డగ్లస్ క్రెయ్వెన్ ఫిలొట్

ఆంగ్లేయ సైనికాధికారీ, హిందుస్తానీ పండితుడూ
(డగ్లస్ క్రెయ్వెన్ ఫిల్లొట్ నుండి దారిమార్పు చెందింది)

లెఫ్టినెన్ట్ కల్నల్ డగ్లస్ క్రెయ్వెన్ ఫిలొట్ (28 జూన్ 1860 - 11 సెప్టెంబర్ 1930[1]) లేదా డగ్లస్ క్రేవెన్ ఫిలొట్ (Douglas Craven Phillott) భారతదేశంలో సేవలందించిన ఒక ఆంగ్లేయ సైనికాధికారి. ఇతను హిందుస్తానీ, పార్సీ భాషలలో పండితుడు. ఇతనికి శ్రేనవిద్యలో[గమనిక 1] కూడా అభిరుచి ఉంది. పార్సీ శ్రేనవిద్యా గ్రంథాన్ని ఇతను ఆంగ్లంలోకి అనువదించాడు.

డగ్లస్ క్రెయ్వెన్ ఫిలొట్
సైనిక దుస్తుల్లో ఉన్న ఫిలొట్ తైలవర్ణ చిత్రం. ఫెల్‌స్టెడ్ స్కూల్‌లో ఉన్న ఈ బొమ్మ సుమారు 1906లో గీయబడింది.
ఫెల్‌స్టడ్ స్కూల్లో చిత్రం సుమారు 1906
జననం(1860-06-28)1860 జూన్ 28
భారతదేశం
మరణం1930 సెప్టెంబరు 11(1930-09-11) (వయసు 70)
జాతీయతఆంగ్లేయుడు
విద్యాసంస్థఫెల్‌స్టెడ్ స్కూల్
వృత్తిసైనికుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హిందుస్తానీ రచనలు
Works
ఫిలొట్ రచనలు

జీవిత విశేషాలు

మార్చు

నాటి ఆంగ్లేయ భారత సైన్యంలోని లెఫ్టినెన్ట్ కల్నల్ హెన్రి రొడ్ని ఫిలొట్‌కూ (Henry Rodney Phillott), లిల్యస్ సైమ్‌కూ (Lilias Syme) ఫిలొట్ మూడవ సంతానం.[2] ఇతను 1874–78 వరకు ఇంగ్లన్డ్‌లోని ఎసిక్స్ కౌన్టీలోని ఫెల్‌స్టెడ్ బడిలో చదువుకున్నాడు. 14 జనవరి 1880లో భారతీయ సైన్యంలో నియామకం పొంది, తరువాత సెన్డ్‌హర్స్ట్‌లో (Sandhurst) శిక్షణ పొందాడు. జోబ్ లోయా, హజారాలలో జరిగిన పోరాటాలలో పాల్గొన్న ఇతనిని 1891లో సాధారణ సేవా పతకం వరించింది. సమన, కుర్రం లోయల్లో అందించిన సేవలకు గానూ రెండు క్లాస్ప్‌లు (clasp) ఉన్న పతకం లభించింది. ఇతను జులై 1,1881న లెఫ్టినెన్ట్‌గా (Lieutenant), జనవరి 14, 1981న కెప్టెన్‌గా (Captain), జనవరి 14, 1900న మెయ్జర్‌గా (Major),[3] జనవరి 14, 1906న లెఫ్టినెన్ట్ కల్నల్‌గా (Lieutenant Colonel) నియామకాలు పొందాడు.[4] 1906లో మూడవ పంజాబ్ అశ్వదళం (తరువాత 23వది అయ్యింది) నుండి పదవీ విరమణ చేసి, కలకత్తా బోర్డ్ ఒఫ్ ఎక్సామినర్స్‌కు (Board of Examiners) కార్యదర్శిగా చేరాడు. 1901–3 వరకు ఫారసీ దేశంలో కొన్సల్‌గా (Consul) పనిచేసాడు.

