డియర్ కామ్రేడ్ 2019, జూలై 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణా నటించగా జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించాడు.

డియర్ కామ్రేడ్
సినిమా పోస్టర్
దర్శకత్వంభరత్ కమ్మ
నిర్మాతనవీన్ వై రవి శంకర్ సివి మోహన్
తారాగణంవిజయ్ దేవరకొండ
రష్మిక మందాన
సంగీతంజస్టిన్ ప్రభాకర్
విడుదల తేదీ
26 జూలై 2019 (2019-07-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

చైతన్య అలియాస్ బాబీ (విజయ్‌ దేవరకొండ) విప్లవ భావాలున్న కాలేజీ స్టూడెంట్‌. కాకినాడలోని కాలేజ్‌లో చదువుకునే బాబీ తన కోపం కారణంగా చాలా మందితో గొడవలు పడతాడు. అపర్ణా దేవీ అలియాస్‌ లిల్లీ (రష్మిక మందన్న) రాష్ట్ర స్థాయి క్రికెట్ క్రీడాకారిని. తన కజిన్‌ పెళ్లి కోసం కాకినాడ వచ్చిన లిల్లీ, బాబీతో ప్రేమలో పడుతుంది. కానీ అతని కోపం, గొడవల కారణంగా వారిద్దరూ దూరమవుతారు. లిల్లీ దూరం అవ్వటంతో బాబీ పిచ్చివాడైపోతాడు. మూడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు.

నెమ్మదిగా ఆ బాధను మరిచిపోయిన బాబీ ఓ ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్‌ వస్తాడు. అక్కడ లిల్లీని కలుస్తాడు. తను మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుందని తెలుసుకొని ఆమె కోలుకునేలా చేస్తాడు. అదే సమయంలో లిల్లీ ఆరోగ్యం పాడవ్వడానికి, క్రికెట్కు దూరమవ్వటానికి క్రికెట్ అసోసియేషన్‌ చైర్మన్ వేదింపులే కారణమని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి బాబీ ఏం చేశాడు..? లిల్లీ తిరిగి క్రికెటర్‌ అయ్యిందా? లేదా? అన్నదే మిగతా కథ లోని భాగం

తారాగణం

మార్చు

మూలాలు

మార్చు

https://telugu.filmibeat.com/movies/dear-comrade/cast-crew.html

బయటి లంకెలు

మార్చు

. కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే