టెల్లురిక్ ఆమ్లం

టెల్లురిక్ ఆమ్లం ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం.టెల్లురియం, ఆక్సిజన్, హైడ్రోజన్ మూలకాల సంయోగము వలన టెల్లురిక్ ఆమ్లం ఏర్పడినది.టెల్లురిక్ ఆమ్లం రసాయనసంకేత పదం Te (OH) 6.టెల్లురిక్ ఆమ్లం తెల్లని ఘనపదార్థం.టెల్లురిక్ ఆమ్లం అష్టభుజాసౌష్టవ అణువుల అనుసంధానం కల్గిఉన్నది.ఈ ఆకృతిని అణువులు సజల ద్రావణాలలోకూడా నిలుపుకొని ఉండును.ఇది రొమ్బోహేడ్రాల్, మొనోక్లినిక్ రూపాలలో ఉండును, రెండురూపాలలో అష్టభుజాసౌష్టవముగా అణువులు అమరిఉండును.టెల్లురిక్ ఆమ్లం బలహీనమైన ఆమ్లం.డైబెసిక్‌గా ఉండి బలమైనక్షారాలతో టెల్లురేట్ లవణాలను, బలహీనమైన క్షారాలతో హైడ్రోజన్ టెల్లురేట్ లవణాలను ఏర్పరచును. నీటితో జలవిశ్లేషణ చెందును.

టెల్లురిక్ ఆమ్లం
Telluric acid
Ball-and-stick model of telluric acid
పేర్లు
IUPAC నామము
Hexahydroxidotellurium
ఇతర పేర్లు
Orthotelluric acid
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7803-68-1]
పబ్ కెమ్ 61609
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:30463
SMILES O[Te](O)(O)(O)(O)O
ధర్మములు
H6O6Te
మోలార్ ద్రవ్యరాశి 229.64 g/mol
స్వరూపం White monoclinic crystals
సాంద్రత 3.07 g/cm3
ద్రవీభవన స్థానం 136 °C (277 °F; 409 K)
50.1 g/100 ml at 30 °C[1]
ఆమ్లత్వం (pKa) 7.68, 11.0 at 18 °C[1]
నిర్మాణం
octahedral
ద్విధృవ చలనం
0 D
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు corrosive
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

ఉత్పత్తి

మార్చు

హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2), క్రోమియం ట్రైఆక్సైడ్ లేదా సోడియం పెరాక్సైడ్ వంటి ఆక్సీకరణ కారకాలతో టెల్లురియం లేదా టెల్లురియం డయాక్సైడ్ ఆక్సీకరణ చెందటం వలన టెల్లురిక్ ఆమ్లం ఏర్పడును.

TeO2 + H2O2 + 2H2O → Te(OH)6

ఆమ్లద్రావణాన్ని 10 °C ఉష్ణోగ్రత కన్న తక్కువ ఉష్ణోగ్రతకు చల్లార్చడం వలన నాలుగుజలాణువులు ఉన్న టెట్రాహైడ్రేట్ టెల్లురిక్ ఆమ్లం స్పటికికరణ జరుగును.టెల్లురిక్ ఆమ్లం నెమ్మదిగా క్రింది సమీకరణలో చూపిన విధంగా నెమ్మదిగా ఆక్సికరణకు లోనగును.

H6TeO6 + 2H+ + 2e ⇌ TeO2 + 4H2O Eo = +1.02 V

భౌతిక ధర్మాలు-రసాయన చర్యలు

మార్చు

టెల్లురిక్ ఆమ్లం మొలార్ ద్రవ్యరాశి/అణుభారం 229.64 గ్రాములు/మోల్. టెల్లురిక్ ఆమ్లంసాంద్రత3.07గ్రాములు/సెం.మీ3[2].టెల్లురిక్ ఆమ్లం ద్రవీభవన స్థానం136°C (277 °F; 409K).టెల్లురిక్ ఆమ్లంనీటిలో కరుగును.

అనార్ద్ర/నిర్జల టెల్లురిక్ ఆమ్లం గాలిలో 100 °C ఉష్ణోగ్రతవరకు స్థిరత్వం కోల్పోదు.100 °C ఉష్ణోగ్రత దాటినా పిమ్మట నిర్జలీకరణ చెంది తెల్లని, చెమ్మ/తేమను పీల్చుపాలిమెటా టెల్లురిక్ ఆమ్లం (అందాజు సమ్మేళనం H2TeO4) 10), అల్లోటెల్లురిక్ ఆమ్లం ఏర్పడును[2].వీటి క్లిష్టలవణాలు [Te (O) (OH) 5], [Te (O) 2 (OH) 4]2.అనయానులను కల్గి ఉండును.టెల్లురిక్ ఆమ్లాన్ని 300 °C ఉష్ణోగ్రతకు పైన బలంగా వేడి చెయ్యడం వలన α- టెల్లురియం ట్రైఆక్సైడ్ (α-TeO3) ఏర్పడును.టెల్లురిక్ ఆమ్లంతో డైఅజోమిథేన్ చర్యవలన హెక్సామిథైల్ ఈస్టరు (Te (OMe) 6 ఏర్పడును.

టెల్లురిక్ ఆమ్లం, దాని లవణాలు హెక్సాకోఅర్డినేట్ టెల్లురియాన్ని కల్గిఉండును.

ఇతర టెల్లురియం ఆమ్లాలు

మార్చు

+4 ఆక్సీకరణ స్థాయి ఉన్న టెల్లురస్ ఆమ్లం (H2TeO3), గురించి తెలిసి నప్పటికీ, దానియొక్క ఇతర ధర్మాలు, లక్షణాల గురిచి పూర్తిగా తెలియదు.హైడ్రోజన్ టెల్లురైడ్ ఒక అస్థిరమైన వాయువు, దానికి నీటిని చేర్చడం వలన హైడ్రోటెల్లురిక్ ఆమ్లం ఏర్పడును.

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. 1.0 1.1 Lide, David R. (1998), Handbook of Chemistry and Physics (87 ed.), Boca Raton, FL: CRC Press, ISBN 0-8493-0594-2
  2. 2.0 2.1 "Telluric Acids". tellurium.atomistry.com. Retrieved 2015-10-29.