పుట్టిన రోజు
పుట్టిన రోజు ను జన్మదినం, జయంతి అని కూడా అంటారు. ఇంగ్లీషులో Birthday అంటారు. ఈ పుట్టిన రోజున జరుపుకునే ఉత్సవాన్ని జన్మ దినోత్సవం అంటారు. ఒక సంవత్సరం పూర్తయి తరువాత సంత్సరంలో అడుగు పెట్టె సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పుట్టిన రోజున కొత్త బట్టలు ధరించడం,చుట్టూ దీపాలు వెలిగించిన కేకును కోసి తోటి వారికి పంచడం వంటివి చేస్తుంటారు. సంస్థలకు కూడా ఇదే విధంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారు. దేవతలకు కూడా వారి పుట్టిన రోజున జయంతోత్సవాలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ పుట్టిన రోజు నాడు తోటి విద్యార్థులకు, స్నేహితులకు, ఉపాధ్యాయులకు, బంధువులకు మిఠాయిలు పంచి పెడతారు, వారి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు పొందుతారు, తల్లిదండ్రులు నుంచి ఇంకా ఆప్తులైన పెద్దల నుంచి ఆశీస్సులు పొందుతారు. కొందరు వ్యక్తులు మరణించినప్పటికి వారి సేవలను స్మరించుకుంటూ వారి జన్మదినోత్సవాలను జరుపుకుంటారు, వారు ఇప్పటికి బతికి ఉంటే వారి వయసు ఇంత ఉండేదని అన్నోవ జయంతోత్సవముగా జరుపుకుంటారు. ఉదాహరణకు తాళ్ళపాక అన్నమాచార్య 601వ జయంతి ఉత్సవాలు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని 601వ జయంతిని పురస్కరించుకొని తెలుగుజాతి ఆయనకిచ్చిన ఘన నివాళి లక్షగళ సంకీర్తనార్చన. ఇది సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సుమారు లక్షా అరవై వేల మంది తన్మయత్మంతో ఏకకంఠంతో అన్నమాచార్యుని సప్తగిరి సంకీర్తనలను గానం చేసిన అపూర్వమైన సంఘటన.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- పుట్టినరోజు శుభాకాంక్షలు Archived 2021-12-22 at the Wayback Machine Images
- Happy Birthday Wishes from Birthday9.com
- Truth or Dare questions Archived 2021-08-04 at the Wayback Machine నుండి.
మూలాలు
మార్చు- 16 premium birthday gifts for sisters to make her smile
- ప్రపంచ సాంస్కృతిక చరిత్రను తిరగరాసిన సిలికానాంధ్ర వారి 'లక్షగళ సంకీర్తనార్చన', తెలుగు విద్యార్థి జూన్ 2009 సంచికలో ప్రచురించిన వ్యాసం.