డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్

డెక్కన్ క్వీన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లేదా డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ లేదా డెక్కన్ క్వీన్ (మరాఠీలో राणी दख्खनची అనువాదం), ఒక భారతీయ ప్రయాణీకుల రైలు. ఇది పూణేతో ముంబైను కలుపుతుంది. ఈ రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రైళ్లులో ఇది ఒకటి. అంతేకాక రెండు నగరాల మధ్య ప్రయాణించే వేల కొద్దీ ప్రయాణీకులకు రోజువారీ రవాణా యొక్క మార్గంగా ఇది ఉంది. ఇది భారతీయ రైల్వేలులో ఒక ప్రతిష్ఠాత్మకమైన రైలు.

'డెక్కన్ క్వీన్
Deccan Queen
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర
తొలి సేవ1 జూన్ 1930; 94 సంవత్సరాల క్రితం (1930-06-01)
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే
మార్గం
మొదలుముంబై సిఎస్‌టి
ఆగే స్టేషనులు3 (ముంబై సిఎస్‌టి - పూణే జంక్షన్)
2 (పూణే జంక్షన్ - ముంబై సిఎస్‌టి)
గమ్యంపూణే జంక్షన్
ప్రయాణ దూరం192.2 కి.మీ. (119.4 మై.)
సగటు ప్రయాణ సమయం3 గం., 10 ని.లు
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)12123 / 12124
సదుపాయాలు
శ్రేణులుఎసి చైర్ కార్, చైర్ కార్, జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలుఉంది, చెల్లింపు సేవ
సాంకేతికత
రోలింగ్ స్టాక్కల్యాణ్ డబ్ల్యుసిఎం-3
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం60 km/h (37 mph) సగటుతో చేరుతుంది
మార్గపటం
ముంబై సిఎస్‌టి
దాదర్ (ముంబై సిఎస్‌టి దిశగా)
పర్సిక్ సొరంగం
కర్జత్ (పూణే జంక్షన్ దిశగా )
భోర్ ఘాట్ ప్రారంభం
మంకీ హిల్(ముంబై సిఎస్‌టి వైపు సాంకేతిక నిలుపుదల)
భోర్ ఘాట్ అంత్యము
ఖండాలా(ముంబై సిఎస్‌టి వైపు సాంకేతిక నిలుపుదల)
లోనావాలా
శివాజీనగర్ (పూణే జంక్షన్ దిశగా)
పూణే

చరిత్ర

మార్చు
 
ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

డెక్కన్ క్వీన్ 1930 జూన్ 1 న ప్రారంభించారు. బ్రిటిష్ వారు భారతదేశమును పరిపాలిస్తున్న రోజులలో, భారతదేశం లోని బ్రిటిష్ ప్రజలు అయిన వారికోసం, పడవ పందెముల అభిమానులు కొరకు, పూనా (ప్రస్తుతం పూణే) నుండి బాంబే (ప్రస్తుతం ముంబై) వరకు ఏర్పడిన (ఏర్పాటు చేయబడ్డ) ఒక వారాంతం రైలు.[1] రైలు యొక్క మొదటి సేవలు కళ్యాణ్ నుండి, పూనా వరకు నిర్వహించారు. ఇది బాంబే విక్టోరియా టెర్మినస్ నుంచి ప్రారంభమయిన (ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ సిఎస్‌టిఎంగా మార్చారు) కొద్దికాలంలోనే దీనిని ఒక రోజువారీ సేవకు మార్చారు. ఇది భారతీయ రైల్వేలు యందు అతి దీర్ఘకాలంగా, అంతరాయం లేకుండా, ఆవిరి శక్తిని (స్టీం ఇంజను) ఎప్పుడూ అమలు పరచకుండా నడుస్తున్న రైళ్లు జాబితా వాటిలో ఇది ఒకటి. డెక్కన్ క్వీన్ ప్రారంభం నుండి, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ మాత్రమే ఉపయోగించి అమలు చేయబడింది. అప్పుడప్పుడు, అసలు లోకోమోటివ్ వైఫల్యం చెందిన విషయంలో మాత్రము, డీజిల్ ఇంజను వాహనము డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ నకు ఇవ్వబడింది. ఈ రైలు రేక్ రంగులో ఎరుపు నుండి పసుపునకు అటు తర్వాత నీలం రంగునకు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.[1]

