ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే

ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్ వే లేదా నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే 3 భారతదేశంలో కెల్లా అత్యంత విశాలమైన నియంత్రిత-యాక్సెస్ ఎక్స్‌ప్రెస్ వే. 96 కి.మీ. పొడవున్న ఈ రహదారి, ఘజియాబాద్‌లోని దాస్నా మీదుగా ఢిల్లీని మీరట్‌తో కలుపుతుంది. జాతీయ రహదారి 9 (NH-9)లో దస్నా వరకు ఉన్న 8 వరుసల పాత దారిని 14 వరుసలుగా (భారతదేశంలో విశాలమైన ఎక్స్‌ప్రెస్‌వే) విస్తరించారు. ఎక్స్‌ప్రెస్‌వే నాల్గవ దశ దస్నా నుండి మీరట్ వరకు కొత్తగా నిర్మించారు. నిజాముద్దీన్ వంతెన నుండి దాస్నా వరకు ఉన్న 28 కి.మీ. (17 మై.) మార్గం, NCR లోకెల్లా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటి. మొత్తం ప్రాజెక్టు వ్యయం 8,000–10,000 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. [1]

Indian National Highway 3
3
ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే
పటం
Delhi-Meerut-Express-Highway-India.png
మార్గ సమాచారం
పొడవు96 కి.మీ. (60 మై.)
Existed2021 ఏప్రిల్ 1–present
ముఖ్యమైన కూడళ్ళు
నుండిన్యూ ఢిల్లీ – (44)
Major intersections(709B) (34)
వరకుమీరట్ – (334)
విభాగం 1 : నిజాముద్దీన్ వంతెన - ఢిల్లీ యూపీ సరిహద్దు
పొడవు8.7 కి.మీ. (5.4 మై.)
నుండినిజాముద్దీన్ వంతెన, న్యూ ఢిల్లీ
నుండియూపీ గేట్, ఢిల్లీ యూపీ సరిహద్దు
విభాగం 2 : ఢిల్లీ యూపీ సరిహద్దు - దస్నా
పొడవు19.2 కి.మీ. (11.9 మై.)
నుండియూపీ గేట్, ఢిల్లీ-యూపీ సరిహద్దు
నుండిదస్నా, ఘజియాబాద్
విభాగం 3 : దస్నా-హాపూర్
పొడవు22.2 కి.మీ. (13.8 మై.)
నుండిదస్నా, ఘజియాబాస్ద్
నుండిహాపూర్
విభాగం 4 : దస్నా-మీరట్
పొడవు46 కి.మీ. (29 మై.)
నుండిదస్నా, ఘజియాబాద్
నుండిపర్తాపూర్, మీరట్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఢిల్లీ, ఉత్తర ప్రదేశ్
రహదారి వ్యవస్థ

అదనంగా 14 కి.మీ. ప్యాకేజీ 5 ప్రస్తుతం జైనుద్దీన్‌పూర్ నుండి జాహిద్‌పూర్ వరకు నిర్మాణంలో ఉంది. [2]

చరిత్ర

మార్చు
 
ఘజియాబాద్ సమీపంలో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే

ఘజియాబాద్ నుండి మీరట్ ఎక్స్‌ప్రెస్ వే కోసం ప్రతిపాదనను 1999 మార్చిలో అప్పటి పట్టణ వ్యవహారాలు, ఉపాధి శాఖ మంత్రి లోక్‌సభలో ప్రస్తావించారు.[3] అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి 2000 ఫిబ్రవరిలో ఒక సెమినార్లో చేసిన ప్రసంగంలో దీన్ని మళ్లీ ప్రస్తావించారు.[4]

ఎక్స్‌ప్రెస్‌వేను 2015 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2011 ఆగస్టులో చెప్పారు.[5] 2011 అక్టోబరులో సాధ్యాసాధ్యాల నివేదిక పురోగతిలో ఉందని, ప్రాజెక్టును NHDP ఆరవ దశ కింద చేపడతామనీ చెప్పారు. ప్రతిపాదిత అలైన్‌మెంట్ NH-24 వెంట నిజాముద్దీన్ నుండి దస్నా వరకు, ఆపై మీరట్ వరకు ఉండాలి. [6] 2015 డిసెంబరు కల్లా పూర్తి చెయ్యాలనే తమ లక్ష్యాన్ని 2011 డిసెంబరులో పునరుద్ఘాటించారు.[7]

