టీనా శిల్పరాజ్
టీనా శిల్పరాజ్ (జననం 1996 జూన్ 23) భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో నటిస్తుంది. ఆమె వెబ్ సిరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీ (2021), రైటర్ పద్మభూషణ్ (2023)[1] సినిమాలతో ప్రసిద్ధి చెందింది.
టీనా శిల్పరాజ్ | |
---|---|
జననం | |
జాతీయత | ఇండియన్ |
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2021 - ప్రస్తుతం |
బాల్యం
మార్చు1996 జూన్ 23న హైదరాబాదులో టీనా శిల్పరాజ్ జన్మించింది. తల్లి సునిత గృహిణి.
కెరీర్
మార్చుటీనా శిల్పరాజ్ 2021లో జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించిన ఆహా ఒరిజినల్ తెలుగు టెలివిజన్ రొమాన్స్-డ్రామా సిరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీతో తన కెరీర్‌ను ప్రారంభించింది. 2023లో షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన రైటర్ పద్మభూషణ్ చిత్రంలో ఆమె విజయవాడ అమ్మాయి సారిక పాత్రతో తెలుగువారందరికి దగ్గరైంది.
మూలాలు
మార్చు- ↑ "Writer Padmabhushan Review: విషయం లేని పుస్తకం | Writer Padmabhushan is not write well Kavi". web.archive.org. 2023-02-09. Archived from the original on 2023-02-09. Retrieved 2023-02-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)