ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్

12°59′29″N 80°14′01″E / 12.99151°N 80.23362°E / 12.99151; 80.23362

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌
भारतीय प्रौद्योगिकी संस्थान मद्रास
IIT Madras logo
నినాదంసిద్ధిర్భవతి కర్మజా (सिद्धिर्भवति कर्मजा (సంస్కృతం)
రకంప్రభుత్వ విశ్వవిద్యాలయం
స్థాపితం1959
చైర్మన్పవన్ గోయంకా
డైరక్టరుడా. భాస్కర్ రామమూర్తి
విద్యాసంబంధ సిబ్బంది
550
అండర్ గ్రాడ్యుయేట్లు4,000
పోస్టు గ్రాడ్యుయేట్లు4,000
స్థానంచెన్నై, తమిళనాడు, భారతదేశం
మస్కట్గజేంద్ర వృత్తం (GC)
జాలగూడుwww.iitm.ac.in

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీ మద్రాస్‌) దక్షిణ భారత దేశంలోని చెన్నైలో ఉన్న ఒక విశ్వవిద్యాలయ హోదాగల ఇంజినీరింగ్‌ , టెక్నాలజీ విద్యాసంస్థ. ఇది భారత ప్రభుత్వం చేత, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తింపు పొందింది. ఇది భారతదేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్‌ విద్యాలయాలలో ఒకటి.[1][2][3] ఈ సంస్థను 1959లో పశ్చిమ జర్మనీ ప్రభుత్వపు సాంకేతిక , ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు. భారత దేశపు పార్లమెంటు యొక్క చట్టం ద్వారా రూపుదాల్చిన పదిహేను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లలో ఐఐటీ మద్రాస్‌ మూడోది.[2][4] 2015 లో టైమ్స్ విడుదల చేసిన యూనివర్సిటీ ర్యాంకింగ్ లలో ఆసియాలో ఐఐటి మద్రాసు 78 స్థానంలో నిలిచినది [5]

ఐఐటీ మద్రాస్‌ 2.5 చ.కి.మీ.ల (620 ఎకరాల) విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రెసిడెన్షియల్ విద్యాసంస్థ. యొక్క రక్షిత అడవిప్రాంతంలో ఉంది. ఈ ప్రాంగణంలో చితల్‌కు ఈ సంస్థలో దాదాపు 550 మంది అధ్యాపక బృందం, 8000 విద్యార్థులు , 1,250 నిర్వహణ , సహాయక సిబ్బంది పనిచేస్తున్నారు.[6] 1961లో భారత పార్లమెంటు నుండి చార్టరు అందుకొన్నప్పటి నుండి వృద్ధి చెందుతూనే ఉంది. సంస్థ యొక్క ప్రాంగణంలో అధికభాగం సంరక్షిత అటవీప్రాంతమే. దీన్ని పక్కనే ఆనుకొని ఉన్న గిండి జాతీయోద్యానవనంలో నుండి తీసి సంస్థ యొక్క ప్రాంగణంగా రూపొందించారు. ప్రాంగణంలోని రక్షిత అడవిలో చితాల్ (మచ్చల దుప్పులు), బ్లాక్‌బక్‌ , ఇతర వన్యమృగాలు పెద్ద సంఖ్యలో కనబడతాయి. ప్రాంగణంలోని ఒక సహజసిద్ధమైన సరస్సు ప్రాంగణపు త్రాగునీటి అవసరాలను తీరుస్తుంది.

చరిత్ర

మార్చు

1956లో పశ్చిమ జర్మనీ ప్రభుత్వం, భారత్‌లో ఇంజినీరింగ్‌ కోసం ఒక ఉన్నత విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు సాంకేతిక సహాయం అందిస్తామని ముందుకు వచ్చింది. మద్రాసులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు తయారుచేసిన ఒప్పందం పై భారత్‌-జర్మనీ 1959లో బాన్‌లో సంతకాలు చేశాయి. సాంకేతికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, పశ్చిమ జర్మనీ ప్రభుత్వ సహకారంతో ఐఐటీ మద్రాస్‌ ప్రారంభమైంది. ఆ సమయంలో జర్మనీ వెలుపల, జర్మన్ ప్రభుత్వపు ప్రధాన సహాయంతో ఏర్పడిన ఏకైక సంస్థ ఇది. దీని వల్ల తర్వాతి కాలంలో జర్మనీలోని విశ్వవిద్యాలయాలు, సంస్థలతో అనేక ఏళ్లపాటు సహకార పరిశోధనలు జరిగాయి.[7] తర్వాతి కాలంలో జర్మనీ ప్రభుత్వం యొక్క అధికారిక మద్దతు ఆగిపోయినా, DAAD కార్యక్రమం , హమ్‌బోల్డ్‌ ఫెలోషిప్‌ తదితరాలు మాత్రం కొనసాగాయి.

1959లో కేంద్ర శాస్త్రీయ పరిశోధన , సాంస్కృతిక వ్యవహారాల మంత్రి, ఆచార్య హూమాయున్‌ కబీర్‌ ఈ సంస్థను ప్రారంభించారు. 1961లో ఏడు ఐఐటీలను జాతీయ ప్రాముఖ్యత ఉన్న సంస్థలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఖరగ్‌పూర్‌ (1951లో స్థాపితం), ముంబై (1958లో స్థాపితం), చెన్నై (1959లో స్థాపితం), కాన్పూర్‌ (1959లో స్థాపితం), ఢిల్లీ (1961లో స్థాపితం), గౌహతి (1994లో స్థాపితం) , రూర్కీ (1847లో స్థాపితం, 2001లో ఐఐటీగా పేరుమార్పు) ఉన్నాయి. 2009లో ఐఐటీ మద్రాస్‌ స్వర్ణోత్సవాలను జరుపుకుంది.

ప్రాంగణం

మార్చు
 
ప్రధాన ద్వారం తర్వాత ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌ గజేంద్ర సర్కిల్‌. ఇక్కడ ట్రాఫిక్‌ సర్కిల్‌లో ఉన్న ఫౌంటైన్‌కు ఇరు వైపులా రెండు రంగువేసిన ఏనుగు బొమ్మలు ఒకదాని వెనక ఒకటి ఉంటాయి. రాత్రిపూట తీసిన చిత్రం

ఐఐటీ మద్రాస్‌ యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం చెన్నైలోని సర్దార్‌ పటేల్‌ మార్గంలో ఉంది. సంస్థ యొక్క ప్రాంగణానికి ఇరువైపులా, అడయార్‌ , వెలాచ్చేరి అనే నివాసప్రాంతాలు ఉన్నాయి. ఈ క్యాంపస్‌ తమిళనాడు గవర్నర్‌ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు కూడా చాలా సమీపంలో ఉంటుంది. ప్రాంగణానికి ప్రధాన ద్వారంతో పాటు మరో మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అవి వేలాచ్చేరి (అన్నా గార్డెన్‌ ఎంటిసి బస్‌స్టాప్‌, వేలాచ్చేరి మెయిన్ రోడ్‌), గాంధీ రోడ్‌ (కృష్ణ హాస్టల్‌ గేట్‌ లేదా టోల్‌ గేట్‌గా కూడా పరిచితం) , తారామణి గేట్‌ (అసెండాస్‌ టెక్‌పార్క్‌ వెనక).

