డెలాయిట్ సంస్థాగత వృత్తిపరమైన సేవలు అందించే ఒక బహుళజాతి సంస్థ.[2] ఇది అకౌంటింగ్ సేవలు అదించే నాలుగు అతిపెద్ద సంస్థల్లో ఒకటి మాత్రమే కాక ప్రపంచంలో ఆదాయ పరంగా అతిపెద్ద వృత్తి సేవల నెట్ వర్క్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో విస్తరించి ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం యూకే లో లండన్ లో ఉంది.[3] తెలుగు రాష్ట్రాలలో వీరికి హైదరాబాదు లో కార్యాలయము ఉన్నది.

డెలాయిట్
రకం
ప్రైవేటు
పరిశ్రమవృత్తిపరమైన సేవలు
స్థాపించబడిందిలండన్, ఇంగ్లాండు (1845)
స్థాపకుడువిలియం వెల్ష్ డిలాయెట్
ప్రధాన కార్యాలయం30, రాక్‍ఫెల్లర్ ప్లాజా
న్యూయార్క్
అమెరికా
పనిచేసే ప్రాంతాలు
ప్రపంచ వ్యాప్తం
ప్రధాన వ్యక్తులు
స్టీఫెన్ ఆల్మండ్(అధ్యక్షుడు)
బారీ సేల్జ్బర్గ్ (CEO)[1]
సేవలుహమీ సేవలు
పన్ను సేవలు
నిర్వహణా సేవలు
ఆర్థిక సలహా సేవలు
వాణిజ్య ప్రమాద సేవా నిర్వహణ సేవలు
Other
ఆదాయం 31.3 బిలియన్ డాలర్లు (2012)
ఉద్యోగుల సంఖ్య
193,000 (2012)
జాలస్థలిDeloitte.com/global

ఈ సంస్థను విలియం వెల్ష్ డెలాయిట్ 1845 లో లండన్ లో స్థాపించాడు. తర్వాత 1890లో అమెరికాకు కూడా విస్తరించింది.[4] 1972 లో హాస్కిన్స్ అండ్ సెల్స్ అనే సంస్థను విలీనం చేసుకుని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ మారింది. 1989లో టచ్ రాస్ అనే సంస్థను విలీనం చేసుకుని డెలాయిట్ & టచ్ గా పేరు మార్చుకుంది. కానీ తర్వాత కూడా డెలాయిట్ అనే పేరుతోనే చెలామణీ అవుతూ వస్తోంది.

మూలాలుసవరించు

  1. Leadership
  2. "About Deloitte". 2.deloitte.com. Retrieved 14 April 2016.
  3. "Deloitte overtakes PwC as world's biggest accountant". The Telegraph. Retrieved 15 Apr 2017.
  4. "About Deloitte". Deloitte. Retrieved 2 October 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=డెలాయిట్&oldid=3010230" నుండి వెలికితీశారు