డిటెక్టివ్

(డిటెక్టివ్‌ నుండి దారిమార్పు చెందింది)

డిటెక్టివ్‌ 2017లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా తమిళంలో ‘తుప్పరివాలన్‌’. తెలుగులో ‘డిటెక్టివ్‌’ పేరుతో విడుదలైంది. హరి వెంకటేశ్వర పిక్చర్స్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విశాల్, జి.హరి నిర్మించిన ఈ సినిమా మిస్కిన్‌ దర్శకత్వం వహించాడు. విశాల్, ప్రసన్న, అను ఇమ్మాన్యుయేల్‌, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 10 నవంబర్ 2017న విడుదలైంది.

డిటెక్టివ్‌
దర్శకత్వంమిస్కిన్‌
కథా రచయితమిస్కిన్‌
నిర్మాతవిశాల్ , జి.హరి
తారాగణంవిశాల్, ప్రసన్న, అను ఇమ్మాన్యుయేల్‌, ఆండ్రియా
ఛాయాగ్రహణంకార్తీక్ వెంకట్రామన్
కూర్పుఎన్ . అరుణ్ కుమార్
సంగీతంఅరోల్‌ కొరెల్లి
నిర్మాణ
సంస్థలు
హరి వెంకటేశ్వర పిక్చర్స్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ
10 నవంబర్ 2017
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

అద్వైత భూషణ్ (విశాల్) ఓ ప్రైవేట్ డిటెక్టివ్. మనోహర్ (ప్రసన్న) అతని అసిస్టెంట్. కేసులు లేవని బాధపడుతున్న నేపథ్యంలో ఓ స్కూల్ విద్యార్థి తన పెంపుడు కుక్కను చంపినదెవరో తెలుసుకోవాలని అద్వైత భూషణ్‌ను కోరుతాడు. ఆ కేసు కూపీ లాగుతున్న క్రమంలో వరుస హత్యలకి సంబందించిన విషయాలు అద్వైత భూషణ్ దృష్టికి వస్తాయి. హంతకులు హత్యలు చేసి వాటిని యాక్సిడెంట్స్‌గా నమ్మిస్తారు. ఆ హత్యల వెనుక డెవిల్ (వినయ్), భాగ్యరాజా, ఆండ్రియాతో కూడిన గ్యాంగ్ హస్తం ఉందని తెలుస్తుంది. వారందరూ హత్యలు ఎందుకు చేశారు. ఆ హత్యల వెనుక మిస్టరీ ఏమిటీ ? డిటెక్టివ్ అద్వైత భూషణ్ ఆ కేసుని ఎలా ఛేదించాడు? అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులుసవరించు

 • విశాల్
 • ప్రసన్న
 • అను ఇమ్మాన్యుయేల్‌
 • ఆండ్రియా
 • సిమ్రాన్
 • కె .భాగ్యరాజ్
 • జాన్ విజయ్
 • మాస్టర్ నిశేష్
 • విన్సెన్ట్ అశోకన్
 • అశ్వత్
 • ధీరజ్ రత్నం
 • సిద్ధాంత్ వెంకటేష్
 • షాజీ చెన్
 • అభిషేక్‌ శంకర్‌
 • జయప్రకాశ్
 • రవి మరియా
 • ఆడుకాళం నరేన్
 • అజయ్ రత్నం
 • తలైవాసల్ విజయ్

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: హరి వెంకటేశ్వర పిక్చర్స్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
 • నిర్మాత: విశాల్ , జి.హరి
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మిస్కిన్‌
 • సంగీతం: అరోల్‌ కొరెల్లి
 • సినిమాటోగ్రఫీ: కార్తీక్ వెంకట్రామన్
 • మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి

మూలాలుసవరించు

 1. The Times of India (10 November 2017). "Detective Review {3.5/5}: This is one film you won't regret watching". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.
 2. Zee Cinemalu (10 November 2017). "'డిటెక్టివ్' రివ్యూ" (in ఇంగ్లీష్). Retrieved 30 August 2021.