పంజాబ్ నేషనల్ బ్యాంకు

పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank - PNB)ను 1895లో లాహోర్ లో లాలా లజపతి రాయ్ గారు స్థాపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4500 పైగా శాఖలతో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంకుగా కొనసాగుతున్నది. భారతీయులు భారతదేశంలో స్థాపించిన బ్యాంకులలో ఇది మొదటిది. 1969, జూలై 19 నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేయబడిన 14 బ్యాంకులలో ఇది ఒకటి.

పంజాబ్ నేషనల్ బ్యాంకు
తరహాపబ్లిక్
స్థాపన1895 లో లాహోర్
ప్రధానకేంద్రముFlag of India.svg ఢిల్లీ, భారతదేశం
కీలక వ్యక్తులుచక్రవర్తి, ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్
పరిశ్రమబ్యాంకింగ్
ఇన్స్యూరెన్స్
పెట్టుబడి మార్కెట్
వెబ్ సైటుwww.pnbindia.com

బ్యాంకు కాలరేఖసవరించు

 • 1895 : లాహోర్‌లో బ్యాంకు స్థాపన.
 • 1904 : కరాచి, పెషావర్ లలో శాఖల స్థాపన.
 • 1939 : భగవాన్‌దాస్ బ్యాంకు విలీనం.
 • 1947 : దేశవిభజన ఫలితంగా కరాచిలో ఉన్న బ్యాంకు ఆస్తులను పోగొట్టుకుంది. పాకిస్తాన్ లో కూడా బ్యాంకు కార్యక్రమాలను కొనసాగించింది.
 • 1961 : యూనివర్సల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం.
 • 1963 : బర్మా (ప్రస్తుత మయాన్మార్} ప్రభుతం రంగూన్ (ప్రస్తుతం యాంగాన్) లో బ్యాంకును జాతీయం చేసింది.
 • 1965 : భారత్-పాక్ యుద్ధం ఫలితంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశంలో బ్యాంకుకు సంబంధించిన అన్ని శాఖలను స్వాధీనం చేసుకుంది.
 • 1969 : భారత ప్రభుత్వం దీనితో పాటు మొత్తం 14 బ్యాంకులను జాతీయం చేసింది.
 • 1976 లేదా 1978 : లండన్ లో బ్యాంకు శాఖ స్థాపన.
 • 1988 : హిందుస్థాన్ కమర్షియల్ బ్యాంకు విలీనం.
 • 1993 : న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం. (ఇది 1980 లో జాతీయం చేయబడింది)

బయటి లింకులుసవరించు