టీఎస్ కాప్

(టీఎస్‌ కాప్‌ నుండి దారిమార్పు చెందింది)

టీఎస్ కాప్ అనేది శాంతిభద్రతల విషయంలో అన్ని విభాగాలకు ఉపయోగపడేలా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాప్‌. పోలీస్‌ సేవలు మరింత వేగవంతం, సమగ్ర సమాచార పరిశీలన, రియల్‌ టైం పోలీసింగ్‌, దర్యాప్తు అధికారికి పూర్తి సమాచారం వంటివి ఈ యాప్‌ ద్వారా అనుసంధానం చేయబడ్డాయి.[1] క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బంది ఒక్క క్లిక్‌తో తమకు కావాల్సిన సమాచారన్నంతా తెలుసుకోవడానికి, విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను ట్యాబ్‌లలో ఎంట్రీ చేయడం, వివిధ అంశాలకు సంబంధించిన పూర్తి డాటాబేస్, డయల్ 100కు అనుసంధానం, పెట్రోలింగ్ మొబైల్ వాహనాలు, క్రైమ్ మ్యాపింగ్, దర్యాప్తునకు కావాల్సిన పూర్తి సమాచారం విచారణ అధికారి చేతిలోనే ఉండటం వంటి అనేక సదుపాయాలు ఈ యాప్‌‌లో అందుబాటులో ఉన్నాయి.[2]

టీఎస్‌ కాప్‌
టీఎస్‌ కాప్‌ లోగో
Date2018, జనవరి 1
Locationతెలంగాణ, భారతదేశం
Organised byముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం
Participantsతెలంగాణ ప్రజలు
Websiteటీఎస్ కాప్ అధికారిక వెబ్ సైట్

ప్రారంభం

మార్చు

2018, జనవరి 1న డైరెక్టర్‌ జనరల్‌ అఫ్‌ పోలీస్‌ ఎం. మహేందర్ రెడ్డి ఈ యాప్‌‌ను ప్రారంభించాడు.[3]

యాప్ వివరాలు

మార్చు

ఈ యాప్ కనెక్ట్‌లో ఒకే గ్రూప్‌లో ఎన్ని గ్రూప్‌లను అయినా జోడించవచ్చు, టెక్స్ట్ తోపాటు ఇమేజ్‌లు, ఆడియో, వీడియో, ప్రస్తుత లొకేషన్‌ను కూడా ఈ యాప్ లో షేర్ చేయవచ్చు.[4] టీఎస్ కాప్ మొబైల్ యాప్ సౌకర్యం ద్వారా 54 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. నేర పరిశోధన విభాగాల్లోని అధికారులకు ఉపయోగపడే సమస్త సమాచారం యాప్‌లో ఉంటుంది. నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లేలోపే ఈ ప్రత్యేక యాప్ ద్వారా మరింత సమాచారం అందుబాటులోకి రావడంద్వారా కేసులు మరింత సులువుగా, వేగంగా పరిష్కారమవుతాయి.

మూలాలు

మార్చు
  1. "టిఎస్‌ కాప్‌ యాప్‌ ప్రారంభం". www.magazine.telangana.gov.in. Archived from the original on 2019-09-15. Retrieved 2021-11-30.
  2. "Telangana cops offer 8 services through app". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2018-01-02. Archived from the original on 2018-04-30. Retrieved 2021-11-30.
  3. "టీఎస్ కాప్ యాప్‌: తెలంగాణ పోలీస్ చేతికి సరికొత్త సాంకేతిక అస్త్రం". Samayam Telugu. 2018-01-01. Archived from the original on 2021-11-30. Retrieved 2021-11-30.
  4. Reporter, Staff (2018-06-18). "TS police launch Cop Connect". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2020-11-09. Retrieved 2021-11-30.

బయటి లంకెలు

మార్చు