వార్ధా

మహారాష్ట్ర నగరం, భారతదేశం

వార్ధా మహారాష్ట్ర, వార్ధా జిల్లా లోని పట్టణం. ఇది వార్ధా జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. పట్టణం గుండా ప్రవహించే వార్ధా నది మీదుగా దానికి ఈ పేరు వచ్చింది. 1866లో స్థాపించబడిన ఈ పట్టణం ఇప్పుడు పత్తి వ్యాపారానికి ముఖ్యమైన కేంద్రంగా ఉంది. గాంధీ కార్యక్షేత్రంగా ఈ పట్టణానికి గుర్తింపు ఉంది.

వార్ధా
—  పట్టణం  —
వార్ధా is located in Maharashtra
వార్ధా
వార్ధా
మహారాష్ట్ర పటంలో పట్తణ స్థానం
దేశం  భారతదేశం
రాష్ట్రం మహారాష్ట్ర
జిల్లా వార్ధా
జనాభా (2011)[1]
 - మొత్తం 1,26,444
భాషలు
 - అధికారిక మరాఠీ
Time zone IST (UTC+5:30)
Vehicle registration MH-32

భౌగోళికం, శీతోష్ణస్థితి

మార్చు

వార్ధా 20°45′N 78°36′E / 20.75°N 78.60°E / 20.75; 78.60 వద్ద [2] సముద్రమట్టం నుండి 234 మీ. ఎత్తున ఉంది.

శీతోష్ణస్థితి డేటా - Wardha (1981–2010, extremes 1966–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 35.0
(95.0)
41.8
(107.2)
43.9
(111.0)
46.4
(115.5)
48.4
(119.1)
47.1
(116.8)
41.4
(106.5)
39.7
(103.5)
37.9
(100.2)
38.7
(101.7)
36.4
(97.5)
34.1
(93.4)
48.4
(119.1)
సగటు అధిక °C (°F) 28.6
(83.5)
31.5
(88.7)
36.2
(97.2)
41.1
(106.0)
42.7
(108.9)
37.1
(98.8)
31.7
(89.1)
30.4
(86.7)
31.6
(88.9)
32.3
(90.1)
30.0
(86.0)
28.8
(83.8)
33.5
(92.3)
సగటు అల్ప °C (°F) 13.5
(56.3)
15.6
(60.1)
19.5
(67.1)
24.0
(75.2)
27.1
(80.8)
25.1
(77.2)
23.1
(73.6)
22.6
(72.7)
22.3
(72.1)
20.1
(68.2)
16.9
(62.4)
13.7
(56.7)
20.3
(68.5)
అత్యల్ప రికార్డు °C (°F) 6.7
(44.1)
7.4
(45.3)
7.4
(45.3)
15.9
(60.6)
16.9
(62.4)
13.9
(57.0)
14.9
(58.8)
12.9
(55.2)
16.5
(61.7)
10.5
(50.9)
8.5
(47.3)
6.2
(43.2)
6.2
(43.2)
సగటు వర్షపాతం mm (inches) 14.1
(0.56)
6.2
(0.24)
11.4
(0.45)
4.8
(0.19)
11.2
(0.44)
166.9
(6.57)
267.9
(10.55)
258.3
(10.17)
136.6
(5.38)
59.4
(2.34)
18.6
(0.73)
10.7
(0.42)
966.1
(38.04)
సగటు వర్షపాతపు రోజులు 0.8 0.6 1.1 0.4 1.0 7.7 12.0 11.4 7.3 3.1 1.0 0.7 47.1
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 42 35 27 22 24 49 69 76 70 56 51 44 47
Source: India Meteorological Department[3][4]

జనాభా వివరాలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, పట్టణ మున్సిపల్ సరిహద్దుల్లో జనాభా 1,05,543.[5] పట్టణీకరణ వలన సిన్దీ, సవాంగి, బోర్గావ్, పిప్రి, మ్హాసాలా, నల్వాడి చిటోడాతో వంటి ఇరుగుపొరుగు గ్రామాల అభివృద్ధి చెందాయి.

రవాణా

మార్చు

వార్ధా పట్టణం రోడ్ల ద్వారా మహారాష్ట్రలోని ఇతర నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. జాతీయ రహదారి నెం.361 (నాగ్‌పూర్-వార్ధా-యవత్మాల్-నాందేడ్-లాతూర్-తుల్జాపూర్) నగరం గుండా వెళుతుంది. నాగ్‌పూర్-ఔరంగాబాద్-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే కూడా దీని గుండా వెళుతుంది. సమృద్ధి మహామార్గ్ లేదా నాగ్‌పూర్-ముంబై కమ్యూనికేషన్ సూపర్ ఎక్స్‌ప్రెస్‌వే కూడా నగర శివార్ల నుండి వెళుతుంది.

