జీతూ జోసఫ్, మలయాళ సినిమా దర్శకుడు, రచయిత, డిటెక్టివ్ ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2010వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన మమ్మీ అండ్ మీ చిత్రం మలయాళ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అలాగే 2012వ సంవత్సరంలో విడుదలైన మై బాస్ చిత్రం కూడా ప్రేక్షకులను బాగా అలరించింది.

జీతూ జోసఫ్
జననం (1972-11-10) 1972 నవంబరు 10 (వయస్సు 49)
ఎర్నాకులం
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు, రచయిత

మోహన్ లాల్ హీరోగా జీతూ దర్శకత్వంలో తెరకెక్కిన 'దృశ్యం' చిత్రం అతనికి మంచి పాపులారిటీని తీసుకొచ్చి పెట్టింది. ఇదే చిత్రం తమిళ వెర్షనులో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించగా, ఆ సినిమాకి కూడా జీతూయే దర్శకత్వం వహించాడు . 'దృశ్యం' చిత్రం మలయాళంలో కొత్త రికార్డులను తిరగరాసి.. దాదాపు 50 కోట్ల రూపాయల వరకూ వసూళ్లు సాధించింది.

దర్శకుడు జయరాజ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన జీతూ.. తర్వాత అవకాశాలు దక్కించుకోవడానికి చాలా కష్టపడ్డాడు.అతని తొలి సినిమాకి జీతూ తల్లే నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. నిర్మలా కాలేజీలో చదువుకున్న జీతూకి ఒక భార్య, ఇద్దరు పిల్లలు.

చిత్రాలుసవరించు

మలయాళంసవరించు

 1. డిటెక్టివ్ (2007)
 2. మమ్మీ అండ్ మీ (2010)
 3. మై బాస్ (2012)
 4. మెమోరీస్ (2013)
 5. దృశ్యం (2013)
 6. లైఫ్ ఆఫ్ జోసుట్టి (2015)
 7. ఊజమ్ (2016)
 8. ఆది (2018)
 9. మిస్టర్ అండ్ మిసెస్ రౌడీ (2019)
 10. ది బాడీ (2019)
 11. తంబి (2019)
 12. రామ్ (2020)

తమిళంసవరించు

 1. పాపనాశం (2015)

అవార్డులుసవరించు

కేరళ రాష్ట్ర అవార్డులు

 1. ఉత్తమ ప్రజారంజక చిత్రం - దృశ్యం, 2013

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు