డేటింగ్ (Dating) అనగా శృంగార సంబంధమును కోరుకుంటూ ఇద్దరు వ్యక్తులు కలిసి బయట తిరిగేందుకు వెళ్ళడం. వివాహము చేసుకోవాలనుకున్న ఇద్దరు భాగస్వాములుగా మనం మనగలుగుతామా, అనుకూలంగా ఉండగలుగుతామా అని ఒకరికొకరు తెలుసుకునే లక్ష్యంతో ఈ డేటింగ్ చేస్తారు. కలిసి సినిమాకు వెళ్ళడం, తినేందుకు రెస్టారెంటు వెళ్ళడం వంటి వాటి వలన అప్పుడు వారి ప్రవర్తనను బట్టి ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది, ఒకరికొకరు ఎలా ఉండాలో ఈ సమయంలో వీరు తెలుసుకుంటారు.[1] వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి ఈ డేటింగ్ పద్ధతి సరియైన పద్ధతి కాదని, ఈ పద్ధతి చెడు ఫలితాలను ఇచ్చే విధంగా ఉందని, సాంఘిక సంక్షేమ సంరక్షకులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.

బీచ్ వద్ద ఒక జపనీస్ జంట

మూలాలు మార్చు

  1. "'Lao wai' speak out on false image in China". China Daily. 2004-02-06. Retrieved 2010-12-09.
"https://te.wikipedia.org/w/index.php?title=డేటింగ్&oldid=3871881" నుండి వెలికితీశారు