వార్ధా నగరం భారతదేశంలోని చాలా ప్రాంతాలకు చక్కటి రైలు సౌకర్యం ఉంది. వార్ధా రైల్వే స్టేషన్ హౌరా-నాగ్‌పూర్-ముంబై మార్గంలో ఒక ముఖ్యమైన రైల్వే కూడలి. ఈ పట్టణం సేవాగ్రామ్ రైల్వే స్టేషన్ ద్వారా దేశంలోని దక్షిణ భాగానికి కూడా అనుసంధానించబడి ఉంది. ముంబై-కోల్‌కతా మార్గంలో ట్రాఫిక్ ప్రధానంగా వార్ధా స్టేషన్‌ఉ గుండా వెళ్తుంది. ఢిల్లీ-చెన్నై మార్గంలో ట్రాఫిక్ సేవాగ్రామ్ స్టేషన్ (గతంలో వార్ధా ఈస్ట్ స్టేషన్) గుండా వెళ్తుంది.  యావత్మాల్, పుసాద్, డియోలీ మీదుగా కొత్త వార్ధా-నాందేడ్ లైన్ నిర్మాణం జరుగుతోంది. భారీ ట్రాఫిక్‌ అవసరాలను తీర్చడానికి సేవాగ్రామ్, నాగ్‌పూర్ స్టేషన్‌ల మధ్య కొత్తగా మూడవ, నాల్గవ మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి.

నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం లోని విమానాశ్రయం.

ముఖ్యమైన ప్రదేశాలు

మార్చు

విశ్వ శాంతి స్థూపం

మార్చు
 
వార్ధాలోని విశ్వ శాంతి స్థూపం

విశ్వ శాంతి స్థూపం నిచిదత్సు ఫుజి లేదా ఫుజి గురూజీ కల. ఇది పెద్ద తెల్లని స్థూపం. స్థూపంపై నాలుగు దిక్కులలో బుద్ధుని విగ్రహాలు అమర్చబడి ఉంటాయి. ఇక్కడ పెద్ద పార్కుతో పాటు చిన్న జపనీస్ బౌద్ధ దేవాలయం కూడా ఉంది. స్థూపం సమీపంలో విశ్వశాంతి కోసం ప్రార్థనలు చేసే ఆలయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన అనేక శాంతి పగోడాలలో ఇది ఒకటి.

గీతా మందిర్

మార్చు

ఈ ఆలయం గోపురిలో విశ్వ శాంతి స్థూపం సమీపంలో ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం - ఇందులో దేవుని విగ్రహమేమీ ఉండదు. పైకప్పు కూడా ఉండదు, గ్రానైట్ స్లాబ్‌లతో చేసిన గోడలు మాత్రమే ఉంటాయి. వాటిపై గీతలోని 18 అధ్యాయాలు చెక్కబడి ఉంటాయి. గోడల లోపల ఒక అందమైన చిన్న పార్కు ఉంటుంది. ఈ ఆలయాన్ని 1980లో ఆచార్య వినోబా భావే ప్రారంభించాడు. ఇది కాకుండా ఆచార్య వినోబా భావే, జమ్నాలాల్ బజాజ్ జీవితాల గురించి రెండు ప్రదర్శనలు కూడా ఉన్నాయి.

సేవాగ్రామ్ ఆశ్రమం

మార్చు

సేవాగ్రామ్ ఆశ్రమం 1936 నుండి 1948 వరకు మహాత్మా గాంధీ నివాసంగా ఉంది. 1930 దండి ఉప్పు యాత్ర తర్వాత, అతను సబర్మతిలోని తన ఆశ్రమానికి తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. రెండు సంవత్సరాలు జైలులో గడిపిన తరువాత, అతను భారతదేశమంతటా పర్యటించాడు. పారిశ్రామికవేత్త జమ్నాలాల్ బజాజ్ ఆహ్వానం మేరకు వార్ధాలో జమ్నాలాల్ బంగ్లాలో కొంతకాలం ఉన్నాడు. 1936లో, 67 సంవత్సరాల వయస్సులో, గాంధీజీ వార్ధా శివార్లలోని సేగావ్ అనే గ్రామానికి (తదనంతరం అదే సేవాగ్రామ్ అయింది) వెళ్లి తన భార్య కస్తూర్బా, ఇతర శిష్యులతో కలిసి గుడిసెలలో నివసించడం ప్రారంభించాడు. ఇది నెమ్మదిగా ఒక ఆశ్రమంగా మారింది. అక్కడ గాంధీ మరణించే వరకు పన్నెండేళ్ల పాటు తన అనుచరులతో నివసించాడు. గాంధీ, ఇతర ఆశ్రమ వాసులు ఉపయోగించిన అనేక వ్యక్తిగత వస్తువులను ఇక్కడ భద్రపరచారు. ఇందులో ఆయన కళ్లద్దాలు, టెలిఫోన్, నోట్‌బుక్, టేబుల్‌లు, చాపలు మొదలైనవి ఉన్నాయి.[6]

ప్రముఖ వ్యక్తులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Census of India: Search Details". Archived from the original on 24 September 2015.
  2. Wardha District at a Glance Archived 4 ఫిబ్రవరి 2007 at the Wayback Machine.
  3. "Station: Wardha Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 797–798. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 3 April 2020.
  4. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M154. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 3 April 2020.
  5. Wardha City Population Census 2011 | Maharashtra.
  6. "The history of Sewagram". gandhiashramsevagram.org/. The Gandhi Ashram, Sevagram (Official website). Retrieved 17 June 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=వార్ధా&oldid=3902241" నుండి వెలికితీశారు