2013 ఆగస్టులో, సమకాలీన ఆర్థిక సంవత్సరానికి ఎక్స్‌ప్రెస్‌వే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదించబడింది.[8] ఢిల్లీ నుండి UP గేట్ వరకు ఉన్న మార్గాన్ని ఆరు వరుసల నుండి పద్నాలుగు వరుసలుగా మార్చాలనీ, మీరట్ వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా ఆరు వరుసల రహదారి నిర్మించాలని నిర్ణ్భయించారు. యూపీ గేట్ నుండి దస్నా వరకు మార్గం ఎనిమిది వరుసలుగా ఉండాలి, దస్నా నుండి మీరట్ బైపాస్ వరకు కొత్త ఆరు వరుసల అలైన్‌మెంట్ రావాల్సి ఉంది. భూసేకరణతో సహా ప్రాజెక్టు వ్యయం రూ 6,450 కోట్లుగా అంచనా వేసారు.[9]

2012 మేలో అలైన్‌మెంట్ ఫైనలైజేషన్‌కు సంబంధించి తలెత్తిన వివిధ సమస్యల వలన, సాధ్యాసాధ్యాల నివేదికల తయారీలో జాప్యం కారణంగా 2009-10 నాటికి పూర్తి చెయ్యాలనే అసలు లక్ష్యం నెరవేరలేదని చెప్పారు.[10] 2013 జూలైలో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌ను వేగవంతం చేయడానికి ఏర్పాటు చేసిన స్టీరింగ్ గ్రూప్, ఎక్స్‌ప్రెస్‌వే కోసం కాంట్రాక్టును ఇవ్వడానికి 2014 మార్చి 15 ను చివరి తేదీగా నిర్ణయించింది.[11]

2013 నవంబరు 18 న, రింగ్ రోడ్‌లోని నిజాముద్దీన్ బ్రిడ్జి నుండి ప్రారంభమయ్యే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రమే నిర్మిస్తుందని ధ్రువీకరించారు. ఈ రహదారి వలన ఢిల్లీ మీరట్‌ ప్రయాణానికి 45 నుండి 60 నిమిషాలు పడుతుంది. హరిద్వార్ - డెహ్రాడూన్‌ల ప్రయాణ సమయం దాదాపు గంట తగ్గుతుంది.[12]

భారత ప్రభుత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) 2014 జూలైలో, అనుసంధాన రహదారుల నిర్మాణంతో సహా ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేకు (4 వరుసలకు పెంపు) ఆమోదం తెలిపింది. 2016 మేలో CCEA ఈ రోడ్లను 8/6 వరుసలకు పెంచే ప్రతిపాదనకు మళ్లీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు మొత్తం ఖర్చు 7,855.87 crore (US$980 million). [13] ప్రాజెక్టు నిర్మాణానికి మూడేళ్లు గడువు విధించారు. [14]

నిధులు

మార్చు

మొత్తం ప్రాజెక్టు వ్యయంలో, 40% మొత్తాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త 'హైబ్రిడ్ యాన్యుటీ మోడల్' కింద సమకూర్చింది. మిగిలిన 60% న్ని రుణం/ఈక్విటీ 48:12 మిశ్రమం ద్వారా రాయితీదారు ఏర్పాటు చేసింది. ఇందులో 12% ప్రమోటర్ పెట్టుబడి కాగా మిగిలినది పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం ద్వారా నిధులు సేకరించారు.[15]

నిర్మాణ ప్యాకేజీలు, పురోగతి

మార్చు

న్యూఢిల్లీలోని ఔటర్ రింగ్ రోడ్‌లోని నిజాముద్దీన్ వంతెన నుండి మీరట్ బైపాస్ వరకు ఉన్న 96 కి.మీ. మొత్తం రహదారి నిర్మాణాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నాలుగు ప్యాకేజీలుగా విభజించింది.

ప్యాకేజీ I: ఢిల్లీ-యుపి సరిహద్దు వరకు నిజాముద్దీన్ వంతెన:

  • 2018 ఏప్రిల్ః నిర్మాణం పూర్తయింది
  • 2018 మే 27: ప్రారంభించారు.

