డైక్లోరిన్ హెక్సాక్సైడ్
డైక్లోరిన్ హెక్సాక్సైడ్ ఒక రసాయన సమ్మేళన పదార్థం. ఇది ఒక అకర్బన సంయోగపదార్థం.ఈ సంయోగపదార్థం యొక్క అణుసంకేత పదం/సూత్రం Cl2O6.ఈ సంయోగపదార్థం వాయుస్థితిలో ఉన్నప్పుడు, ఈ అణుఫార్ములా సరిగ్గా సరిపోతుంది. అయినప్పటికీ ద్రవరూపంలో లేదా ఘనస్థితిలో ఉన్నప్పుడు డైక్లోరిన్ హెక్సాక్సైడ్ ఆయనీకరణ వలన ముదురు లేదా చిక్కని ఎరుపు వర్ణపు అయోనిక్ సంయోగపదార్థం క్లోరైల్ పెర్క్లోరేట్([ClO2]+[ClO4]−గా అయనీకరణ చెందును.
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Dichlorine hexoxide
| |||
ఇతర పేర్లు
Chlorine trioxide; Chloryl perchlorate; Chlorine(V,VII) oxide
| |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [12442-63-6] | ||
ధర్మములు | |||
Cl2O6 | |||
మోలార్ ద్రవ్యరాశి | 166.901 g/mol | ||
స్వరూపం | red liquid | ||
సాంద్రత | 1.65 g/cm3 | ||
ద్రవీభవన స్థానం | 3.5 °C (38.3 °F; 276.6 K) | ||
బాష్పీభవన స్థానం | 200 °C (392 °F; 473 K) | ||
Reacts | |||
ప్రమాదాలు | |||
ప్రధానమైన ప్రమాదాలు | oxidizer | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
ఉత్పత్తి
మార్చుక్లోరిన్ డయాక్సైడ్, అధిక పరిమాణంలోఉన్న ఓజోన్ తో రసాయనచర్య జరపడం వలన డైక్లోరిన్ హెక్సాక్సైడ్ ఏర్పడును.
- 2 ClO2 + 2 O3 → 2 ClO3 + 2 O2 → Cl2O6 + 2 O2
అణు సౌష్టవం
మార్చువాయువుగా ఇది మొనోమెరిక్ క్లోరిన్ ట్రైఆక్సైడ్(ClO3)గా ఉండునని భావించబడినది.ఇది బాష్పీకరణ తరువాత తాపవియోగం వలన క్లోరిన్ పెర్క్లోరేట్, క్లోరిన్ టెట్రాఆక్సైడ్ (Cl2O4), ఆక్సిజన్ గా విడిపోవు వరకు ఆక్సిజన్‌తో బందితమైన ద్వ్యణుకం(oxygen-bridged dimer)గా ఉండునని తెలుస్తున్నది
భౌతిక లక్షణాలు
మార్చుఎర్రటి పొగలు వెలువరిస్తూ, ద్రవరూపంలో ఉండును.ఎర్రనిరంగుగల క్లోరైల్ పెర్క్లోరేట్ ([ClO2]+[ClO4]−)అయోనిక్ సమ్మేళనంగా స్పటికరణచెందును. సంయోగపదార్థానికి ఉన్న ఎరుపురంగు అందులో క్లోరిన్ అయానుల ఉనికిని తెలుపుతున్నది.డైక్లోరిన్ హెక్సాక్సైడ్ అణుభారం 166.901 గ్రాములు/మోల్.ఈ సంయోగపదార్థం యొక్క సాంద్రత 1.65 గ్రాములు/సెం.మీ3.డైక్లోరిన్ హెక్సాక్సైడ్ యొక్క ద్రవీభవన స్థానం 3.5 °C (38.3 °F; 276.6K), ఈ సమ్మేళనపదార్థం యొక్క బాష్పీభవన స్థానం200°C (392 °F; 473K).నీటితో చర్య జరుపును.డైక్లోరిన్ హెక్సాక్సైడ్ బలమైన ఆక్సీకరణకారకం, డయామాగ్నటిక్(ప్రయోగించిన అయస్కాంతతత్వనికి వ్యరితరేక దిషలో అయస్కాంత తత్వాని ప్రేరెపింఛునది) పదార్థం.
రసాయన ధర్మాలు
మార్చుగది ఉష్ణోగ్రత వద్ద డైక్లోరిన్ హెక్సాక్సైడ్ స్థిరమైనపదార్థం అయినప్పటికీ, సేంద్రియ సంయోగపదార్థాలతో చర్యవలన తీవ్రస్థాయిలో విస్పొటనం చెందును.
బంగారంతో చర్యవల క్లోరైల్ లవణం [ClO2]+[Au(ClO4)4]−ఏర్పడును.
డైక్లోరిన్ హెక్సాక్సైడ్ ఈక్రింది అయోనికచర్యలను జరుపును.
- NO2F + Cl2O6 → NO2ClO4 + ClO2F
- NO + Cl2O6 → NOClO4 + ClO2
- 2V2O5 + 12Cl2O6 → 4VO(ClO4)3 + 12ClO2 + 3O2
- SnCl4 + 6Cl2O6 → [ClO2]2[Sn(ClO4)6] + 4ClO2 + 2Cl2
- 2Au + 6Cl2O6 → 2[ClO2]+[Au(ClO4)4]− + Cl2
డైక్లోరిన్ హెక్సాక్సైడ్ అంతియే కాకుండా క్లోరోట్రైఆక్సైడ్ రాడికల్ వనరు(source)గా కుడా ప్రవరిస్తుంది.
- 2 AsF5 + Cl2O6 → 2ClO3AsF5