డాబర్

భారతీయ బహుళజాతి వినియోగ వస్తువులు కంపెనీ

డాబర్ లిమిటెడ్ (Dabur Ltd) అనేది ఒక భారతీయ బహుళజాతి కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ, ఈ సంస్థను ఎస్ కె బర్మన్ చే స్థాపించబడింది.దీని ప్రధాన కార్యాలయం ఘజియాబాద్ లో ఉంది.[1] డాబర్ సంస్థ ఆయుర్వేద వైద్యం, వినియోగదారుల ఉత్పత్తులను తయారు చేస్తుంది, భారతదేశంలో అతిపెద్ద మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలలో ఒకటిగా ఉంది.[2]

Dabur India Limited
రకంPublic
ISININE016A01026
పరిశ్రమConsumer goods
స్థాపన1884; 141 సంవత్సరాల క్రితం (1884)
స్థాపకుడుఎస్.కె. బర్మన్
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
సేవ చేసే ప్రాంతము
ప్రపంచవ్యాప్తంగా
కీలక వ్యక్తులు
ఉత్పత్తులు
రెవెన్యూIncrease 8,989 crore (US$1.1 billion) (2020)[3]
Increase 1,827 crore (US$230 million) (2020)[3]
Increase 1,444 crore (US$180 million) (2020)[3]
Total assetsIncrease 9,354 crore (US$1.2 billion) (2020)[3]
ఉద్యోగుల సంఖ్య
7,740 (March 2020)[3]
అనుబంధ సంస్థలు
వెబ్‌సైట్www.dabur.com Edit this on Wikidata
Footnotes / references
[4]

చరిత్ర

మార్చు

1884 సంవత్సరంలో, ఆయుర్వేద వైద్యుడు అయిన డాక్టర్ ఎస్.కె. బర్మన్ కలకత్తాలో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రారంభించాడు. కలరా, మలేరియా వంటి వ్యాధులకు అతను మందులను తయారు చేశాడు .అతను తన ఆయుర్వేద సూత్రీకరణలను సామూహికంగా ఉత్పత్తి చేయడానికి డాబర్ ఇండియా లిమిటెడ్ ను స్థాపించాడు.

డాబర్ ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రజాదరణతో, డాక్టర్ బర్మన్ 1896 సంవత్సరంలో తన వ్యాపారము విస్తరించాడు. డాబర్ ప్రకృతి-ఆధారిత ఆయుర్వేద మందుల ప్రత్యేక ప్రాంతంలోకి ప్రవేశించాడు, దీని కోసం ప్రామాణిక మందులు మార్కెట్లో అందుబాటులో లేవు. 1920 లలో సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల భారీ ఉత్పత్తి కోసం శాస్త్రీయ ప్రక్రియలు, నాణ్యతా తనిఖీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం పరిశోధనా ప్రయోగశాలల స్థాపనకు దారితీసింది.[5]

ఒక చిన్న ఫార్మసీతో ప్రారంభించిన డాబర్ ఇండియా, పరిశ్రమలలో ఉన్నత మనుగడ సాధించి, ప్రస్తుతము రూ .2,396 కోట్ల టర్నోవర్ తో దేశంలో నాల్గవ అతిపెద్ద ఎఫ్ ఎమ్ సిజి కంపెనీగా ఉంది.తన ఉత్పత్తులలో ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ, ఆహార విభాగానికి సేవలందిస్తుంది. ఏప్రిల్ 2009లో, ఢిల్లీ హైకోర్టు డాబర్ ఇండియాతో ఫెమ్ కేర్ ఫార్మాను విలీనం చేసే పథకానికి ఆమోదం తెలిపింది.జూలై 2010 సంవత్సరం లో, కంపెనీ పూర్తి స్వంత అనుబంధ సంస్థ డాబర్ ఇంటర్నేషనల్ టర్కీలోని ప్రఖ్యాత వ్యక్తిగత సంరక్షణ కంపెనీలో 100% వాటాను కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది, అంటే హోబి గ్రూప్ సంస్థలు హోబి కోజ్మెటిక్, జెకి ప్లాస్టిక్, రా పజర్లామాలను మొత్తం పరిగణనలోకి తీసుకొని US$69 మిలియన్ల మొత్తం పరిగణనలోకి తీసుకుంది.[6]