ప్యాకేజీ II: ఢిల్లీ-యూపీ సరిహద్దు నుండి దస్నా వరకు:

  • 2020 ఫిబ్రవరిః 70% పని పూర్తయింది.[18]
  • 2020 ఆగస్టుః 85% పని పూర్తయింది.
  • 2021 ఏప్రిల్ 1 న పూర్తయింది. ప్రయాణాల కోసం తెరిచారు.[19]

ప్యాకేజీ III: దస్నా నుండి హపూర్:

  • 2019 సెప్టెంబరు 2 న దస్నా - హపూర్ విభాగాన్ని ట్రాఫిక్ కోసం తెరిచారు.[16]
  • 2019 సెప్టెంబరు 30:కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విభాగాన్ని లాంఛనంగా ప్రారంభించాడు.[17][18]

ప్యాకేజీ IV: దస్నా నుండి మీరట్:

  • 2021 ఏప్రిల్ 1: నిర్మాణం పూర్తిచేసి, ప్రజల కోసం తెరిచారు.[19]

హరిత కార్యక్రమాలు

మార్చు

కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా, ఘాజీపూర్ చెత్తగుట్ట నుండి ఘన వ్యర్థాలను ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో ఉపయోగించారు.[20][21][22]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Taneja, Mansi (11 September 2014). "NHAI to offer six packages for Eastern Peripheral Expressway". Business Standard.
  2. "Delhi–Meerut Expressway - Information & Status".
  3. "Press Release – Connecting cities near Delhi with Express Highways". Press Information Bureau, Government of India. 9 March 1999. Retrieved 7 January 2014.
  4. "Press Release – Connecting cities near Delhi with Express Highways". Press Information Bureau, Government of India. 3 February 2000. Retrieved 7 January 2014.
  5. "Press Release – Express Highway between Delhi and Meerut". Press Information Bureau, Government of India. 8 August 2011. Retrieved 7 January 2014.
  6. "Press Release – New Expressway Projects". Press Information Bureau, Government of India. 19 October 2011. Retrieved 7 January 2014.
  7. "Press Release – Development of Delhi-Ghaziabad Highway". Press Information Bureau, Government of India. 1 December 2011. Retrieved 7 January 2014.
  8. "Special Feature – Building not just Roads but Nation". Press Information Bureau, Government of India. 26 August 2013. Retrieved 7 January 2014.
  9. Dipak Kumar Dash (18 November 2013). "NH-24 in Delhi to be 14-laned for Meerut expressway". The Times of India. Archived from the original on 21 November 2013. Retrieved 7 January 2014.
  10. "Press Release – Construction of Expressways". Press Information Bureau, Government of India. 14 May 2012. Retrieved 7 January 2014.
  11. "Press Release – Deadlines set for key infrastructure project investments". Press Information Bureau, Government of India. 25 July 2013. Retrieved 7 January 2014.
  12. "NH-24 in Delhi to be 14-laned for Meerut Expressway". The Times of India.
  13. "Govt Approves Expansion of Highways in Five States". Outlook India.
  14. "Narendra Modi government sets three-year deadline for completion of Expressway projects". DNA India.
  15. "In a first, Welspun ties funds for road project under 'Hybrid Annuity Model'". Business Line (in ఇంగ్లీష్). 12 September 2016. Retrieved 5 June 2017.
  16. "NHAI opens Dasna to Hapur section of Delhi-Meerut-Expressway | Ghaziabad News – Times of India". The Times of India. 2 September 2019.
  17. "Nitin Gadkari to inaugurate 22-km stretch of Delhi-Meerut Expressway on Sept 30". Moneycontrol. 28 September 2019. Retrieved 29 September 2019.
  18. "Nitin Gadkari inaugurates Rs 1,058 cr Delhi-Meerut Expressway phase 3". 30 September 2019.
  19. "Delhi-Meerut Expressway open for public, cuts travel time to 45 minutes".
  20. "Use of Alternate Material for Construction of Nationalfugjkway". Press Information Bureau. 24 November 2016. Retrieved 6 June 2017.
  21. "NHAI to use solid waste from Ghazipur in Delhi-Meerut expressway". Business Standard India. Press Trust of India. 24 June 2016. Retrieved 6 June 2017.
  22. PTI. "NHAI to use solid waste from Ghazipur in Delhi-Meerut Expressway". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 6 June 2017.