 
హిందుస్తానీ మెన్యువల్ (Hindustani Manual) (1913) ముఖపత్రం. భారతదేశంలో క్షమాపణలకు వాడే ఒక భంగిమను చూడవచ్చు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇతను కైరోలోనూ, సయేద్ రేవులోనూ ఖైదీలకు చీఫ్ సెన్సర్ (chief censor)గా సేవలందించాడు. తరువాత ఇంగ్లన్డు వెళ్ళిపోయి, లన్డన్‌లోని మెయ్డ వెయ్ల్‌లోనూ (Maida Vale), తరువాతి కాలంలో ఫెల్‌స్టెడ్‌లోనూ ఉండేవాడు. 1930లో అతను చనిపోయేవరకు కెయ్మ్‌బ్రిజ్ విశ్వవిద్యాలయంలో ఉర్దూ, ఫార్సీ భాషలకు పరీక్షకుడిగా పనిచేసాడు.[5][6]

ఇతను ఫార్సీ వ్యాకరణం, ఈజిప్టు అరబీ, శ్రేనవిద్యల పై వ్రాసారు. ఆపైన పక్షిశాస్త్రముపై కూడా కొన్ని చిన్న చిన్న రచనలు చేసారు.[7][8] ఫిలొట్ ఎయ్షాటిక్ ససైటీలో (Asiatic Society) 1889 నవంబరులో ఎన్నుకోబడ్డ సభ్యుడిగానూ, 1910లో ఫెలోగానూ (Fellow) ఉన్నాడు.[9] ససైటీ జర్నల్‌ను ప్రచురించి, ఫిలొలొజికల్ కమిటీ (Philological Committee) కార్యదర్శిగా సేవలందించాడు. దేవనాగరి లిపిని ప్రామాణీకరించే ఆశయంతో ఏర్పడిన హిందీ ఏక-లిపి ససైటీకి ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించాడు.[10]

 

ఈయన సంపాదకత్వం వహించిన రచనల్లో ముఖ్యమైనది ఫ్రొమ్ సిపొయ్ టు సుబేదార్. అక్బరు పాలనా విధానాలను వివరిస్తూ అతని ఆస్థాన చరిత్రాకారుడు వ్రాసిన రచన ఐన్-ఈ-అక్బరీని అనువదించాడు.[5] ఫార్సీ సంప్రదాయ శ్రేనపద్ధతులపై ద బాజ్-నామ-యి-నాసిరీ, అ పర్ష్యన్ ట్రిటైస్ ఒన్ ఫెల్కన్రి (Bāz-nāma-yi Nāṣirī, a Persian treatise on falconry) అనే పుస్తకాన్ని వ్రాసాడు. జెయ్మ్స్ జస్టిన్యన్ మొర్యర్ (James Justinian Morier) అనే ఆంగ్ల నవలా రచయిత వ్రాసిన ద ఎడ్వెన్చర్స్ ఒఫ్ హాజీ బాబా అన్డ్ ఇసాఫాన్ (The adventures of Haji Baba of Isaphan) అనే నవల ఫార్సీ అనువాదానికి ఫిలొట్ సంపాదకుడిగా వ్యవహరించారు.[6] 1912లో కలకత్తా విశ్వవిద్యాలయం ఇతనికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది.

రచనలు

మార్చు

ఫిలొట్ వ్రాసినవి లేక సంపాదకత్వం వహించిన కొన్ని పుస్తకాలు:

జర్నల్స్ (Journals)లో శ్రేనవిద్యపైనా, పక్షులపైనా, వాటి గురించి ఫార్సి సాహిత్యంలో ఉన్న విశేషాల పైనా ప్రచురించాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

గమనికలు

మార్చు
  1. డేగలూ, గ్రద్దలకు శిక్షణ ఇచ్చి, వాటితో ఇతర జంతువులను వేటాడే విద్య

మూలాలు

మార్చు
  1. London Gazette 21 November 1930. p. 7456
  2. Genealogy
  3. "No. 27173". The London Gazette. 13 March 1900. p. 1714.
  4. Hart's annual army list, militia list, and imperial yeomanry list 1908. p. 54e
  5. 5.0 5.1 Safadi, Alison (2010). "From Sepoy to Subedar/ Khvab-o-Khayal and Douglas Craven Phillott" (PDF). The Annual of Urdu Studies. 25: 42–65.
  6. 6.0 6.1 Haddadian-Moghaddam, Esmaeil (2014). Literary Translation in Modern Iran: A sociological study. John Benjamins Publishing Company. pp. 64–66.
  7. Phillott, D.C. (1907). "An egg laid in captivity by a Goshawk". Rec. Indian Mus. 1 (80).
  8. Phillott, D.C. (1907). "Note on the Shahin Falcons (Falco peregrinator and F. barbarus, Blanford)". Journal of the Asiatic Society of Bengal. 3 (5): 389–393.
  9. "List of members of the Asiatic Society of Bengal". Journal and Proceedings of the Asiatic Society of Bengal. 16: 43. 1921.
  10. The Cyclopedia of India. Volume II. Calcutta: Cyclopedia Publishing Company. 1907. pp. 176–177.

వెలుపలి లంకెలు

మార్చు