భారత డిజిటల్ లైబ్రరీ

(డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా నుండి దారిమార్పు చెందింది)

భారత డిజిటల్ లైబ్రరీ (Digital Library of India) [1][2] [3] ప్రాజెక్టులో మనదేశములోని వివిధ భాషలలోని పుస్తకాలను డిజిటల్ రూపంలోకి మార్చి అంతర్జాలం ద్వారా ఎవరైనా చదివే లేక పొందే ఏర్పాటు కలది. ఈ ప్రాజెక్టు సార్పత్రిక డిజిటల్ లైబ్రరీలో భాగంగా చేపట్టబడింది. భారత డిజిటల్ లైబ్రరీప్రాజెక్టులో భాగంగా, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం లోని ఎంపిక చేసిన పుస్తకాలను[4] స్కానింగు చేసి అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం తరపున 14,343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.జులై 2012 నాటికే మొత్తం భాగస్వామ్యాలద్వారా 23361 పైగా తెలుగు పుస్తకాలు 4,480,653 మొత్తం పేజీలతో డిజిటల్ రూపంలో (బొమ్మ) అందుబాటులో ఉన్నాయి. అన్ని భాషలలో కలిపి 3,47,462 పుస్తకాలు, 123,390,315 మొత్తం పేజీలు డిజిటైజ్ చేయబడ్డాయి..[5] పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో డిజిటల్ లైబ్రరీ ఫథకాలకు 70కోట్ల రూపాయల ప్రణాళిక తయారుచేయబడింది.[6]

భారత డిజిటల్ లైబ్రరీ ముఖపత్రం

చదువుటకు సూచనలు

మార్చు

వెబ్సైట్ లో చదువుటకు టిఫ్ (TIFF) బొమ్మలు చూపెట్టగలిగే ఉపకరణము, మీ విహరిణిలో స్థాపించుకోవాలి. ఇంటర్నెట్ ఎక్సోప్లోరర్ వాడితే ఆల్టెర్నాటిఫ్ (alternatiff) వాడాలి. లినక్స్ ఫైర్‌ఫాక్స్ వాడుకరులు, మొజ్‌ప్లగ్గర్ (mozplugger) పొడిగింతను స్థాపించుకోవాలి. ఫైర్పాక్స్ (3.6.3) లో ఒక పేజి చూపించే లింకు మాత్రమే పనిచేస్తున్నది. పేజీలు తిప్పడానికి, క్రింద వున్న వచ్చే ప్రేమ్లో క్రిందదాక పోవాలి ( పేజీ డౌన్ చేయాలి).

ఇతర లభ్య స్థలాలు

మార్చు

డిఎల్ఐ వెబ్సైటు ఆగష్టు 2017 నుండి కొంతమంది కాపీరైట్ అభ్యంతరాలవలన ఆపివేయబడినా,[7] చాలా పుస్తకాలు ఆర్కైవ్. ఆర్గ్ లో నవంబర్ 2016 నుండి అందుబాటులో ఉన్నాయి[8].[9] వీరి పుస్తకపు పేజీలను చూపించే సాఫ్ట్వేర్ వాడుకరులకు సులభంగా, అన్ని విహరిణులలో పనిచేస్తుంది. 'నడుపు' బొత్తాము నొక్కితే, పేజీలు స్వయంచాలకంగా తిప్పబడతాయి.

వాడుకరుల గణాంకాలు

మార్చు

ఏప్రిల్ 2012 లో ఐఐఎస్సి నిర్వహించే సైటులో నెలరోజుల గణాంకాలను పరిశీలించితే [10] అన్ని భాషల పుస్తకాలమొత్తానికి సగటు గణాంకాలు ఇలా ఉన్నాయి.

  • రోజుకి సగటు వాడుకరులు: 1800
  • ఇంతకు ముందు వాడి మరలా వాడేవారు:1020
  • రోజు కొత్తగా వచ్చేవారు: 778
  • సగటు రోజు పేజీవీక్షణలు:57674

ఇవీ చూడండి

మార్చు

వనరులు

మార్చు
  1. "భారత డిజిటల్ లైబ్రరీ". Archived from the original on 2019-04-17. Retrieved 2010-09-30.
  2. "ఐఐఐటి, హైద్రాబాద్ లో భారత డిజిటల్ లైబ్రరీ". Archived from the original on 2007-08-27. Retrieved 2010-09-30.
  3. "సిడాక్ నోయిడా లోభారత డిజిటల్ లైబ్రరీ". Archived from the original on 2011-04-30. Retrieved 2010-09-30.
  4. వెంకమ్మ. "డిజిటల్ లైబ్రరీ నివేదిక" (PDF). Archived from the original (PDF) on 2015-09-19.
  5. "సార్వత్రిక డిజిటల్ లైబ్రరీ గణాంకాలు నవంబర్ 2007". Archived from the original on 2012-07-21. Retrieved 2012-07-03.
  6. ఐటిశాఖ ప్రణాళిక (పేజీ 98) [permanent dead link]
  7. "DLI home page notification archived". Archived from the original on 2017-08-22. Retrieved 2020-07-20.
  8. "Digital Library India Collection at Archive.org". Retrieved 2020-07-20.
  9. Griffin, Peter. "Carl Malamud contends that all the books will be out of copyright at some point". The hindu. Retrieved 6 April 2018.
  10. "గణాంకాల నివేదిక ఏప్రిల్ 2012, పరిశీలన తేది: 3 జులై 2012". Archived from the original on 2012-11-26. Retrieved 2012-07-03.