డిటెక్టివ్‌ 2017లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా తమిళంలో ‘తుప్పరివాలన్‌’. తెలుగులో ‘డిటెక్టివ్‌’ పేరుతో విడుదలైంది. హరి వెంకటేశ్వర పిక్చర్స్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విశాల్, జి.హరి నిర్మించిన ఈ సినిమా మిస్కిన్‌ దర్శకత్వం వహించాడు. విశాల్, ప్రసన్న, అను ఇమ్మాన్యుయేల్‌, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 10 నవంబర్ 2017న విడుదలైంది.

డిటెక్టివ్‌
దర్శకత్వంమిస్కిన్‌
రచనమిస్కిన్‌
నిర్మాతవిశాల్ , జి.హరి
తారాగణంవిశాల్, ప్రసన్న, అను ఇమ్మాన్యుయేల్‌, ఆండ్రియా
ఛాయాగ్రహణంకార్తీక్ వెంకట్రామన్
కూర్పుఎన్ . అరుణ్ కుమార్
సంగీతంఅరోల్‌ కొరెల్లి
నిర్మాణ
సంస్థలు
హరి వెంకటేశ్వర పిక్చర్స్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ
10 నవంబర్ 2017
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

అద్వైత భూషణ్ (విశాల్) ఓ ప్రైవేట్ డిటెక్టివ్. మనోహర్ (ప్రసన్న) అతని అసిస్టెంట్. కేసులు లేవని బాధపడుతున్న నేపథ్యంలో ఓ స్కూల్ విద్యార్థి తన పెంపుడు కుక్కను చంపినదెవరో తెలుసుకోవాలని అద్వైత భూషణ్‌ను కోరుతాడు. ఆ కేసు కూపీ లాగుతున్న క్రమంలో వరుస హత్యలకి సంబందించిన విషయాలు అద్వైత భూషణ్ దృష్టికి వస్తాయి. హంతకులు హత్యలు చేసి వాటిని యాక్సిడెంట్స్‌గా నమ్మిస్తారు. ఆ హత్యల వెనుక డెవిల్ (వినయ్), భాగ్యరాజా, ఆండ్రియాతో కూడిన గ్యాంగ్ హస్తం ఉందని తెలుస్తుంది. వారందరూ హత్యలు ఎందుకు చేశారు. ఆ హత్యల వెనుక మిస్టరీ ఏమిటీ ? డిటెక్టివ్ అద్వైత భూషణ్ ఆ కేసుని ఎలా ఛేదించాడు? అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: హరి వెంకటేశ్వర పిక్చర్స్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
  • నిర్మాత: విశాల్ , జి.హరి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మిస్కిన్‌
  • సంగీతం: అరోల్‌ కొరెల్లి
  • సినిమాటోగ్రఫీ: కార్తీక్ వెంకట్రామన్
  • మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి

ఇవి కూడ చూడండి మార్చు

జీతూ జోసెఫ్

మూలాలు మార్చు

  1. The Times of India (10 November 2017). "Detective Review {3.5/5}: This is one film you won't regret watching". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 7 ఆగస్టు 2021 suggested (help)
  2. Zee Cinemalu (10 November 2017). "'డిటెక్టివ్' రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 30 ఆగస్టు 2021. Retrieved 30 August 2021.