ప్రథమ స్థానములు

మార్చు
 
డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్

డెక్కన్ క్వీన్ అనేక విషయములలో ప్రథమ స్థానంలో ఉంది లేదా ప్రథమ స్థానములలో డెక్కన్ క్వీన్ పాత్ర :

  • తను భారతదేశం యొక్క మొదటి సూపర్‌ఫాస్ట్ రైలు.
  • తను విద్యుత్తుతో నెట్టబడే మొదటి సుదూర ప్రయాణీకుల రైలు.
  • తను భారతదేశం యొక్క మొదటి కారిడార్ రైళ్లు యందు ఒకటి.
  • డెక్కన్ క్వీన్, లో కేవలం స్త్రీలు (లేడీస్) కోసం మాత్రమే ఒక భోగీ (కారు) కలిగిన మొదటి రైలు, ప్రథమ స్థానములలో ఉన్నవాటిలో ఈ అంశాన్ని కలిగి ఉండటం ఒక విశేషం.
  • ఈ రైలుకు ఒక ఉత్తేజకరమైన, గిరిగీసిన చరిత్ర కలిగి ఉంది.
  • డెక్కన్ క్వీన్, 1966 సం.లో భారతీయ రైల్వేలు నుండి ప్రామాణిక సమగ్ర వ్యతిరేక టేలీస్కోపిక్ కార్లతో కూడిన ఒక సరికొత్త కొత్త రేక్ వచ్చిన దానిని పొందింది.
  • రైలు చరిత్ర ప్రారంభం నుండి, మొదటిసారిగా మూడవ తరగతి (ఇప్పుడు రెండవ తరగతి) ప్రయాణీకులను ఈ రైలు ద్వారా ప్రయాణం కొరకు అనుమతించారు.
  • ప్రారంభం నుండి 1966 సం. వరకు దీనికి మాత్రమే రిజర్వు మొదటి తరగతి ఏర్పాటు ఉంది.

భారతదేశం యొక్క మొదటి ISO సర్టిఫైడ్ రైలు భోపాల్ హబీబ్గంజ్ (భోపాల్ ) - హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) మధ్య నడుస్తూ ఉన్న షాన్ - ఇ - భోపాల్ ఎక్స్‌ప్రెస్ తర్వాత డెక్కన్ క్వీన్ భారతదేశంలో ఐఎస్‌ఒ (ISO) 9000 సర్టిఫికేషన్ కలిగిన రెండవ రైలు.[1] ఇంజనుతో సహా ఇది పదహారు కోచ్‌లు కలిగి ఉంటుంది.

డెక్కన్ క్వీన్ సైతం రైలు అభిమానులకు అత్యంత ఇష్టమైన రైళ్లు యందు ఇది ఒకటి. ప్రతి సంవత్సరం జూన్, 1 న దీనిలో ప్రయాణించే సాధారణ నెలవారీ ప్రయాణీకులు, రైలు అభిమానులు, ప్రయాణీకులు, రైల్వే అధికారులు అందరూ రైలు యొక్క పుట్టినరోజు జరుపుకుంటారు. 'డెక్కన్ క్వీన్ 2015 జూన్ 1 నాటికి దాని సేవల యొక్క 86 వ సంవత్సరం లోనికి ప్రవేశించింది.' [2]

 
డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ నామఫలకం

షెడ్యూల్

మార్చు

ఈ రైలు మొత్తం 192 కిలోమీటర్ల దూరం, పూణే నుండి ముంబైకు ప్రయాణిస్తుండగా, రైలు నెంబర్ 12124 (అప్) గాను, తిరుగు ప్రయాణంలో ముంబై నుండి పూణే దానికోసం నంబరు 12123 (డౌన్) గాను ఉంది. రైలు కేవలం 3.15 గం.ల లోపల ఈ ప్రయాణం పూర్తి చేస్తుంది. అదే ఈ దూరాన్ని బస్సు పూర్తి చేయాలంటే కనీసం 4 నుంచి 5 గంటలు పడుతుంది..

