దత్తాత్రయ సావంత్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాందేడ్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]

డి.పి. సావంత్

ఉన్నత & సాంకేతిక విద్య రాష్ట్ర మంత్రి

పదవీ కాలం
2009 – 2019
తరువాత బాలాజీ కళ్యాణ్కర్
నియోజకవర్గం నాందేడ్ నార్త్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

డి.పి. సావంత్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాందేడ్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి అనుసయ ప్రకాష్ ఖేద్కర్‌పై 44,082 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2014 ఎన్నికలలో ఐఎన్‌సీఅభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుధాకర్ పండరేపై 7,602 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3][4] ఉన్నత & సాంకేతిక విద్య రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.

డి.పి. సావంత్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాందేడ్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి బాలాజీ కళ్యాణ్కర్ చేతిలో 44,082 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]

మూలాలు

మార్చు
  1. "Ex-min & aide of Ashok Chavan says he remains 'with Congress'". The Times of India. 9 August 2024. Archived from the original on 10 August 2024. Retrieved 16 December 2024.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. "Nanded North Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.