగార్
తపాలా బిళ్ళపై రామానుజ అయ్యంగార్ చిత్రం
జననం(1890-05-19)1890 మే 19
అరియకుడి పట్టణం, కరైక్కుడి జిల్లా, తమిళనాడు రాష్ట్రం, భారతదేశం
మరణం1967 జనవరి 23(1967-01-23) (వయసు 76)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కర్ణాటక సంగీత విద్వాంసుడు

1954లో ఇతనికి సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది. 1958లో భారత ప్రభుత్వం ఇతనికి పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి సత్కరించింది.[5]

ప్రారంభ జీవితం, నేపథ్యం మార్చు

ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని కరైక్కుడి జిల్లా (ప్రస్తుతం శివగంగై జిల్లా) అరియకుడి పట్టణంలో 1890, మే 19న జన్మించాడు. ఇతడు మొదట పుదుక్కోటై మలయప్ప అయ్యర్, నమక్కల్ నరసింహ అయ్యర్‌ల వద్ద విద్యనభ్యసించాడు.[6] తరువాత పెక్కు సంవత్సరాలు పట్నం సుబ్రమణ్య అయ్యరు శిష్యుడు పూచి శ్రీనివాస అయ్యంగార్ వద్ద శిక్షణ పొందాడు.[6]

వృత్తి మార్చు

 
1952లో సంగీత నాటక అకాడమీ అవార్డు సమయంలో రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, ఉస్తాద్ ముస్తాక్ హుసేన్ ఖాన్, ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్, కరైకుడి సాంబశివ అయ్యర్‌లతో అరియకుడి రామానుజ అయ్యంగార్ (ఎడమ నుండి రెండవ వ్యక్తి)

ఇతడు తన మొదటి ప్రదర్శన 1918లో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో ఇచ్చాడు.

కర్ణాటక సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ ఇతని గురించి ఇలా పేర్కొన్నాడు. "నేను అరియకుడి రామానుజ అయ్యర్ చేత చాలా ప్రభావితమయ్యాను. నేను ఇతనిలా పాడగలిగితే చాలు. నాకు ఇక పునర్జన్మ అక్కరలేదు".[7] మరొక విద్వాంసుడు జి.ఎన్.బాలసుబ్రమణియన్ ఇతడు ఎదురు పడితే భక్తితో సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఇతడు మృదంగ కళాకారుడు పాలఘాట్ మణి అయ్యర్‌తో కలిసి అనేక కచేరీలు చేశాడు. ఇరువురికీ ఒకరి పట్ల మరొకరికి గాఢమైన స్నేహంతో పాటుగా గౌరవం ఉండేది.[8] చెంబై వైద్యనాథ భాగవతార్, అరియకుడి రామానుజ అయ్యంగార్ ఇద్దరూ తన రెండు కళ్ళని పాలఘాట్ మణి అయ్యర్ చెబుతుండేవాడు.

శిష్యులు మార్చు

అరియకుడి రామానుజ అయ్యంగార్ వేలాది శిష్యులలో కొంతమంది ముఖ్య శిష్యులు: కె.వి.నారాయణస్వామి, బి.రాజం అయ్యర్, అలెప్పి వెంకటేశన్, మదురై ఎన్.కృష్ణన్,[9]అంబి భాగవతార్. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఇతనితో విరివిగా చర్చించి తన సంగీత పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంది.

పురస్కారాలు మార్చు

గ్రంథసూచిక మార్చు

  • అరియకుడి రామానుజ అయ్యంకర్ డే. అరియకుడి రామానుజ అయ్యంగార్ ట్రస్ట్. 1984.

మూలాలు మార్చు

  1. Sangeeta Sangadhigal - 28 (Tamil)
  2. Lakshmi Subramanian (1 January 2008). New Mansions for Music: Performance, Pedagogy and Criticism. Berghahn Books. pp. 47–. ISBN 978-81-87358-34-3. Retrieved 16 July 2013.
  3. Shankar, Bala (2018-12-13). "The word Ariyakudi brought to fashion". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-11-09.
  4. Balasubramanian, V. (2016-01-28). "Remembering Ariyakudi". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-11-09.
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 21 July 2015.
  6. 6.0 6.1 Papa (2011-01-02). "Pages ago - A musicians’ musician". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-11-09.
  7. Semmangudi's comments on Ariyakudi - Frontline Interview Archived 2008-12-29 at the Wayback Machine
  8. P, Venkatesan. "Ariyakudi and Mani Iyer". www.carnatica.net. Retrieved 2019-11-09.
  9. "Vidwan Madurai N. Krishnan passes away". www.kutcheribuzz.com. 2018-11-25. Archived from the original on 2018-11-12. Retrieved 2018-11-25.
  10. "Sangita Kalanidhi recipients". Madras Music Academy website. Archived from the original on 2012-12-30.
  11. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 2016-03-31.
  12. "SNA: List of Sangeet Natak Akademi Ratna Puraskarwinners (Akademi Fellows)". SNA Official website. Archived from the original on 2016-03-04.
  13. 13.0 13.1 13.2 Ariyakudi Ramanuja Iyenkar Day. Ariyakudi Ramanuja Iyengar Trust. 1984.
  14. "Awardees of Sangeetha Kalasikhamani". The Indian Fine Arts Society. Archived from the original on 26 సెప్టెంబరు 2018. Retrieved 14 January 2019.
  15. "Padma Awards Directory (1954–2009)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 2013-05-10.

బయటి లింకులు మార్చు