టి.జి.భరత్

(టీ. జీ. భరత్ నుండి దారిమార్పు చెందింది)

టీ. జీ. భరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కర్నూలు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3]

టీ. జీ. భరత్
టి.జి.భరత్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024 - ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు హఫీజ్ ఖాన్
నియోజకవర్గం కర్నూలు

వ్యక్తిగత వివరాలు

జననం (1977-08-05) 1977 ఆగస్టు 5 (వయసు 47)
విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీతెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు టి.జి.వెంకటేష్, టీజీ స్వరాజ్య లక్ష్మి కుమారి
జీవిత భాగస్వామి శిల్ప
సంతానం ఆర్య, విభు
నివాసం 43-262, సంకల్‌బాగ్, ఎన్‌ఆర్‌పేట, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

టీ. జీ. భరత్ 1977 ఆగస్టు 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో టీ.జీ. వెంకటేష్, టీజీ స్వరాజ్య లక్ష్మి కుమారి దంపతులకు జన్మించాడు. ఆయన 1999లో యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ నుండి ఎంబీఏను పూర్తి చేశాడు.[4]

వివాహం

మార్చు

టీ. జీ. భరత్ ఫిబ్రవరి 9, 2001న శిల్పని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె విభు, ఓ కుమారుడు శ్రీ ఆర్య ఉన్నారు.

రాజకీయ జీవితం

మార్చు

టీ. జీ. భరత్ తన తండ్రి మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి 2019లో కర్నూలు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అబ్దుల్ హఫీజ్ ఖాన్ చేతిలో 5,353 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన తరువాత కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ పరి బలోపేతానికి కృషి చేస్తూ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కర్నూలు నుండి టీడీపీ అభ్యర్థిగా ఆపాటి చేసి తన సమీప వైసీపీ అభ్యర్థి ఎం.డీ. ఇంతియాజ్‌ అహ్మద్‌పై 18876 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5][6][7] 2024 జూన్ 12న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.[8]

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (11 June 2024). "టీజీ భరత్ , కర్నూలు నియోజకవర్గం". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. Andhrajyothy (13 June 2024). "AP New Cabinet: కొత్త తరానికి అందలం". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  5. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kurnool". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  6. EENADU (5 June 2024). "రాజకీయ ప్రవేశం.. తెదేపాతోనే విజయం". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  7. Andhrajyothy (13 June 2024). "వరించిన అదృష్టం". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  8. EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్‌... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.