దొడ్డాలహళ్లి కెంపెగౌడ సురేష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.[2]

డీ.కే. సురేశ్

లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2013 - 2024
ముందు హెచ్. డి. కుమారస్వామి
తరువాత సి. ఎన్. మంజునాథ్
నియోజకవర్గం బెంగళూరు గ్రామీణ

వ్యక్తిగత వివరాలు

జననం (1966-12-18) 1966 డిసెంబరు 18 (వయసు 58).[1]
రామనగర జిల్లా, కర్ణాటక, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు Mr. D. కెంపెగౌడ (తండ్రి),
గౌరమ్మ (తల్లి)
బంధువులు డీ.కే. శివ కుమార్ (అన్న)
సంతానం 1 కుమారుడు.
నివాసం బెంగుళూరు & న్యూఢిల్లీ
వృత్తి వ్యాపారవేత్త&
రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

డీ.కే. సురేశ్ తన సోదరుడు డీ.కే. శివ కుమార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చాడు. 2009లో జరిగిన ఎన్నికల్లో హెచ్. డి. కుమారస్వామి జేడీఎస్‌ అభ్యర్థిగా గెలిచి అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో రాజీనామా చేయగా తరువాత 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో డి.కె.సురేశ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన సాధార ణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పి.మునిరాజుగౌడ పై 2,31,480 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.

డీ.కే. సురేశ్ 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశ్వత్ నారాయణ్ గౌడ పై 2,06,870 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సి. ఎన్. మంజునాథ్ చేతిలో 269647ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. "Member Profile". Lok Sabha website. Archived from the original on 11 November 2016. Retrieved 1 January 2014.
  2. Andhra Jyothy (19 March 2019). "బెంగళూరు గ్రామీణలో డీకే సురేశ్‌ హ్యాట్రిక్‌ సాధించేనా..?". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bangalore Rural". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  4. India Today (4 June 2024). "DK Suresh loses to BJP's CN Manjunath from Bengaluru Rural by over 2 lakh votes" (in ఇంగ్లీష్). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.