డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ
డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ భారతదేశానికి చెందిన రాజకీయ పార్టీ.[1] కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్[2] జమ్ము కశ్మీర్‌లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో 2022 సెప్టెంబర్ 27న పార్టీని ప్రకటించాడు. డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ యొక్క ప్రధాన మూడు అజెండాలు పూర్తి రాష్ట్ర హోదా, భూమిపై హక్కు & స్థానిక నివాసాలకు ఉపాధిని పునరుద్ధరించడం. డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ మతం, కులం ఆధారంగా రాజకీయాలు చేయదని, గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తుందని గులాం నబీ ఆజాద్ తెలిపాడు.
డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ | |
---|---|
స్థాపకులు | గులాం నబీ ఆజాద్ |
స్థాపన తేదీ | 26 సెప్టెంబరు 2022 |
రాజకీయ విధానం | గాంధీ సిద్ధాంతం సెక్కులరిజం |
జెండా
మార్చుమూడు రంగులు నిలువుగా ఉన్న ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ జెండాలో మొదటి రంగు నీలం. మధ్యలో తెలుపు రంగు. మూడో రంగు పసుపు. పసుపు రంగు కొత్తదనానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక, తెలుపు శాంతికి చిహ్నం, నీలం స్వేచ్ఛకు, సంద్రంలోని లోతుకు అందనంత ఎత్తులో ఉండే ఆకాశ వర్ణానికి చిహ్నమని జెండా డిజైన్ గురించి గులాం నబీ ఆజాద్ తెలిపాడు.[3][4]
ప్రముఖ నాయకులు
మార్చునాయకుడు | డిఎపిలో స్థానం | గత అనుబంధం | మూలాలు |
---|---|---|---|
గులాం నబీ ఆజాద్ | వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు | భారత జాతీయ కాంగ్రెస్ | |
GM సరూరి | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తారా చంద్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఘారు రామ్ భగత్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నరేష్ గుప్తా | భారత జాతీయ కాంగ్రెస్ | [5] | |
సల్మాన్ నిజామీ | భారత జాతీయ కాంగ్రెస్ | [6] |
మూలాలు
మార్చు- ↑ "డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ". 27 September 2022. Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.
- ↑ V6 Velugu (26 September 2022). "ఆజాద్ కొత్త పార్టీ.. 'డెమొక్రటిక్ ఆజాద్'". Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (26 September 2022). "సొంత పార్టీ పేరు, పార్టీ జెండా విడుదల చేసిన గులాం నబీ ఆజాద్" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.
- ↑ Namasthe Telangana (26 September 2022). "కొత్త పార్టీ పేరు ప్రకటించిన గులాం నబీ ఆజాద్". Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.
- ↑ "8 J&K Cong leaders quit in support of Azad, more likely to go; may announce new party". Indian Express. 26 August 2022. Retrieved 27 September 2022.
- ↑ "5 J&K Cong leaders quit in Azad's support, more resignations likely: Report". Business Standard. 26 August 2022. Retrieved 27 September 2022.[permanent dead link]