టౌన్ హాల్, విశాఖపట్నం
టౌన్ హాల్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ని ఒక చారిత్రిక భవనం. ఇది విశాఖపట్నం పురపాలక సంస్థకు చెందిన భవనం. ఇపుడు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అర్ధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
టౌన్ హాల్, విశాఖపట్నం | |
---|---|
సాధారణ సమాచారం | |
ప్రదేశం | Chengal Rao Peta, Visakhapatnam Andhra Pradesh |
చిరునామా | చెంగల్ రావు పేట, విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ |
పట్టణం లేదా నగరం | Visakhapatnam |
దేశం | India |
భౌగోళికాంశాలు | 17°41′51″N 83°17′55″E / 17.697413°N 83.298484°E |
నిర్మాణ ప్రారంభం | 1893 |
పూర్తి చేయబడినది | 1904 |
వ్యయం | ₹ 50,000 |
యజమాని | గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ |
సాంకేతిక విషయములు | |
నేల వైశాల్యం | 5,000 sq ft (500 మీ2) |
రూపకల్పన, నిర్మాణం | |
సివిల్ ఇంజనీర్ | R.Mahadeva |
చరిత్ర
మార్చు1893లో టౌన్ హాల్ కు పునాది వేసారు, అప్పటి నిర్మాణ వ్యయం ₹50,000 బొబ్బిలి రాజా భరించారు. ఇది క్వీన్ విక్టోరియా స్వర్ణోత్సవాల జ్ఞాపకార్థం నిర్మించబడింది, ఇప్పటికిని దీనిని విక్టోరియా మెమోరియల్ టౌన్ హాల్ అని పిలుస్తారు. తరువాత 1904లో టౌన్ హాల్ ను విశాఖపట్నం పురపాలక సంస్థ కి అప్పగించారు.[1] టౌన్ హాల్ మొత్తం వైశాల్యం 5,000 చదరపు అడుగులు. 1960ల నుండి సాంస్కృతిక, సాహిత్య, నాటక కార్యక్రమాలకు కేంద్రంగా కొనసాగింది. ఈ టౌన్ హాల్ ను జి.వి.ఎం.సి పునరుద్ధరించింది.[2]
మొదట్లో పాత జాలరిపేట దగ్గర కొండమీద విశాఖ హార్బర్ మొత్తం కనపడే విధంగా దీనిని నిర్మించారు. శంఖాకారం లో రెండు స్తంభాల మధ్య ఉన్న ఈ టౌన్ హాల్ కు పైకప్పుకు స్కాట్లాండ్ నుండి ఇనుప చువ్వలు, ఇంకా మొదటి అంతస్తుకు బర్మా టేకు, మంగళూరు టైల్స్ ఉపయోగించారు.[1]
దాదాపు 120 ఏళ్ల చరిత్ర గల వైజాగ్ టౌన్ హాల్ స్వాతంత్ర్యోద్యమానికి కూడా కేంద్రం గా ఉంది. సమావేశాలు జరిగేవి. 1929 లో మహాత్మా గాంధీ ఈ టౌన్ హాల్ ను సందర్శించి ప్రసంగించారు. 1931లో ఉప్పు సత్యాగ్రహం టౌన్ హాల్ ఎదురుగా సముద్రపు ఒడ్డునే జరిగింది. దిగుమర్తి జానకీ బాయి, దిగుమర్తి వెంకట స్వామి, తెన్నేటి విశ్వనాధం, కొల్లూరు సూర్యం గుప్త వంటి వారు ఈ ఉద్యమం లో పాల్గొన్నారు.[1] ఉత్తరాంధ్ర ప్రజలను విదేశీ వస్త్రాలను బహిష్కరించాలంటూ ప్రసంగించారు.[3]
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) నగరంలోని పాత పట్నం ప్రాంతంలో ఒకదానికొకటి పక్కనే ఉన్న టౌన్ హాల్, ఓల్డ్ మునిసిపల్ కార్పొరేషన్ గుర్తించబడిన వారసత్వ భవనాలను ప్రభుత్వ అధికారులు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసిన అధికారులకు శిక్షణా కేంద్రాలుగా ఉపయోగించే ప్రతిపాదనను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది.[4] ఈ భవనాలను సాంస్కృతిక, వారసత్వ సంపదగా మార్చారు, ఇది నగర చరిత్ర ప్రదర్శిస్తుంది. సంగీత కచేరీలు, తదితర కార్యక్రమాలకు ఆతిధ్యం ఇస్తోంది. [5]
సూచనలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Town Hall: steeped in history". Times of India. 13 August 2015. Retrieved 19 April 2019.
- ↑ "Town Hall building, old municipal office to be restored". Times of India. 11 February 2019. Retrieved 19 April 2019.
- ↑ సారధి, విజయ (16 August 2022). "Vizag Town Hall: స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన వైజాగ్ టౌన్ హాల్ - మళ్లీ అందుబాటులోక". ABP Network. Retrieved 5 December 2022.
- ↑ BHATTACHARJEE, SUMIT (19 April 2022). "Visakhapatnam: Town Hall and old municipal building to be converted into training centres for govt. officers". The Hindu. Retrieved 5 December 2023.
- ↑ Basu, Arpit (26 July 2020). "Vizag: Iconic Town Hall en route to regain lost glory". The Times of India. Retrieved 5 December 2023.