ఈ ప్రాంగణం చెన్నై మీనాంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి పది కిలోమీటర్లు, చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు చేరుకోవటానికి బస్‌ సౌకర్యం బాగా ఉంటుంది. చెన్నై ఎం.ఆర్.టి.ఎస్ మార్గంలో ప్రాంగణానికి సమీప స్టేషను కస్తుర్బా నగర్. బాన్‌ ఎవెన్యూ, ఢిల్లీ అవెన్యూ అనే రెండు సమాంతర రోడ్లు అధ్యాపకుల నివాస ప్రాంతం గుండా వెళ్ళి, నిర్వహణ భవనాల సముదాయం దగ్గర గల గజేంద్ర సర్కిల్‌ (జి.సి.) దగ్గర కలుస్తాయి. బస్సులు , విద్యుత్‌తో నడిచే మినీ బస్సులు తరచుగా ప్రధానద్వారం, జిసి, అకడమిక్‌ జోన్‌ , వసతి గృహాల మధ్య తిరుగుతుంటాయి.

సంస్థ

మార్చు

పరిపాలన

మార్చు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఐఐటి చట్టం ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఏడు ఐఐటీలను కలిపి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఐటి మండలి పర్యవేక్షిస్తుంది. భారత ప్రభుత్వం యొక్క కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి దీనికి అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. ప్రతి సంస్థలో దాని నిర్వహణ , నియంత్రణ బాధ్యత పాలకమండలి (బోర్డ్ ఆఫ్ గవర్నర్స్) నిర్వహిస్తుంది.

సంస్థ యొక్క అధ్యాపకులతో ఏర్పాటైన సెనెట్‌, విద్యావిధానాలను నిర్ణయిస్తుంది. విద్యాప్రణాళిక, కోర్సులు, పరీక్షలు, ఫలితాలు అన్నింటినీ ఈ సెనెట్‌ నియంత్రించడంతో పాటు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రత్యేకించిన విద్యా విషయాలను పరీక్షించడానికి సెనెట్‌ మండళ్లను ఏర్పాటు చేస్తుంది. సెనేట్ బోధన, శిక్షణ, , పరిశోధన అంశాలతో సహా వివిధ విభాగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సౌకర్యాలు , ప్రమాణాల పెరుగుదలకు కృషిచేస్తుంది. సంస్థ యొక్క డైరెక్టర్‌, సెనెట్‌కు అధ్యక్షునిగా వ్యవహరిస్తారు.

సెనెట్‌కు మూడు ఉపమండళ్లు విద్యా పరిశోధన మండలి, విద్యా విషయాలకు సంబంధించిన మండలి , విద్యార్థుల మండలి ఉన్నాయి. ఇవి విద్యకు సంబంధించిన నిర్వహణ , సంస్థ యొక్క కార్యాకలాపాలు సమర్ధంగా జరిగేలా చూడటంలో తోడ్పడతాయి. ఆర్థిక విధానాలకు సంబంధించిన విషయాల పై సలహాలు ఇచ్చేందుకు ఆర్థిక మండలి ఉంది. భవనాలు, మౌలిక సదుపాయాల గురించి సలహాలు ఇచ్చేందుకు భవనాలు , పనులు మండలి ఉంది. పరిశ్రమల సంప్రదింపులకు సంబంధించి, పరిశ్రమల సంప్రదింపులు , అనుదాన ఆధారిత పరిశోధనకొరకు ప్రత్యేక మండలి (ఇండస్ట్రీయల్‌ కన్సల్టెన్సీ , స్పాన్సర్డ్‌ రీసెర్చ్‌ బోర్డు) వుంది . ఇంతేకాక గ్రంథాలయానికి సంబంధించిన అంశాల కొరకు గ్రంథాలయ సలహా మండలి ఉంది.

విభాగాలు

మార్చు

ఐఐటీ మద్రాస్‌లో 11 ఇంజనీరింగ్‌ విభాగాలు ఉన్నాయి.

మరో ఐదు ఇతర విభాగాలు కింది అంశాల్లో విద్యను అందిస్తాయి

  1. రసాయన శాస్త్రం
  2. గణితశాస్త్రం
  3. భౌతిక శాస్త్రం
  4. మానవీయ , సమాజ శాస్త్రాలు
  5. నిర్వహణ

విద్యా విశేషాలు

మార్చు

ఐఐటీ మద్రాసు, ఇంజినీరింగ్‌, విజ్ఞాన శాస్త్రం, మానవీయ శాస్త్రాలు , నిర్వహణతో సహా మొత్తం 16 విభాగాలలో, స్నాతక (డిగ్రీ), స్నాతకోత్తర (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌) , పరిశోధన డిగ్రీలను అందిస్తుంది. సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగాలు , సంస్థలోని వివిధ అనుబంధ కేంద్రాలకు చెందిన 360 మందికి పైగా అధ్యాపకులు బోధన, పరిశోధన , ఇండస్ట్రియల్‌ కన్సెల్టీకి సంబంధించిన పనులు చేస్తున్నారు. ఐఐటీ మద్రాస్‌ దేశంలోనే గొప్ప బోధన, పరిశోధన , పరిశ్రమల కన్సెల్టీలకు సంబంధించిన గొప్ప సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సంస్థలో 16 విద్యా విభాగాలు, మౌలిక పరిశోధన , ఇంజనీరింగు రంగాలలో ఆధునిక పరిశోధన కేంద్రాలు , దాదాపు వంద ప్రయోగశాలలు ఉన్నాయి. ఐఐటీలు ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తమలాంటి [8] సంస్థల దగ్గర నుంచి గుర్తింపు పొందాయి. ఐఐటీ మద్రాసులో విద్యా సంవత్సరం సెమిస్టర్ పద్ధతిని అనుసరిస్తుంది. ప్రతి సెమిస్టర్‌లోనూ కనీసం 70 రోజుల పాటు ఆంగ్లం మాధ్యమంలో బోధన జరుగుతుంది. సెమిస్టర్‌ ఆసాంతం విద్యార్థులను నిరంతరంగా మూల్యాంకనం చేస్తారు. సంస్థకు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి దృష్ట్యా అధ్యాపకులే ఈ మూల్యాంకనం చేస్తారు. పరిశోధనా పనిని మాత్రం, అయా విద్యార్థులు సమర్పించిన సిద్ధాంత గ్రంథం ఆధారంగా, ఆయా అంశాలలో దేశవిదేశాలకు చెందిన నిపుణులు మూల్యాంకనం చేస్తారు.

ప్రవేశ పరీక్షలు

మార్చు

ఐఐటీలలో గ్రాడ్యుయేట్‌ విద్య కోర్సులలో ప్రవేశం కొరకు ప్రతి ఏడాది అన్ని సంస్థలు కలిసి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( జేఈఈ /JEE )ను నిర్వహిస్తాయి. ఇది దేశంలో ఉన్న అతి కష్టమైన పరీక్షగా గుర్తింపు పొందింది. మద్రాసు ఐఐటీలో కూడా ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు. దీనితో పాటు మానవీయ , సామాజిక శాస్త్రాలలో ప్రవేశం కొరకు మద్రాస్‌ ఐఐటీ స్థానికంగా హెచ్.ఎస్.ఈ.ఈ (HSEE) ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. విశిష్టమైన ఐదు సంవత్సరాల ఏకీకృత మాస్టర్స్‌ పట్టాకు సంబంధించి ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దీని ద్వారా అభివృద్ధి అధ్యయనాలు (డెవలెప్‌మెంట్‌ స్టడీస్‌), ఆర్థిక శాస్త్రం , ఆంగ్ల అధ్యయనం విభాగాల్లో ఎం.ఏ డిగ్రీ పొందవచ్చు. ఐఐటీ మద్రాస్‌ ఈ కోర్సుకు సంబంధించి కేవలం 39 మందికి ప్రవేశం కల్పిస్తుంది. ఈ పరీక్షకు సంబంధించిన విద్యా విషయాలు ఈ విధంగా ఉంటుంది; ఆంగ్లం‌ , ఆవగాహనకు 25 శాతం, పరిమాణాత్మక సామర్ధ్యం , విశ్లేషణ‌ సామర్ధ్యానికి సంబంధించి 25 శాతం, సాధారణ అధ్యయనాలు (నాలుగు విభాగాల్లో విభజించబడి ఉంటాయి - భారత ఆర్థిక శాస్త్రం, భారత సమాజం, ప్రస్తుత ప్రపంచ వ్యవహారాలు, పర్యావరణం , జీవావరణం)కు సంబంధించి 50 శాతం మార్కులు ఉంటాయి.

