దక్షిణ రైల్వే (తమిళం: தென்னக இரயில்வழி; మలయాళం: ദക്ഷിണ റെയില്വേ) స్వతంత్ర భారతదేశంలో రూపొందించిన 16 భారతీయ రైల్వే మండలంలలో మొట్టమొదటిగా దక్షిణ రైల్వే ఉంది. ఇది నామంగా (1) మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే, (2) దక్షిణ భారత రైల్వే, (3) మైసూర్ రాష్ట్రం రైల్వే అను మూడు రాష్ట రైల్వేల విలీనం ద్వారా 1951 ఏప్రిల్ 14 న సృష్టించబడింది. దక్షిణ భారత రైల్వే నిజానికి 1853 లో బ్రిటన్ లో స్థాపించబడి, బ్రిటిష్ వలస పాలనలో 1859 లో రిజిస్టర్ గావించబడి. గ్రేట్ దక్షిణ భారతదేశం రైల్వే (కంపెనీ) కం.గా రూపొందింనది. దీనిని తిరుచిరాపల్లి (ట్రిచ్చి) లో ప్రధాన కార్యాలయంగా 1890 లో లండన్ లో కేవలం ఒక సంస్థగా నమోదు చేశారు.
దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం చెన్నైలో కలిగి ఉంది. దక్షిణ రైల్వే జోనులో ఆరు విభాగాలు (డివిజన్లు) ఉన్నాయి: చెన్నై డివిజను, తిరుచిరాపల్లి డివిజను, మధురై డివిజను, సేలం డివిజను, పాలక్కాడ్ డివిజను, తిరువంతపురం డివిజను. దక్షిణ రైల్వే జోను తమిళనాడు, కేరళ, పుదుచెర్రి రాష్ట్రాలు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో చిన్న భాగాలకు విస్తరించి ఉంది. ప్రతి సంవత్సరం 500 మిలియన్ ప్రయాణీకుల కన్నా ఎక్కువ మంది ఈ జోన్ ద్వారా ప్రయాణించెదరు. ఈ జోన్ రాబడి భారతదేశం యొక్క ఇతర (డివిజనుల) మండలాల కంటే విభిన్నంగా ఉంటుంది. దక్షిణ రైల్వే జోను రాబడి సరుకుల రవాణా నుండి కంటే ప్రయాణీకుల ద్వారా వచ్చే అదాయము అధికంగా ఉంటుంది..
1966 లో బెజవాడ, హుబ్లి విభాగములు నూతమనుగా ఏర్పరచబడ్డ దక్షిణ మధ్య రైల్వేకు బదిలి చేయబడ్దవి. తరువాతి కాలములో మద్రాసు, మైసూరు విభగములను పునర్విభజించి బెంగుళూరు విభాగము ఏర్పరచబడింది. పిదప పాలక్కాడ్, మధురై విభాగములను పునర్విభజించి సేలం రైల్వే విభాగము ఏర్పరచబడింది.
దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయము చెన్నైలో నున్నది. ఈ మండల పరిధిలో ప్రస్తుతము ఆరు విభాగములు ఉన్నాయి. అవి: