డర్టీ హరి 2020లో విడుదలైన తెలుగు సినిమా. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్‌ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్‌ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రంలో శ్రవణ్‌ రెడ్డి, సిమ్రత్‌ కౌర్, రుహానీ శర్మ హీరో, హీరోయిన్లుగా నటించగా ఎం. ఎస్. రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2020, డిసెంబరు 18 ఫ్రైడే మూవీస్ ఏటీటీ లో విడుదలైంది.

డర్టీ హరి
Dirty Hari.jpg
దర్శకత్వంఎం. ఎస్. రాజు
నిర్మాతగూడురు సతీష్‌ బాబు
గూడూరు సాయి పునీత్‌
కేదార్‌ సెలగం శెట్టి
వంశీ కారుమంచి
తారాగణంశ్రవణ్‌ రెడ్డి
సిమ్రత్‌ కౌర్
రుహానీ శర్మ
ఛాయాగ్రహణంఎంఎన్‌ బాల్‌ రెడ్డి
కూర్పుజునైద్‌ సిద్ధిఖి
సంగీతంమార్క్ కె రాబిన్
నిర్మాణ
సంస్థ
ఎస్‌పీజే క్రియేషన్స్‌
విడుదల తేదీ
18 డిసెంబర్‌ 2020
సినిమా నిడివి
107నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

మధ్యతరగతి కుటుంబానికి చెందిన హ‌రి (శ్రవణ్‌ రెడ్డి) ఉద్యోగం కోసం హైదరాబాద్ నగరానికి వస్తాడు. హైదరాబాద్ లో ధ‌నవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి వసుధ (రుహాని శర్మ) పరిచయం అవుతుంది, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తుంది. వెళుతుంది. వసుధ సోదరుడి గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ (సిమ్రాత్ కౌర్)కు హరి ఆకర్షితుడవుతాడు. వసుధతో ప్రేమలో ఉంటూనే జాస్మిన్‌తో ఎఫైర్ నడిపిస్తాడు. ఈ సంబంధాలతో హరి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అనేది మిగతా సినిమా కథ.[1]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • నిర్మాణ సంస్థ: ఎస్‌పీజే క్రియేషన్స్‌
  • నిర్మాత: గూడురు సతీష్‌ బాబు, గూడూరు సాయి పునీత్‌
  • స్క్రీన్‌ప్లై, దర్శకత్వం: ఎం. ఎస్. రాజు
  • సంగీతం: మార్క్ కె రాబిన్
  • సినిమాటోగ్రఫీ: ఎంఎన్‌ బాల్‌ రెడ్డి
  • ఎడిటర్‌ : జునైద్‌ సిద్ధిఖి
  • ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్

మూలాలుసవరించు

  1. Eenadu (19 December 2020). "రివ్యూ: డర్టీ హరి - MS Raju Dirty Hari telugu Movie review". www.eenadu.net. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  2. Sakshi (15 December 2020). "రాముడు... రావణుడు కాదు!". Sakshi. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  3. Sakshi (16 December 2020). "రాజుగారు అలా వచ్చారు: 'డర్టీ హరి' హీరోయిన్‌". Sakshi. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=డర్టీ_హరి&oldid=3467520" నుండి వెలికితీశారు