ఇంజినీరింగ్‌ స్నానతకోత్తర విద్యలో ప్రవేశానికి గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూట్ పరీక్ష (గేట్ / GATE) అనే ప్రవేశ పరీక్షను నిర్వహించి, ఐఐటీల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇంజినిరింగ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎం.ఎస్.సి వంటి రెండేళ్ల సైన్స్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కార్యక్రమాల్లో ప్రవేశం కల్పించేందుకు ఐఐటీలన్నీ ఉమ్మడిగా JAM అనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తాయి. స్నానతకోత్తర స్థాయి నిర్వహణా విద్యా కార్యక్రమాల (ఎంబిఏ) లలో ప్రవేశానికి ఐఐటీలు ది జాయింట్‌ మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (JMET) అనే వ్రాత పరీక్ష నిర్వహిస్తాయి. వ్రాత పరీక్షతో పాటు జట్టు పనిఅంశం , వ్యక్తిగత ఇంటర్వ్యూ కూడా ఉంటాయి.

మ్యూలాంకన పద్దతి

మార్చు

ఇతర ఐఐటీల మాదిరిగానే, మద్రాస్‌ ఐఐటీ కూడా విద్యలో ప్రావీణ్యతను గుర్తించడానికి క్రెడిట్‌ పద్ధతిని అనుసరిస్తుంది. ఇందులో జిపిఎ(GPA) 0 నుంచి 10 వరకూ ఉంటుంది. ప్రతి కోర్సుకు నిర్దేశిత సంఖ్యలో క్రెడిట్స్‌ ఉంటాయి. (సాధారణంగా 1 నుంచి 4). డిగ్రీ చేస్తున్న సమయలో విద్యార్థి, కనీసం కొన్ని క్రెడిట్స్‌ పొందాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్స్‌ ఎంతనేది కార్యక్రమం, విభాగం , ప్రత్యేకతల పై ఆధారపడి ఉంటుంది. ప్రతి కోర్సుకు కింద పేర్కొన్న అక్షరాల ద్వారా క్రెడిట్స్‌ ఇస్తారు.

లెటర్‌ గ్రేడ్‌ S A B C D E U W
గ్రేడ్‌ పాయింట్స్‌ 10 9 8 7 6 4 0 0

U గ్రేడ్‌ వస్తే కోర్సులో ఫెయిలయినట్లు. W వస్తే హాజరుకు సంబంధించిన కనీస అవసరాలను పూర్తి చేయలేదని అర్థం. ఈ రెండు సందర్భాలలోనూ విద్యార్థి ఫెయిలైనట్లే. GPAను కింద పేర్కొన్న ఫార్ములా ప్రకారం సంచిత భారాధారిత సగటు (క్యుములేటివ్‌ వెయిటెడ్‌ సగటు) ప్రకారం నిర్ణయిస్తారు.

 

ఇక్కడ:

  •   అంటే కోర్సుల సంఖ్య
  •   అంటే  కోర్సు యొక్క క్రెడిట్స్‌
  •   అంటే  కోర్సుకు సంబంధించిన గ్రేడ్‌ పాయింట్లు
  •   అంటే క్యుములేటివ్‌ గ్రేడ్‌ పాయింట్ల సగటు

ప్రస్తుతం, ఎక్కడైతే ఫెయిల్‌ గ్రేడ్‌ తర్వాత పాస్‌ గ్రేడ్‌ ఉంటుందో, అక్కడ  ను లెక్కించే సమయంలో ఫెయిల్‌ గ్రేడ్‌నుఏ లెక్కింపులోకి పరిగణనలో తీసుకోవడం లేదు. ప్రస్తుతం ట్రాన్‌స్క్రిప్ట్‌లో ఈ ఫెయిల్‌ గ్రేడ్‌లను తీసేసి, పాస్‌ గ్రేడ్‌ను సాధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారనేది, కింద ఒక నోట్‌లో పేర్కొంటున్నారు. కొన్ని కోర్సులలో పాస్‌-ఫెయిల్‌ కోర్సులుగా పరిగణిస్తున్నారు. ఇందులో విద్యార్థి పాస్‌ కావడం మినహా మరో అవకాశం విద్యార్థికి ఉండదు. ఏదేమైనా ఈ మార్కులు / గ్రేడ్‌లు CGPA లెక్కింపు సమయంలో పరిగణనలోకి తీసుకోరు.

ఇతర విద్యా కార్యక్రమాలు

మార్చు

విద్యా పరిశోధన కార్యక్రమాలు

మార్చు

సంస్థలో అనేక ఆధునిక ప్రయోగశాలలు , ఇంజినీరింగ్‌, సాధారణ శాస్త్రాల విభాగాలకు సంబంధించి సుమారు 100 ప్రయోగశాలలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న అధ్యాపకులతో పాటు తెలివైన విద్యార్థుల బృందం, అద్భుతమైన సాంకేతిక , సహాయక సిబ్బంది ఉన్నారు. సమర్ధవంతమైన నిర్వహణ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు ఈ సంస్థ యొక్క ఖ్యాతి మరింత పెరగడానికి కారణమయ్యారు.

పరిశోధన కార్యక్రమాలు ఆయా విభాగాల్లో ఉన్న అధ్యాపకులు లేదా నిర్దేశిత పరిశోధనా సమూహాలు తీసుకుని చేస్తాయి. దీనికి గాను ఎమ్.ఎస్ (M.S‌) లేదా పిహెచ్డి(PhD) డిగ్రీలు పొందుతారు. వివిధ విభాగాల్లో కార్యక్రమాల కోసం తీసుకున్న పరిశోధన విద్యార్థులు, ఆయా విభాగాల అధ్యాపకుల సూచనలతో పరిశోధనలు కొనసాగిస్తుంటారు. ప్రతి విభాగం తమ ఆసక్తిని చేతి పుస్తకాలు, కరపత్రాలు, వార్తాపత్రికల రూపంలో ప్రచురిస్తుంది. పరిశోధనకు తీసుకున్న ఆసక్తి అంశాలు సిద్ధాంతపరంగా లేదా అనుభవపరంగా కూడా ఉండొచ్చు. ఐఐటీ మద్రాస్‌ గుర్తించిన ప్రత్యేక అంశాలపై 16 రకాల పరిశోధన ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసింది.

ఈ విరామం లేని అకడమిక్‌ విద్య, ప్రతి స్థాయిలోనూ దీనికి సంబంధించిన ఇతర అంశాల సమన్వయంతో సాగుతుంది. విద్యప్రణాళిక వెలుపలి ప్రసంగాల శ్రేణి కింద అనేక అంశాల గురించి విద్యకు సంబంధించిన ప్రత్యేక ఉపన్యాసాలు ఉంటాయి. అనేక సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సింపోసియమ్స్‌ను అధ్యాపకులు ఏర్పాటు చేస్తారు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా ఆయా అంశాల పై పరిశోధన చేస్తున్న వారు భారీ సంఖ్యలో హాజరవుతారు.

ఇతర విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం

మార్చు

ఈ సంస్థ అనేక ఇతర విద్యా సంస్థలతో విద్యా సంబంధ స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలతో అధ్యాపకుల మార్పిడి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సంస్థ అనేక విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలను (మెమరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ (MOUs)) చేసుకుంది. దీని వల్ల ప్రాజెక్టులలో పరస్పర సహకారంతో పాటు రెండింటికి లాభాలు ఉంటాయి. ఈ సంస్థకు చెందిన అధ్యాపకులకు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అనేక విద్యావిషయాల పురస్కారాలు లభించాయి.

పారిశ్రామిక సంప్రదింపులు , అనుదానాధార పరిశోధనలు

మార్చు

పరిశ్రమలతో భాగస్వామ్యం కావడం విషయంలో ఐఐటీ మద్రాస్‌ దేశంలోని మిగిలిన సంస్థలకు ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన సంప్రదింపు సేవలను చేసేది అధ్యాపకులే అయినా, భారతదేశ వ్యాప్తంగా అనేక ఇతర సంస్థలు అనుదానాధార ప్రాజెక్టులలో వీరి యొక్క సరికొత్త ఆలోచనలను వాడుకున్నారు.

పరిశ్రమలకు సంప్రదింపుల ద్వారా, అధ్యాపకులు , సిబ్బంది పరిశ్రమకు సంబంధించిన నిర్దేశిత పనిని తీసుకుంటారు. ఇందులో ప్రాజెక్ట్‌ రూపకల్పన, పరీక్ష, విలువ లెక్కించడం, శిక్షణ ఇవ్వడం , పరిశ్రమ అభివృద్ధికి కావలసిన సలహాలు ఇవ్వడం కూడా కలిసి ఉంటాయి. ఆసక్తి ఉన్న సంస్థలు, పరిశ్రమలు ఐఐటీ అధ్యాపకులను అడిగి, ప్రత్యేకించిన పనులను సెంటర్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ కన్సెల్టెన్సీ , స్పాన్సర్డ్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ (ICSR) ద్వారా ఇస్తాయి.

అధ్యాపకులు తీసుకున్న అనేక ప్రాజెక్టులకు, జాతీయ సంస్థలు ఆర్థిక సహకారాన్ని అందజేస్తాయి. ఇలాంటి పరిశోధనలు సమయాన్ని బట్టి ఉంటాయి. ఇందులో పాల్గన్న అభ్యర్థులు ప్రత్యేక డిగ్రీని పొందుతారు. సాధారణంగా ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలను ఐఐటీ అధ్యాపకులు రూపొందిస్తారు. తర్వాత వీటిని ఆసక్తి ఉన్న సంస్థలకు పంపుతారు. ఇందులో ఈ పరిశోధన ఆ సంస్థకు ఉపయోగపడటంతో పాటు దీనికి సంబంధించిన ఆర్థిక అవసరాలను సంస్థ తీరుస్తుందా లేదా అనే విషయాలను పరిగణనలో తీసుకుంటారు.

అనుదానాధార ప్రాజెక్టులు తరచుగా వివిధ విభాగాల్లోకి కొత్త వనరులను తెచ్చుకోవడానికి మార్గాలుగా ఉపయోగపడతాయి. చాలా తరచుగా సంస్థ ప్రాజెక్ట్‌ సిబ్బందిని సంస్థ డిగ్రీలకు నమోదు చేసుకుంటారు. అన్ని అనుదానాధార పరిశోధన కార్యకలాపలాను ICSR సమన్వయపరుస్తుంది.

విద్యార్థుల కార్యక్రమాలు

మార్చు

శాస్త్ర

మార్చు

శాస్త్ర అనేది ప్రతి ఏటా ఐఐటీ మద్రాస్‌లో జరిగే సాంకేతికోత్సవం. ఇది సాధారణంగా అక్టోబరు మొదటి వారంలో జరుగుతుంది. చెన్నైలో జరిగే విద్యార్థుల పండుగలలో తొలి ISO 9001:2000 ప్రామాణికత పొందిన కార్యక్రమం కూడా ఇదే. అత్యద్భుతమైన నిర్వహణ, కళ్లు తిరిగే స్థాయిలో కార్యక్రమాలతో, దేశంలో ఉన్న ఇంజినీరింగ్‌ నైపుణ్యాన్ని ప్రోత్సహించుటకు ఇది దర్పణం పడుతుంది. ఇందులో వర్క్‌షాప్‌లతో ఫోరమ్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌లు, ఉపన్యాసాలు, వివరణాత్మక ప్రదర్శనలు‌ , సాంకేతిక ప్రదర్శనలు ఉంటాయి. రూపకల్పన అంశాలు, ప్రోగ్రామింగ్, సిమ్యులేషన్స్‌, చిక్కుప్రశ్నలు, అనువర్తిత ఇంజినీరింగ్‌, మరమనుషులు, జంక్‌యార్డ్‌ యుద్ధాలు , వింత రూపకల్పనలు లాంటి అనేక అంశాలపై పోటీలతో ఇది ఆసక్తికరంగా సాగుతుంది.

విభాగపు స్థాయి పండుగలు

మార్చు

అనేక విభాగాలు, తమ విభాగపు స్థాయిలో పండుగలను నిర్వహించుకుంటాయి. ఎక్స్ బిట్‌, వేవ్స్‌, మెకానికా, CEA, కెమ్‌క్లేవ్‌, అమాల్‌గమ్‌ , ఫోరేస్‌ అనేవి వరుస క్రమంలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఓషియన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జికల్‌ , మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ , గణిత విభాగాలు నిర్వహించుకునే పండుగలు.

పండుగ పేరు విభాగం
ఎక్స్ బిట్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
అమాల్గమ్‌ మెటలర్జికల్‌ , మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌
CEA సివిల్‌ ఇంజినీరింగ్‌
కెమ్‌క్లేవ్‌[permanent dead link] కెమికల్‌ ఇంజినీరింగ్‌
ఫోరేస్ గణితశాస్త్రం
మెకానికా Archived 2011-07-21 at the Wayback Machine మెకానికల్ ఇంజినీరింగ్‌
వేవ్జ్‌ ఓషియన్‌ ఇంజినీరింగ్‌
సమన్యయ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌

వసతి గృహాలు

మార్చు
 
గోదావరి వసతి గృహం
 
బ్రహ్మపుత్ర వసతి గృహం
 
శబర్మతి వసతి గృహం

ఐఐటీ మద్రాస్‌లో ఎక్కువ మంది విద్యార్థులు వసతి గృహాల్లోనే నివశిస్తారు. ఊపిరి సలపనివ్వని షెడ్యూల్‌తో ఉండే అకడమిక్‌ అంశాల నుంచి బయటకు వచ్చేందుకు అనేక విద్యాప్రణాళికేతర అంశాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. క్యాంపస్‌లో మొత్తం 19 వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో శారవతి, సరయు, సరయు ఎక్స్‌టెన్షన్, సబర్మతి అనే నాలుగు వసతి గృహాలు ప్రత్యేకంగా మహిళా విద్యార్థినుల కోసం ఏర్పాటు చేశారు. మొదట్లో ప్రతి వసతి గృహానికి భోజన సౌకర్యం కూడా కలిసి ఉండేది. కానీ తర్వాతి కాలంలో వాటిని తొలగించారు. శారవతి, సరయు ఎక్స్‌టెన్షన్‌తో పాటు నాలుగు ఏడుంతస్తుల పురుషుల వసతి గృహాలలో ప్రత్యేక భోజనశాలలు లేవు. వీరికోసం వింధ్య , హిమాలయ అనే పేరుతో రెండు పెద్ద కేంద్రీకృత భోజనశాలలను నిర్వహిస్తున్నారు. ఈ వసతి గృహాల్లో గ్రాడ్యుయేట్‌ , పోస్ట్ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు ఉంటారు. కాకపోతే ఇరువురికీ వేర్వేరు భవనాలు ఉంటాయి. ప్రవేశం కల్పించిన సమయంలోనే విద్యార్థులకు వసతిగృహాలను కూడా కేటాయిస్తారు. సాధారణంగా సంస్థలో ఉన్నంతసేపు వీరి వసతి ఇక్కడే ఉంటుంది.

వసతి గృహాలకు నదుల పేర్లు, ప్రాంగణంలో తిరిగే బస్సులకు పర్వతాల పేర్లను పెట్టారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో నదులు కదలకుండా స్థిరంగా ఉంటాయి. పర్వతాలు నిత్యం కదులుతూ ఉంటాయి అని చమత్కరిస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఐఐటీఎమ్‌లో ఉన్న వసతిగృహాలు

  1. సరస్వతి (సరాస్‌)
  2. కృష్ణ
  3. కావేరి
  4. బ్రహ్మపుత్ర (బ్రహ్మాస్‌)
  5. తపతి
  6. గోదావరి (గొడే)
  7. అలకానంద (అలక్‌)
  8. జమున (జామ్‌)
  9. గంగ
  10. నర్మద (నర్మద్‌)
  11. మందాకిని (మందాక్‌)
  12. సింధు
  13. పంపా
  14. తామరపర్ణి (తంబి)
  15. మహానది (మహాన్‌)
  16. షరావతి (షరవ్‌) - మహిళా వసతిగృహం
  17. సరయు - మహిళా వసతిగృహం
  18. సరయు ఎక్స్టెంషన్ - మహిళా వసతిగృహం
  19. సబర్మతి - మహిళా వసతిగృహం

సింధు, పంపా, మహానది , తామ్రపరణి ఏడంతస్థుల భవనాలు. మిగిలినవి అన్నీ (పాత క్లాసిక్స్‌) వసతిగృహాలు మూడు లేదా నాలుగు అంతస్తుల నిర్మాణాలు (2000 ఆరంభం వరకూ అన్ని పాత వసతి గృహాలు మూడంతస్థులు ఉండేవి, తర్వాత అదనపు అంతస్తుతో, అదనపు గదులు , ఉమ్మడి గదుల పైన కొత్త గదులను నిర్మించారు). ఈ నాలుగు కొత్త వసతిగృహాలు 1500 మందికి పైగా విద్యార్థులకు ఆశ్రయం ఇవ్వగలుగుతాయి.

పాఠ్యేతర కార్యకలాపాలు

మార్చు

వార్షిక సాంస్కృతికోత్సవం సారంగ్‌ ప్రతి ఏడాది చలికాలంలో జరుగుతుంది. సంస్థ యొక్క సాంకేతికోత్సవం శాస్త్రగా పేరొందింది. ప్రతి శనివారం రాత్రి బహిరంగ ప్రదర్శనాస్థలంలో ఒక సినిమా చూపిస్తారు. ఇందులో సాధారణంగా 7 వేల మంది ప్రవేశించవచ్చు. ఇది ఎప్పుడూ నిండిపోతుంది. వార్షిక ఇంటర్‌ హాస్టల్‌ క్రీడల కార్యక్రమాన్ని షెరోటెర్‌ అని పిలుస్తారు.

ఇక్కడ అనేక ప్రవృత్తి సమూహాలు ఉన్నాయి. ఇందులో వక్తృత్వం, అంతరిక్ష , నటన సమూహాలున్నాయి. ఇటీవల కాలంలో సంగీతం , రోబోటిక్స్‌ బాగా ప్రాచుర్యం పొందాయి.

ద వివేకానంద స్టడీ సర్కిల్‌ (VSC) , రిఫ్లెక్షన్స్‌ అనబడే రెండు విద్యార్థుల సమూహాలు ఎక్కువగా ఆధ్యాత్మిక చర్చలు చేస్తాయి.

ప్రాంగణంలో అందంగా ఉండే ఓ ప్రత్యేక మాట్లాడే విధానం(స్లాంగ్ ) ఉంది. ఇది ఒక జర్మన్‌ విశ్వవిద్యాలయం మాస్టర్స్‌ థీసిస్‌ను ప్రచురించడానికి కూడా ఆకర్షించింది. ఇందులో ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు , తమిళ్‌ కలిసి ఉంటాయి. ఈ భాషలన్నింటినీ కలిపి రూపొందించిన స్లాంగ్‌ను చెన్నైలోని అనేక ఇతర కళాశాలలు కూడా అనుసరిస్తున్నాయి. ఇతర సోదర సంస్థలతో పోల్చితే ఇది ఈ సంస్థ ప్రత్యేకత . విద్యార్థులందరూ పాల్గొనే కార్యక్రమాల్లో అంటే వక్తృత్వం, నటన, లఘుచిత్రాల నిర్మాణం , ఇతర అంశాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతాయి. ఉత్తర భారతదేశంలో ఉన్న ఇతర ఐఐటీల మాదిరిగా కాకుండా ఇక్కడ హిందీ కంటే ఆంగ్లం‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు.

సదుపాయాలు

మార్చు
 
ఐఐటీ మద్రాస్‌లో SAC , స్టేడియం మధ్య ఉన్న ఖాళీ మైదానంలో ఉన్న దుప్పి.

ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు, అధ్యాపకలు, నిర్వహణ , సహాయక సిబ్బంది , వారి కుటుంబాల కోసం నివాస వసతిని ఏర్పాటు చేసింది. బాగా ఎక్కువగా ఉండే విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం నివాస సముదాయాల్లోనే ప్రైవేటు భోజనశాలలకు కూడా అనుమతి ఇచ్చారు. క్యాంపస్‌లో రెండు పాఠశాలలు (వాణవాణి , కేంద్రీయ విద్యాలయ) ఉన్నాయి. మూడు గుళ్లు (జలకనాథేశ్వర స్వామి, దుర్గా పెలియమ్మన్‌ , గణపతి దేవాలయాలు) ఉన్నాయి. మూడు బ్యాంక్‌ల శాఖలు (SBI, ICICI, కెనరా బ్యాంక్‌) ఉన్నాయి. ఒక ఆసుపత్రి, మార్కెట్లు, ఆహార శాలలు, వ్యాయామశాల, ఈతకొలను, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హాకీ, బ్యాడ్మింటన్‌ స్టేడియాలు ఉన్నాయి. అధిక వేగం ఉన్న ఇంటర్‌నెట్‌ విద్యాప్రాంతాలతో పాటు అధ్యాపకులు, సిబ్బంది యొక్క నివాస ప్రాంతాలలోనూ అందుబాటులో ఉంది. వసతి గృహాలలో ఇంటర్‌నెట్‌ మధ్యాహ్నం రెండు గంటల నుంచి అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుంది.

ఆహారం

మార్చు

క్యాంపస్‌ లోపల అనేక రకాల ఆహార శాలలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మెస్‌లు కూడా ఉంటాయి.

ఆలివ్‌ కిచెన్‌ (మొదట్లో బసెరా) సరస్వతి వసతి గృహం ఎదురుగా ఉంది. ఇది సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకూ ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాది వంటకాలను అందిస్తుంది.

ది గురునాథ్‌ పాటిసెరీ స్టుడెంట్స్ ఫెసిలిటీస్‌ సెంటర్‌ (SFC, చాలా తరచుగా గురు లేదా గురునాథ్‌ అని పిలుస్తారు) అన్ని రోజులూ అర్ధరాత్రి వరకూ తెరచి ఉంటుంది. ఇది ఒక బేకరీ. ఇందులో పళ్లరసాలతో పాటు, చాట్‌ , ఇతర స్నాక్స్‌ అందుబాటులో ఉంటాయి.

