టి.ఎ.కాళీయమూర్తి

తిరువలపుత్తూర్ టి.ఎ.కాళీయమూర్తి (1948 – 2020)[1] ఒక డోలు వాద్యకళాకారుడు.[2].

తిరువలపుత్తూర్ టి.ఎ.కాళీయమూర్తి
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఅరుణాచలం పిళ్ళై కాళీయమూర్తి
జననం(1948-10-22)1948 అక్టోబరు 22
మూలంతిరువలపుత్తూర్, మైలదుత్తురై, తమిళనాడు
మరణం2020 ఫిబ్రవరి 19(2020-02-19) (వయసు 71)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిడోలు కళాకారుడు
వాయిద్యాలుడోలు
క్రియాశీల కాలం1963 – 2020
వెబ్‌సైటుwww.tak.co.in

ఆరంభ జీవితం మార్చు

ఇతడు 1948, అక్టోబరు 22వ తేదీన అరుణాచలం పిళ్ళై, రాజమణి అమ్మాళ్ దంపతులకు తిరువలపుత్తూర్ గ్రామంలో జన్మించాడు.

ఇతడు తన ఐదవయేట తన మేనమామ ఎస్.కదిర్వేల్ పిళ్ళై వద్ద డోలు నేర్చుకున్నాడు. 8వ యేట డోలు విద్వాంసుడు, తన ముత్తాత అయిన పశుపతి పిళ్ళై వద్ద ఈ కళను అభివృద్ధి చేసుకున్నాడు.

వృత్తి మార్చు

ఇతడు 7 సంవత్సరాలు శిక్షణ పొందిన తర్వాత డోలు కళాకారుడిగా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. ఇతడు తిరువేంగడు సుబ్రహ్మణ్య పిళ్ళై, తిరువీళిమిళై గోవిందరాజ పిళ్ళై, సెంబనార్ కోయిల్ బ్రదర్స్, తిరుమైజ్ఞానం నటరాజసుందరం పిళ్ళై, నామగిరిపేట్టై కృష్ణన్, మదురై సేతురామన్ పొన్నుస్వామి బ్రదర్స్, షేక్ చిన మౌలానా వంటి అగ్రశ్రేణి నాదస్వర విద్వాంసులకు, ఎ.కె.సి.నటరాజన్ వంటి క్లారినెట్ విద్వాంసులకు డోలు వాద్య సహకారాన్ని అందించాడు.

ఇతడు ఏ - హై గ్రేడు కళాకారుడిగా ఆకాశవాణి, దూరదర్శన్‌లలో విరివిగా కచేరీలు చేశాడు. ఇతడు 1991 వరకు ఆకాశవాణి తిరుచిరాపల్లి కేంద్రం ఆడిషన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.

బిరుదులు మార్చు

  • చెన్నై రాయపేటకు చెందిన వెంకటేశ్వర భక్తజనసభ వారిచే "లయగాన తవిల్ అరసు"
  • "సునాద తవిల్ ఇసై చక్రవర్తి"
  • సేలం సంగీత విద్వత్సభ వారిచే "డిండిమ కళానిపుణ మకుటరత్న"
  • బెంగళూరు సంగీత విద్వత్సభ వారిచే "బాల విశ్వేశ్వర"
  • 1981లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" వారిచే "కళైమామణి"
  • తిరువైయ్యార్ తమిళ్ ఇసై విళ వారిచే "ఇసల్ మామురసు"
  • 1983లో చెన్నైలోని ముత్తమిళ్ పెరవై వారిచే "తవిల్ సెల్వం"
  • 1999లో తిరుచ్చి ఆర్.ఆర్.సభ వారిచే "అఖిల ఉలగ తవిల్ వాద్యజనరంజక లయచక్రవర్తి"
  • ఎంకన్ సంగీత ఇసై విళ వారిచే "తవిల్ మేధై"
  • 2005లో విశాఖ సంగీత అకాడమీ, విశాఖపట్నం వారిచే "సంగీత కళాసాగర"
  • కంచి కామకోటి పీఠం ఆస్థాన డోలు విద్వాంసుడు
  • 2014లో సంగీత నాటక అకాడమీ అవార్డు [3]
  • 2015లో శ్రీకృష్ణ గానసభ, చెన్నై వారిచే "సంగీత చూడామణి"[2]

మూలాలు మార్చు

  1. "திருவாளப்புத்தூர் டி.ஏ.கலியமூர்த்தி மாரடைப்பால் காலமானார்" [T A Kaliyamurthy passed away after a heart attack] (in Tamil). NewsJ. 20 February 2020. Archived from the original on 21 ఫిబ్రవరి 2020. Retrieved 21 February 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. 2.0 2.1 web master. "T. A. Kaliyamurthy". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 1 మార్చి 2021. Retrieved 22 March 2021.
  3. "Declaration of Sangeet Natak Akademi Fellowships (Akademi Ratna) and Akademi Awards (Akademi Puraskar) for the Year 2014" (PDF). sangeetnatak.gov.in. Archived from the original (PDF) on 14 జూన్ 2015. Retrieved 22 మార్చి 2021.