అభివృద్ధి

మార్చు
 
డాబర్ ఉత్పత్తులలో తేనె

డాబర్ ఇండియా లిమిటెడ్ అనేది 250కి పైగా హెర్బల్/ఆయుర్వేద ఉత్పత్తుల పోర్ట్ ఫోలియోతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుర్వేద, నేచురల్ హెల్త్ కేర్ కంపెనీ. డాబర్ 136 సంవత్సరాలకు పైగా నాణ్యత, అనుభవం తో తయారు కావడం జరుగుతుంది. డాబర్ ఇండియా 'కస్టోడియన్ ఆఫ్ ఆయుర్వేద'గా ప్రసిద్ధి చెందిన డాబర్ తరతరాలుగా, భౌగోళికంగా వినియోగదారుల కోసం ఉత్పత్తులను అభివృద్ధి చేయడం జరుగుతున్నది. డాబర్ తయారీలో జుట్టు సంరక్షణ,ఓరల్ కేర్,చర్మ సంరక్షణ, హోమ్ కేర్ అండ్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ కంపెనీకి విస్త్రృత పంపిణీ వ్యవస్థ నెట్ వర్క్ ఉంది, తద్వారా పట్టణ, గ్రామీణ మార్కెట్ ల్లో6.7 మిలియన్లకు పైగా రిటైల్ అవుట్ లెట్ లను కవర్ చేస్తుంది. డాబర్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తులు విదేశీ మార్కెట్లలో మంచి పేరుతొ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1100 కి పైగా దేశాలలో డాబర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. దీని బ్రాండ్లు మిడిల్ ఈస్ట్ , ఆఫ్రికా, సార్క్ దేశాలు, అమెరికా , యూరప్, ఆసియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. డాబర్ విదేశీ ఆదాయాలు మొత్తం టర్నోవర్ లో 28.2% వాటాను కలిగి ఉన్నాయి.[7]

అవార్డులు

మార్చు

డాబర్ సంస్థ అవార్డులు ఈ విధం గా ఉన్నాయి[8].

  • డాబర్ చ్యవన్ ప్రాష్ ఇమ్యూన్ ఇండియా క్యాంపెయిన్ బెస్ట్ స్కూల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కు గోల్డ్ అవార్డ్ ను గెలుచుకుంది.
  • భారతదేశంలోని 50 ఉత్తమ బ్లూ చిప్ కంపెనీలలో డాబర్ ఉత్తమ పెట్టుబడిదారుల రాబడులను అందిస్తుంది.
  • 2010లో డాబర్ ఇండియా మొదటి 5 భారతీయ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.
  • దలాల్ స్ట్రీట్ జర్నల్ లో భారతదేశపు సంపద సృష్టికర్తలలో డాబర్ ఇండియా లిమిటెడ్ 19 వ స్థానంలో ఉంది.
  • డాబర్ బిఎస్-1000 జాబితాలో 158 స్థానంలో ఉంది. సూపర్ ర్యాంక్ లో డాబర్ నెం.9 స్థానం ఉంది.
  • FMCG-పర్సనల్ కేర్ లో డాబర్ అతిపెద్ద సంపద సృష్టికర్తగా కేటగిరీ విజేత.
  • డాబర్ 2009 సంవత్సరంలో సూపర్ 100 జాబితాలో 79 వ స్థానం.
  • డాబర్ భారతదేశపు 25వ అత్యంత విలువైన బ్రాండ్.

మూలాలు

మార్చు
  1. "Trust Advisory -ALL INDIA BRAND TRUST RANKING 2014 (TOP 1200 BRANDS)". web.archive.org. 2015-05-02. Archived from the original on 2015-05-02. Retrieved 2022-06-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "The FMCG leader – Dabur". outlookmoney.com/ (in ఇంగ్లీష్). Retrieved 2022-06-24.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "Dabur Ltd Results" (PDF). Dabur. Archived from the original (PDF) on 2021-08-30. Retrieved 2022-06-24.
  4. "Annual Report 2014-15". Dabur.com. Archived from the original on 5 ఫిబ్రవరి 2022. Retrieved 13 April 2017.
  5. "The Brand Story Of Dabur And Its Reinvention" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-03-28. Archived from the original on 2021-08-05. Retrieved 2022-06-24.
  6. "Dabur India: Reports, Company History, Directors Report, Chairman's Speech, Auditors Report of Dabur India - NDTV". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-24.
  7. "Dabur India Ltd | Products and Brands". IndianCompanies.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-12. Retrieved 2022-06-24.
  8. "Awards & Memberships of Dabur India Limited | Sahibabad, Ghaziabad". www.indiamart.com. Retrieved 2022-06-24.
"https://te.wikipedia.org/w/index.php?title=డాబర్&oldid=3846348" నుండి వెలికితీశారు