12123 ముంబై నుండి పూణే

మార్చు
రేక్
లోకో 1 2 3 4 5 6 7 8 9 10 - 11 12 13 14 15 16 17 18
  హెచ్‌పి/ఎస్‌ఎల్‌ఆర్ జనరల్2 డి10

(ఎంఏస్‌టి2)

డి9

(ఎంఏస్‌టి1)

డి8 డి7 డి6 డి5 డి4 డి3 డైనింగ్ కార్ సి4 సి3 సి2

(ఎసి ఎంఏస్‌టి2)

సి1

(ఎసి ఎంఏస్‌టి1)

డి2 డి1

(స్త్రీలు)

జనరల్1 ఎస్‌ఎల్‌ఆర్/హెచ్‌పి

టై టేబుల్

మార్చు
స్టేషను సమయములు విరామ సమయము గమనికలు
చేరుట బయలు దేరుట
ముంబై సిఎస్‌టి 17:10 ప్రారంభ స్టేషను .
కర్జత్ 18:33 18:35 2 ని.లు రేర్ వాహనములు (బ్యాంకర్లు) భోర్ ఘాట్ కోసం తగిలించి ఉంటాయి.
లోనావాలా 19:19 19:20 1 ని.లు
శివాజీనగర్ 20:09 20:10 1 ని.
పూణే 20:25 స్టేషను అంతమవుతుంది.

[3]

బ్యాంకర్ వాహనములు

మార్చు

ముంబై నుండి ప్రయాణ సమయంలో, రైలు యొక్క మొదటి విరామం కర్జత్ వద్ద ఉంది. రైలు పర్వత మార్గం అధిరోహించేందుకు సహాయ పడేందుకు వీలుగా ఇక్కడ రైలు వెనుక బ్యాంకర్ వాహనములు తగిలించి (అటాచ్) సిద్ధం చేస్తారు. రైలు అప్పుడు, పైకి ఎక్కిన తర్వాత లోనావాలా వద్దకు చేరుతుంది. ఆపైన, చివరకు ప్రధాన పూణే రైల్వే స్టేషను వద్ద ఆగిపోయే ముందు, పూణే సమీపంలోని శివాజీనగర్ స్టేషను వద్దకు చేరుతుంది. ఈ రైలు, నాగార్గలి సమీపంలోని భోర్ ఘాట్ లో అంబర్‌నాథ్ వద్ద డెక్కన్ ఎక్స్‌ప్రెస్ అయిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను, లోనావాలా వద్ద ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్ లను దాటుతుంది.

12124 పూణే నుండి ముంబై

మార్చు
రేక్
లోకో 1 2 3 4 5 6 7 8 9 - 10 11 12 13 14 15 16 17
  డి10

(ఎంఏస్‌టి2)

హెచ్‌పి/ఎస్‌ఎల్‌ఆర్ జనరల్ డి1

(స్త్రీలు)

డి2 సి1

(ఎసి ఎంఏస్‌టి1)

సి2

(ఎసి ఎంఏస్‌టి2)

సి3 సి4 డైనింగ్ కార్ డి3 డి4 డి5 డి6 డి7 డి8 డి9

(ఎంఏస్‌టి1)

ఎస్‌ఎల్‌ఆర్/హెచ్‌పి

టైం టేబుల్

మార్చు
స్టేషను సమయములు విరామ సమయము గమనికలు
చేరుట బయలు దేరుట
పూణే 7:15 ప్రారంభ స్టేషను
లోనావాలా 8:09 8:10 1 ని.
ఖండాలా 8:15 8:16 1 ని. సాంకేతిక విరామం. బ్రేక్లు తనిఖీ కోసం.
మంకీ హిల్ 8:20 8:21 1 ని. సాంకేతిక విరామం. బ్రేక్లు తనిఖీ కోసం.
దాదర్ సెంట్రల్ 10:03 10:05 2 ని.లు
ముంబై సిఎస్‌టి 10:25 స్టేషను అంతమవుతుంది.

