టోంకినీ హనుమాన్ ఆలయం
టోంకినీ హనుమాన్ ఆలయం తెలంగాణ రాష్ట్రం కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ -టీ మండలంలో టోంకినీ గ్రామంలో ఉంది.ఇది చాలా ప్రాచీన ఆలయం .లోనవెల్లి గ్రామానికి చెందిన జెఠ్మల్ సోనీ అనే భక్తుడు వార్ధా నది నుండి తీసుకొచ్చి ప్రతిష్టించాడు.ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది[1][2][3].
శ్రీ సిద్ధి టోంకినీ హనుమాన్ దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 19°12′53″N 79°16′55″E / 19.214772°N 79.281809°E |
పేరు | |
ఇతర పేర్లు: | హనుమాన్ దేవాలయం/>హనుమాన్ క్షేత్రం ఆంజనేయ క్షేత్రంగా |
ప్రధాన పేరు : | టోంకినీ హనుమాన్ మందిర్ |
దేవనాగరి : | ठोंकनी हानूमान मंदिर |
మరాఠీ: | ठोंकनी हानूमान मंदिर मंदिर |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | ఆదిలాబాద్ జిల్లా |
ప్రదేశం: | సిర్పూర్-టీ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | ఆంజనేయస్వామి |
ఉత్సవ దేవత: | ఆంజనేయ స్వామి |
ముఖ్య_ఉత్సవాలు: | హనుమాన్ జయింతి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | దక్షిణ భారత దేశ హిందూ దేవాలయం |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సుమారు 100 సంవత్సరాలు |
సృష్టికర్త: | కాకతీయులు |
చరిత్ర
మార్చుటోంకినీ హనుమాన్ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. లోనవేల్లి గ్రామానికి చెందిన జెఠ్మల్ సోనీ అనే ఆంజనేయ స్వామి భక్తుడి కలాలో వచ్చి నేను వార్ధా నది ఒడ్డున ఉన్నానని నాకు టోంకినీ గ్రామంలో తీసుకెళ్ళి చిన్న గుడి కట్టి ప్రతిష్టించాలని చెప్పాడంతో ఆ భక్తుడు గ్రామస్థులతో సమాచారాన్ని తేలియజేసి మిగతా భక్తులతో వార్ధా నదికి బయలుదేరారు.కలలో చూపించిన చిహ్నం వద్దకు వెళ్ళి తవ్వడంతో ఆ ఆంజనేయస్వామి విగ్రహం దొరికింది.దాన్ని వార్థా నదిలో శుబ్రం చేసి బాజా భజంత్రీలతో తీసుకుని వచ్చి గ్రామస్తులచే ఒక గుడిసె కటించి పండితులతో పూజలు నిర్వహించి అందులో ఆ ఆంజనేయస్వామిని ప్రితిష్ఠించారు.
విశిష్టత
మార్చుదేశంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలతో పోలిస్తే ....ఈ టోంకినీ హనుమాన్ ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఆలయం ముఖ ద్వారం పడమర వైపున ఉన్న ఆంజనేయస్వామి వారు దక్షిణ వైపునకు ఉండటం విశేషం. దేశంలోని ఎక్కడ లేని విధంగా ఈ ఆంజనేయస్వామి విగ్రహం పేరుగుతుడంతో మహిమాన్వితమైన స్వామి అని భక్తులు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు[4].
ఉత్సవాలు
మార్చుఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, మాలధారణ కార్యక్రమాలు, మహా పాదయాత్ర భక్తులకు అన్నదానం కార్యక్రమాలు ఆలయంలో ఘనంగా జరుపుతారు.
మహా పాదయాత్ర
మార్చుఈ టోంకినీ శ్రీ సిద్ధి హనుమాన్ దేవాలయానికి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు ఆంజనేయస్వామికి మొక్కులు చెల్లించేందుకు కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుండి భక్తులు పాటాలు పాడుతు భజనలు, కీర్తనలు చేస్తూ భక్తి శ్రద్ధలతో మహా పాదయాత్ర పాల్గొన్నాంటారు. ఈ మహా పాదయాత్ర 2001 లో ప్రారంభించారు. కార్తిక మాసంలో ఈ మంగళవారం రోజున పాదయాత్ర ప్రారంభించిస్తారు. భక్తుల భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ మహా పాదయాత్ర నవంబర్ నెలలో కాగజ్ నగర్ పట్టణం నుండి టోంకినీ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుంది . భక్తులు మంగళవారం రోజున ప్రతి సంవత్సరం యాభై నుండి ఎనభై వేల భక్తులతో పాదయాత్ర సాగడంతో చుపురులను ఆకర్షిస్తోంది[5].
మూలాలు
మార్చు- ↑ "Tokini hanuman temple". www.onefivenine.com. Retrieved 2024-11-10.
- ↑ Velugu, V6 (2024-04-20). "భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్". V6 Velugu. Retrieved 2024-11-10.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ telugu, NT News (2022-11-02). "టోంకిని కిటకిట.. భక్తజన సంద్రంగా మహా పాదయాత్ర". www.ntnews.com. Retrieved 2024-11-10.
- ↑ "ఆంజనేయం: టోంకినీ అంజన్న ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే". indiaherald.com. Retrieved 2024-11-10.
- ↑ ABN (2023-11-20). "Kumaram Bheem Asifabad: భక్తుల కొంగుబంగారం 'టోంకిని' సిద్ధిహనుమాన్ ఆలయం". Andhrajyothy Telugu News. Retrieved 2024-11-10.