టి.టి.కృష్ణమాచారి
తిరువెల్లూరు తట్టై కృష్ణమాచారి (1899–1974) 1956 నుండి 1958 వరకు, తిరిగి 1964 నుండి 1966 వరకు రెండు పర్యాయాలు భారతదేశ విత్త మంత్రిగా పనిచేశాడు. 1956లో స్థాపించబడిన స్వతంత్ర భారతదేశపు తొలి ఆర్థిక విధాన కేంద్రము, కొత్త ఢిల్లీలోని జాతీయ అనువర్తిత ఆర్థికశాస్త్ర పరిశోధనా కేంద్రానికి ఈయన వ్యవస్థాపక సభ్యుడు. కృష్ణమాచారి మద్రాసు కైస్తవ కళాశాలలో పట్టబధ్రుడై, ఆ కళాశాల యొక్క ఆర్ధిక శాస్త్ర విభాగంలో అతిధి ఆచార్యుడిగా పనిచేశాడు. ఈయన టి.టి.కె గా సుపరిచితుడు. స్వతంత్ర భారతదేశంలో ఒక స్కాములో చిక్కుకొని రాజీనామా చేసిన తొలి మంత్రిగా అప్రతిష్ఠకూడా ఉంది.[1] ఈయన రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడు, వ్యాపారవేత్త, భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు.
తిరువెల్లూరు తట్టై కృష్ణమాచారి | |||
| |||
పార్లమెంటు సభ్యుడు
మద్రాసు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం | |||
---|---|---|---|
ప్రధాన మంత్రి | జవహర్‌లాల్ నెహ్రూ | ||
పార్లమెంటు సభ్యుడు,
మద్రాసు లోక్‌సభ నియోజకవర్గం | |||
ప్రధాన మంత్రి | జవహర్‌లాల్ నెహ్రూ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేసు | ||
వృత్తి | రాజకీయనాయకుడు, వ్యాపారవేత్త | ||
మతం | హిందూమతం |
ప్రారంభ జీవితం
మార్చుటి.టి.కృష్ణమాచారి 1899లో మద్రాసు నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి. కృష్ణమాచారి మద్రాసు కైస్తవ కళాశాలలో పట్టబధ్రుడయ్యాడు.[2] 1928లో కృష్ణమాచారి టిటికె గ్రూపును ప్రారంభించాడు.ఇది భారతీయ వ్యాపారసమాఖ్య. ప్రెస్టేజ్ బ్రాండుకు గాను పేరుగాంచింది.
రాజకీయ జీవితం
మార్చుటి.టి.కృష్ణమాచారి తొలుత మద్రాసు శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై, ఆ తర్వాత కాంగ్రేసు పార్టీలో చేరాడు. 1946లో కేంద్రంలోని రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యాడు. 1952 నుండి 1965 వరకు రెండు పర్యాయాలు కేంద్ర విత్తమంత్రిగా పనిచేశాడు. ఈయన భారతదేశపు తొలి వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా, ఆ తర్వాత ఆర్ధిక శాఖా మంత్రిగా పనిచేశాడు. ఈయన చాలాకాలం ఉక్కు శాఖకు కూడా మంత్రిగా వ్యవహరించాడు. 1962లో తిరిగి మంత్రి అయ్యి, తొలుత కొంత పోర్టుఫోలియో లేని మంత్రిగా, ఆ తర్వాత ఆర్థిక, రక్షణ సహకార మంత్రిగా, చివరిగా 1964లో మళ్ళీ విత్త మంత్రిగా పనిచేశాడు. 1966లో పదవీ విరమణ చేశాడు.[3]
తర్వాత జీవితం
మార్చుముంధ్రా స్కాండల్ వెలుగుచూసినప్పుడు, అందులో స్పష్టంగా కృష్ణమాచారి పాత్ర ఉండటంతో, 1958 ఫ్రిబవరి 18న విత్తమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు.[4] 1962లో తిరిగి లోక్‌సభకు ఎన్నికైనప్పుడు జవహార్ లాల్ నెహ్రూ ఈయనకు విత్తమంత్రిత్వ శాఖ కాకుండా మరే శాఖైనా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు[5] 1964లో తిరిగి విత్త మంత్రి అయి ఆ పదవిలో 1966 దాకా కొనసాగాడు. పదవీ విరమణ చేసిన తర్వాత 1974లో వృద్ధాప్య కారణాలతో మరణించాడు. ఈయన మరణం తర్వాత చెన్నైలోని మౌబ్రే రోడ్డును టిటికె రోడ్డుగా నామకరణం చేశారు.
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ http://india.blogs.nytimes.com/2012/05/09/long-view-indias-very-first-corruption-scandal/
- ↑ https://books.google.com/books?id=xcbBEHHI-90C&lpg=PA367&dq=T.%20T.%20Krishnamachari&pg=PA368#v=onepage&q=T.%20T.%20Krishnamachari&f=false
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-07-25. Retrieved 2017-10-10.
- ↑ http://www.indianexpress.com/news/the-mundhra-affair/397317/0
- ↑ http://india.blogs.nytimes.com/2012/05/09/long-view-indias-very-first-corruption-scandal/?_r=0