[4]

పూణే విడిచిపెట్టాక, ముంబై గమ్యం చేరే ముందు రైలు లోనావాలా, దాదర్ స్టేషన్లు వద్ద మాత్రమే ఆగుతుంది. రైలు దాని యొక్క బ్రేకులు తనిఖీ చేయడానికి ఒక నిటారుగా దిగుట ప్రారంభంలో ఉన్న మంకి హిల్ (కేవలం లోనావాలా తర్వాత) అనే పాయింట్ వద్ద కొన్ని నిమిషాలు ఆగుతుంది. దీనిని "సాంకేతిక విరామం" అని పిలుస్తారు, ఒక స్టేషను వద్ద ఒక షెడ్యూల్ విరామం మాత్రము కాదు. ఈ రైలు, ఇంద్రాయణి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ను మాలవ్లీ వద్ద, ఠాకూర్వాడి సమీపంలో భోర్ ఘాట్ లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, కర్జత్ వద్ద డెక్కన్ ఎక్స్‌ప్రెస్ లను దాటుతుంది.[5]

ట్రాక్షన్

మార్చు
 
డబ్ల్యుసిఎం-1 రకం ఇంజను ప్రారంభంలో డెక్కన్ క్వీన్ తీసుకెళ్ళేందుకు ఉపయోగించారు

మొదట్లో డెక్కన్ క్వీన్ డబ్ల్యుసిఎం-1 ఇంజను కలిగి ఉంది. ఇది ప్రస్తుతం ఒక డబ్ల్యుసిఎఎం-3 ఇంజను లేదా కళ్యాణ్ (KYN) షెడ్ నకు చెందిన డబ్ల్యుసిఎఎం 2పి ఇంజను ద్వారా రైలు ముగింపు నుండి ముగింపు వరకు నెట్టబడుతూ ఉంది.

సంఘటనలు

మార్చు
 
డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్
  • రైలు ఖండాలా ఘాట్ వద్ద 1990 సం.లో పట్టాలు తప్పింది, కానీ ఎటువంటి మరణాలు లేవు.
  • 2005 సం.లో జూలై నుండి ఆగస్టు వరకు రైలు సేవలు ముంబై (2005 జూలై 26) లో భారీ వర్షాల కారణంగా చెదిరినాయి.
  • 2006 నవంబరు 30 న, దాదాపు 6000 ఆందోళనకారులతో ఒక మాబ్ ఉల్లాస్‌నగర్ సమీపంలో రైలు లోని కొన్ని కోచ్‌లకు నిప్పంటించారు. ఆ తర్వాత ప్రయాణికులను బలవంతంగా క్రిందకు దించివేశారు.[6] కాన్పూర్ దూర ప్రాంతాలలో బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం యొక్క విధ్వంసానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన చేశారు. కానీ, ఈ సంఘటన డెక్కన్ క్వీన్ నకు ఎటువంటి సంబంధం కలిగి ఉండలేదు.

తోటి (సోదరి) రైళ్లు (ముంబై - పూణే)

మార్చు
 
డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్

ఇవి కూడా చూడండి

మార్చు

చిత్రమాలిక

మార్చు
 
డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Deccan Queen turns 75". 2004-06-01. Retrieved 2006-11-30.
  2. "Deccan Queen enters 80th year of service". 2009-06-02. Archived from the original on 2014-04-07. Retrieved 2015-11-18.
  3. Deccan Queen Mumbai CST - Pune Junction
  4. Deccan Queen Pune Junction - Mumbai CST
  5. 12124 Pune - Mumbai Deccan Queen
  6. "Dalits go on a rampage". 2006-11-30. Archived from the original on 2017-06-22. Retrieved 2006-11-30.

బయటి లింకులు

మార్చు