టిఫనీస్‌ సెంట్రల్‌ గ్రంథాలయానికి దగ్గర్లో ఉంటుంది. ఇది సరయు , సరస్వతి (రెండు అమ్మాయిల హాస్టల్స్‌)ల మధ్యలో ఉంటుంది. ఇది ఉదయం అల్పాహారం నుంచి రాత్రి ఒంటి గంట వరకూ తెరచి ఉంటుంది. ఇందులో అనేక రకాల వంటకాలు ఉంటాయి. చెన్నైలో ప్రాచుర్యం పొందిన అర్చనా స్వీట్స్‌ షాప్‌ కూడా ఇందులో ఉంటుంది.

మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగానికి ఎదురుగా 2006లో కేఫ్‌ కాఫీడే అవుట్‌లెట్‌ ప్రారంభించారు. ఇది రాత్రి ఒంటిగంట వరకూ ఉంటుంది.

ది క్యాంపస్‌ కేఫ్‌ సిబ్బంది యొక్క క్యాంటీన్‌గా పనిచేస్తుంది. ఇది విద్యాప్రాంతంలోని బస్‌స్టాప్‌కు దగ్గరగా ఉంది. ఇది శనివారంతో సహా వారంలో అన్ని రోజులూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరచి ఉంటుంది.

పాఠశాలలు

మార్చు

ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో ఉన్న రెండు పాఠశాలలు కేవలం అధ్యాపకులు, సిబ్బంది యొక్క పిల్లలకే కాకుండా, సహచర ప్రాంతాలు వెలాచెరి, అడయార్‌ వాసులకు కూడా అందుబాటులో ఉంటాయి.

కేంద్రీయ విద్యాలయ లేదా సెంట్రల్‌ పాఠశాల‌ గజేంద్ర సర్కిల్‌కు సమీపంలో ఉంది. ఇంది సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేసన్‌, న్యూఢిల్లీకి అనుబంధంగా పనిచేస్తుంది. దీనికి చాలా పెద్ద ఆటస్థలం ఉంది. ప్రతి ఏడాది షాస్త్రా అనబడే విద్యార్థుల కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది.

వాణవాణి మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌ సెకండరీ పాఠశాల‌, బోన్‌ ఎవెన్యూకు సమీపంలో ఉంది. ఇది అధ్యాపకుల నివాస సముదాయానికి దగ్గర ఉంది. ఇది తమిళనాడు మెట్రిక్యులేషన్‌ సిలబస్‌ను అనుసరిస్తుంది.

బ్యాంక్‌లు

మార్చు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన శాఖను గజేంద్ర సర్కిల్‌లో నడుపుతోంది. దీనికి రెండు ATM‌లు ఉన్నాయి. ఒకటి బ్రాంచ్‌లోనే ఉంది. మరొకటి విద్యార్థివసతి ప్రాంతంలోని తారామణి హౌస్‌లో ఉంది.

కెనరా బ్యాంక్‌ శాఖఅధ్యాపకుల నివాస జోన్‌కు సమీపంలో షాపింగ్‌ సెంటర్‌లో ఉంది. దీనికి రెండు ATM‌లు ఉన్నాయి. ఒకటి శాఖలో, మరొకటి విద్యార్థివసతి ప్రాంతంలో గురునాథ్‌ వెనక ఉంది.

వీటికి అదనంగా, హాస్టల్‌ మేనేజ్‌మెంట్‌ భవనంలో విద్యార్థివసతి ప్రాంతంలో ఐసీఐసీఐ ATM‌ ఉంది. లేడీస్‌ క్లబ్‌కు సమీపంలో ఇండియన్‌ బ్యాంక్‌ ATM‌ ఉంది.

దుకాణాలు

మార్చు

టాటా బుక్‌ హౌస్‌ గజేంద్ర సర్కిల్‌ సమీపంలో, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం పక్కన కాఫీడే పైన ఉంది. ఇందులో ఎక్కువగా ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. కొన్ని కాల్పనిక , ఇతర రచనలు దొరుకుతాయి.

విద్యార్థివసతి ప్రాంతంలో ఉన్న విద్యార్థుల సౌకర్యాల కేంద్రం‌ (SFC)లో గురునాథ్‌ నిర్వహిస్తున్న ఒక జనరల్‌ స్టోర్‌ ఉంది. సాధారణంగా ఐఐటీ విద్యార్థులకు కావలసినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇందులో వ్రాత సంబంధిత పరికరాలతో పాటు టాయిలెట్‌ సామగ్రి, దిండ్లు, మాట్రెసెస్‌, ప్లాస్టిక్‌ మగ్‌లు, బకెట్‌లు, టీ షర్ట్‌లు, కంప్యూటర్‌ పరికరాలు ఇలా అనేకం దొరుకుతాయి. ఇక్కడ ప్రత్యేకంగా గురునాథ్‌ గిఫ్ట్స్‌ అండ్‌ జెమ్స్‌ అనే దుకాణం ఉంది. ఇందులో ఐఐటి గుర్తుగలవస్తువులు ( మెమరబులియా) (మగ్స్‌, కీచైన్స్‌, పెన్‌స్టాండ్‌లు, టైస్‌, ఐఐటీ ట్యాగ్‌తో ఉన్న స్వెట్‌ చొక్కాలు), శుభాకాంక్షల కార్డులు, బహమతిగా ఇవ్వగలిగినవి, పుస్తకాలు, సిడిలు తదితర వస్తువులు దొరుకుతాయి. దీనికి అదనంగా గోదావరి హాస్టల్‌కు ఎదురుగా ఉన్న అలుమిని సంఘం ఆఫీసులోనూ ఐఐటీ మెమరబులియా అందుబాటులో ఉంటుంది.

SFCని సాధారణంగా గురునాథ్‌ అని పిలుస్తారు. ఇక్కడే ఆల్‌ఇండియా ట్రావెల్‌ ఏజంట్స్‌కు సంబంధించిన ఒక బ్రాంచ్‌ ఉంది. ఇది ప్రయాణాలకు , పాస్‌పోర్ట్‌ పొందడంలో సహకారం అందిస్తుంది.

అధ్యాపకుల ప్రాంతంలో ఉన్న దుకాణాల కేంద్రం లోనూ అనేక దుకాణాలు ఉన్నాయి. నిత్యావసర వస్తువులు, కూరగాయల దుకాణం, ఇస్త్రీ దుకాణంఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరొక ఇస్త్రీ దుకాణం విద్యార్థుల కోసం బ్రహ్మపుత్ర హాస్టల్‌ భూగర్భ అంతస్తులో ఉంది.

దేవాలయాలు

మార్చు

రిజర్వ్‌ అడవిగా ఉన్న కాలం నుంచి ఉన్నాయి.ఇక్కడ మూడు పాత దేవాలయాలు ఉన్నాయి.

జలకంఠేశ్వర దేవాలయం (శివన్‌ దేవాలయం) ప్రధాన ద్వారానికి సమీపంలో ఢిల్లీ ఎవెన్యూ దగ్గర అధ్యాపకుల ప్రాంతంలో ఉంది. దుర్గా పెలియమ్మన్‌ దేవాలయం సుమారుగా ప్రధాన ద్వారం , గజేంద్ర సర్కిల్‌కు మధ్యలో ఉంటుంది. ఇది కూడా ఢిల్లీ ఎవెన్యూ మీదే ఉంది. పాత వినాయకుడి దేవాలయం తారామణి హౌస్‌ వెనక భాగంలో, హాస్టల్‌ జోన్‌లో ఉంది. ప్రతి శనివారం సాయంత్రం ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.

