టీ.ఎన్‌. అనసూయమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె తంబళ్ళపల్లె నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది.

టీఎన్‌ అనసూయమ్మ
టీ.ఎన్.అనసూయమ్మ


ఎమ్మెల్యే
పదవీ కాలం
1967 - 1978
నియోజకవర్గం తంబళ్ళపల్లె నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1924
నెల్లూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2022 ఫిబ్రవరి 10
బెంగళూరు
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు తిక్కవరపు రామిరెడ్డి
జీవిత భాగస్వామి టీఎన్‌ రఘునాథరెడ్డి
సంతానం టీఎన్‌ హర్షవర్ధన్‌ రెడ్డి, టీఎన్‌ లాలస, టీఎన్‌ లినథా, టీఎన్‌ లాసికా రెడ్డి
వృత్తి స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు

జననం, విద్యాభాస్యం మార్చు

టీ.ఎన్.అనసూయమ్మ 1924లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, నెల్లూరులో జన్మించింది. ఆమె తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, వ్యాపారవేత్త తిక్కవరపు రామిరెడ్డి. అనసూయమ్మ ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరు, ఇంటర్మీడియట్, డిగ్రీ మద్రాస్ లో పూర్తి చేసింది. ఆమెకు 1944 ఫిబ్రవరి 28న టీఎన్‌ రఘునాథరెడ్డితో వివాహమైంది.

రాజకీయ జీవితం మార్చు

టీఎన్‌ అనసూయమ్మ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1967లో తంబళ్ళపల్లె నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా సెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

మరణం మార్చు

టీఎన్‌ అనసూయమ్మ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 2022 ఫిబ్రవరి 10న బెంగళూరులోని తన స్వగృహంలో మరణించింది. ఆమెకు కుమారుడు టీఎన్‌ హర్షవర్ధన్‌రెడ్డి (మానసిక వైద్య నిపుణుడు), కుమార్తెలు టీఎన్‌ లాలస, టీఎన్‌ లినథా, టీఎన్‌ లాసికారెడ్డి ఉన్నారు.[1][2]

మూలాలు మార్చు

  1. Eenadu (11 February 2022). "తంబళ్ళపల్లె మాజీ ఎమ్మెల్యే టీఎన్‌ అనసూయమ్మ మృతి". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
  2. Andhra Jyothy (11 February 2022). "తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే అనసూయమ్మ మృతి". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.