ప్రముఖ పూర్వ విద్యార్థులు

మార్చు

విద్యా విశేషాలు

మార్చు
  • సుబ్ర సురేశ్‌, మసాచుషెట్స్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పాఠశాల‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్‌ డీన్‌
  • కె.ఆర్‌. రాజగోపాల్‌, టెక్సాస్‌లోని ఎ అండ్‌ ఎమ్‌ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రొఫెసర్‌ , ఇంజినీరింగ్‌లో నిపుణులు[9]
  • మార్టి జి. సుబ్రహ్మణ్యం, న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని స్టెర్న్‌ పాఠశాల‌ ఆఫ్‌ బిజినెస్‌లో చార్లెస్‌ ఇ. మెరిల్‌ ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్‌
  • సనత్‌ కె. కుమార్‌, కొలంబియా విశ్వవిద్యాలయంలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌[10]
  • కె. సుధీర్‌, యేల్‌ పాఠశాల‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో మార్కెటింగ్‌ ప్రొఫెసర్‌[11]
  • కె. రవికుమార్‌, సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని మార్షల్‌ పాఠశాల‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఇన్పర్మేషన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌.[12]
  • అనంత్‌ రామన్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ పాఠశాల‌లో, బిజినెస్‌ లాజిస్టిక్స్‌ యొక్క UPS‌ ఫౌండేషన్‌ ప్రొఫెసర్‌.[13]
  • వి. కస్తూరి రంగన్‌, మాల్కమ్‌ పి. మెక్‌నాయర్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ పాఠశాల‌లో మార్కెటింగ్‌ ప్రొఫెసర్‌.[14]
  • రమేశ్‌ గోవిందన్‌, సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌.[15]
  • జి.కె. సూర్య ప్రకాశ్‌, జార్జ్‌ ఎ. , జుడిత్‌ ఎ. ఒలా నోబెల్‌, రసాయనశాస్త్రంలో సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో.[16]
  • రామచంద్రన్‌ జైకుమార్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ పాఠశాల‌లో గతంలో బిజినెస్‌ నిర్వహణ అంశంలో డేవూ ప్రొఫెసర్‌.[17]
  • సుబ్ర సురేశ్‌, ఇంజినీరింగ్‌లో ఫోర్డ్‌ ప్రొఫెసర్‌,MIT ఇంజినీరింగ్‌ [18] పాఠశాల‌లో డీన్‌.
  • ఆనంద్‌ రాజారామన్‌, జంగ్లీ యొక్క వ్యవస్థాపకలు. ప్రస్తుతం వెంకి హరినారాయణ్‌తో కలిసి Kosmix.com‌ను నిర్వహిస్తున్నారు.
  • వెంకటేశన్‌ గురుస్వామి, కార్నెగి మెలన్‌ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌.
  • ఆర్‌ శంకర్‌ జె.ఆర్‌. హూఫ్‌మన్‌ యేల్‌ యూనివర్శిటీలో అప్లైడ్‌ ఫిజిక్స్‌లో ప్రొఫెసర్‌.[19]
  • నరసింహన్‌ జగదీష్‌, గోజుట బిజినెస్‌ పాఠశాల‌లో ఫైనాన్స్‌ విభాగానికి డీన్‌[20]
  • శంకరన్‌ సుందరేశన్‌, ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో ప్రొఫెసర్‌.[21]
  • అరుణ్‌ సుందరరాజన్‌, న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలోని స్టెర్న్‌ పాఠశాల‌ ఆఫ్‌ బిజినెస్‌లో ప్రొఫెసర్‌.[22]
  • హరి బాలకృష్ణన్‌, MITలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌
  • ఎల్‌. మహాదేవన్‌, హార్వర్డ్‌[23] విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌, మెక్‌ఆర్థర్‌ సాధించిన వ్యక్తి 2009.[24]
  • శ్రీనివాస చక్రవర్తి (ఆచార్యులు), ఐఐటీ మద్రాసులో ఆచార్యుడు, విజ్ఞానశాస్త్ర ప్రచారకుడు

పరిశ్రమ

మార్చు
  • బి. యెన్. సురేశ్‌, (భారత స్పేస్‌ సైన్స్‌ , టెక్నాలజీ, తిరువనంతపురంలో డైరెక్టర్‌) [1969 MTME]
  • అసిత్‌ కే బర్మా (సత్యం కంప్యూటర్స్‌, చెన్నైలో మార్కెటింగ్‌ , స్ట్రాటజీ విభాగం వైస్‌ప్రెసిడెంట్‌)
  • గోపాలకృష్ణన్‌.ఎస్‌, (ఇన్ఫోసిస్‌కు సహ వ్యవస్థాపకులు , మేనేజింగ్‌ డైరెక్టర్‌) [MS77 PH] [MT79 CS]
  • గురురాజ్‌ దేశ్‌పాండే (సికామోర్‌ నెట్‌వర్క్స్‌ వ్యవస్థాపకులు)[BT73 EE]
  • బి. ముత్తురామన్‌ (టాటా స్టీల్‌లో డైరెక్టర్‌) [BT66 MT]
  • సతీష్‌ పాయ్‌ (స్కల్మ్‌బర్జర్‌ ఆయిల్‌ఫీల్డ్‌ టెక్నాలజీస్‌లో ఉపాధ్యక్షులు)
  • డాక్టర్‌ సి. మోహన్‌ Archived 2010-08-10 at the Wayback Machine (IBM‌ ఫెలో , IBM‌ ఇండియాలో ప్రధాన శాస్త్రవేత్త) [BT77 ChE]
  • డాక్టర్‌ మన్నిగి విక్రమ్‌రావు (హాలిబర్టన్‌లో చీఫ్‌ టెక్నాలజీ అధికారి)
  • జై మీనన్‌ (IBM‌ ఫెలో, IBM సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌లో CTO , వైస్‌ప్రెసిడెంట్‌) - డిస్టింగ్విస్‌ అలుమునస్‌ అవార్డు గ్రహీత.
  • బి. శాంతానామ్‌ (సెయింట్‌ గోబైన్‌-భారత్‌కు సిఈఓ) [BT78 CV]
  • కాలిదాస్‌ మదయపెద్ది, ఫెల్ప్స్‌ డాడ్జ్‌ వైర్‌ అండ్‌ కేబుల్‌కు ప్రెసిడెంట్‌ , ఫెల్ప్స్‌ డాడ్జ్‌ కార్పొరేషన్‌లో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌.
  • డాక్టర్‌ కృష్ణన్‌ భరత్‌ (గూగుల్‌లో ముఖ్య సైంటిస్ట్‌, గూగుల్‌ న్యూస్‌ సృష్టికర్త)
  • ఫణీశ్‌ మూర్తి (ఐ గేట్‌కు సీఈఓ, అంతకు ముందు ఇన్పోసిస్‌లో ప్రపంచ వ్యాప్త సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌బోర్డుకు హెడ్‌గా పనిచేశారు)
  • సునీల్‌ వధ్వాని (ఐ గేట్‌ వ్యవస్థాపకులు) [BT74 ME]
  • శ్రీహరి నారాసిపూర్‌ (ఐబిఎమ్‌ ఇండియాలో, రేషనల్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌) [MT83 ME]
  • డి. శివకుమార్ ‌(నోకియా ఇండియాలో, వైస్‌ప్రెసిడెంట్‌ , కస్టమర్‌ అండ్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ కంట్రీ జనరల్‌ మేనేజర్‌)[BT82 AE]
  • టి.ఎన్‌. హరి (అంబా రీసెర్చ్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌ , మానవ వనరుల విభాగానికి గ్లోబల్‌ హెడ్‌)[BT86 ME]
  • డాక్టర్‌ జలయ్య ఉన్నం (US చిన్న తరహా పరిశ్రమల నిర్వహణ సంస్థ నుంచి, నేషనల్‌ ప్రైమ్‌ కాంట్రాక్టర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గ్రహీత) [BT70 MT]
  • కె.ఎన్‌. రాధాకృష్ణన్‌ (TVS‌ మోటార్‌ కంపెనీలో ప్రెసిడెంట్‌) [BT86 MT]
  • యోగేశ్‌ కుమార్‌ (హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో, లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (LCA-తేజాస్‌)కు డైరెక్టర్‌. [MT81 ME]
  • పార్థ డి సర్కార్‌ (హిందుజా TMT లిమిటెడ్‌లో సిఈఓ-ఐటి , ITES‌) [BT88 MT]
  • సుందర్‌సన్‌ ఎస్‌(చెక్‌ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ Archived 2004-05-09 at the Wayback Machineలో ఆర్‌ అండ్‌ డి విభాగం డైరెక్టర్‌) [MT99 CS]
  • యోగేశ్‌ గుప్తా (ఫాట్‌వైర్‌ సాఫ్ట్‌వేర్‌కు ప్రెసిడెంట్‌ , సీఈఓ) [BT81 EE]
  • కృష్ణ కొల్లూరి (నెవిస్‌ నెట్‌వర్క్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో ఒకరు, జునిపెర్‌ నెట్‌వర్క్స్‌లో ఎగ్జిక్యూటివర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) [BT86 ME]
  • శ్రీనిచారి (టర్బో వర్క్స్‌లో ప్రెసిడెంట్‌ , సీఈఓ) [BT81 ME]
  • బి.ఎన్‌. నరసింహ మూర్తి (హిందుజా టిఎమ్‌టిలో బిజినెస్‌ ట్రాన్సిసన్‌ , డొమెస్టిక్‌ మార్కెట్స్‌కు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) [BT79 ME]
  • రాజ్‌ శ్రీకాంత్‌ (యూఎస్‌ఎలోని న్యూయార్క్‌లో అలెక్స్‌బ్రౌన్‌లో డ్యూష్‌ బ్యాంక్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌)
  • కల్పతి ఎస్‌. సురేశ్‌ (SSi లిమిటెడ్‌లో ఛైర్మన్‌ , సీఈఓ) [BT86 EE]
  • అరవింద్‌ రఘునాథన్‌ (డ్యూష్‌ బ్యాంక్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌)
  • రామనాథన్‌ వి. గుహ (RSS‌ ఫీడ్‌ టెక్నాలజీని కనుగొన్న వ్యక్తి)
  • సి.వి. అవధాని(భారత దేశానికి డిప్యూటి కంట్రోలర్‌ , ఆడిట్‌ జనరల్‌)[BT69 ME] [MS73 ME]
  • వెంకీ హరినారాయణ్‌ (కాస్మిక్‌కు సహ వ్యవస్థాపకులు) [BT88]
  • విష్‌ తాడిమెట్టి (కోర్లియంట్‌ వ్యవస్థాపకులు , సైబర్‌టెక్‌కు సీఈఓ) [MT86 EE]
  • డాక్టర్‌ పి.చెల్లపాండి, భారత్‌లోని ఇందిరాగాంధీ సెంటర్‌ ఆఫ్‌ ఆటమిక్‌ రీసెర్చ్‌లో సేఫ్టీ గ్రూప్‌ డైరెక్టర్‌.
  • పి. ఆనందన్‌ (మైక్రోసాఫ్ట్‌ రీచెర్స్‌ ఇండియాకు మేనేజింగ్‌ డైరెక్టర్‌)[25]
  • డాక్టర్‌ ప్రభాకర్‌ రాఘవన్‌ (యాహు రీసెర్చ్‌కు హెడ్‌)[26]
  • వెంకట్‌ రంగన్‌ (క్లియర్‌వెల్‌ సిస్టమ్స్‌కు సహ వ్యవస్థాపకులు , సీటిఓ) [BT81 ME][27]
  • రఘు రామకృష్ణన్‌ (యాహు రీసెర్చ్‌కు వైస్‌ప్రెసిడెంట్‌ ,, రీసెర్చ్‌ ఫెలో)

ఇతరులు

మార్చు
  • సంత్‌ రాజిందర్‌ సింగ్‌ జి మహరాజ్‌ (ప్రముఖ ఆధ్యాత్మిక నాయకులు , కొలంబియా యొక్క అత్యుత్తమ పురస్కారం మెడల్‌ ఆఫ్‌ గోల్డెన్‌ క్రాస్‌ గ్రహీత, అనేక ఐక్యరాజ్యసమితి అవార్డులు సాధించారు. వరల్డ్‌ పార్లమెంట్‌ ఆఫ్‌ రిలీజియన్స్‌లో వక్త. 1989లో బెల్‌ ల్యాబ్స్‌ నుంచి పదవీ విరమణ చేశారు)[BT67].

మూలాలు

మార్చు
  1. Murali, Kanta (2003-02-01). "The IIT Story: Issues and Concerns". Frontline. Retrieved 2009-09-22.[permanent dead link][permanent dead link][permanent dead link][permanent dead link]
  2. 2.0 2.1 "The Indian Institute of Technology Madras -- 50 Glorious Years". The Hindu. 2008-07-31. Archived from the original on 2008-10-14. Retrieved 2009-09-22.
  3. "Indian Institute of Technology Madras (IIT Madras)". StudyPlaces.com. Archived from the original on 2010-04-11. Retrieved 2009-09-22.
  4. "At 'Nostalgia,' tributes to Indo-German ties". The Hindu. 2009-02-28. Archived from the original on 2009-03-03. Retrieved 2009-09-22.
  5. https://www.timeshighereducation.co.uk/world-university-rankings/2014-15/regional-ranking/region/asia
  6. About IIT Madras | Indian Institute of Technology Madras. Iitm.ac.in. Retrieved on 2013-10-09.
  7. Madras, Indian Institute of Technology (2006-01-18). "The Institute". Archived from the original on 2006-04-27. Retrieved 2006-05-14.
  8. "భారత్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీ మద్రాస్‌) గురించి". Archived from the original on 2010-08-26. Retrieved 2010-10-04.
  9. టెక్సాస్‌ ఏ అండ్‌ ఎమ్‌ విశ్వవిద్యాలయంలో కె.ఆర్‌. రాజగోపాల్‌ Archived 2010-06-18 at the Wayback Machine
  10. కొలంబియా విశ్వవిద్యాలయంలో శాంత్‌ కె. కుమార్‌ Archived 2010-09-23 at the Wayback Machine
  11. యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో కె. సుధీర్‌ Archived 2010-10-29 at the Wayback Machine
  12. సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో రవి కుమార్‌ Archived 2009-08-26 at the Wayback Machine
  13. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో అనంత రామన్‌ Archived 2010-08-05 at the Wayback Machine
  14. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో వి. కస్తూరి రంగన్‌ Archived 2012-09-15 at the Wayback Machine
  15. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో రమేశ్‌ గోవిందన్‌ Archived 2010-10-27 at the Wayback Machine
  16. సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జి.కె. సూర్య ప్రకాశ్‌
  17. Hansell, Saul (2 March 1998). "Ramchandran Jaikumar, 53, Business Professor at Harvard". The New York Times. Retrieved 26 July 2009.
  18. ఎం.ఐ.టి.లో సుబ్ర సురేశ్‌ Archived 2010-06-07 at the Wayback Machine
  19. యేల్‌ విశ్వవిద్యాలయంలో ఆర్‌. శంకర్‌
  20. గోయిజుట బిజినెస్‌ స్కూల్‌లో నరసింహన్‌ జగదీశ్‌ Archived 2010-10-30 at the Wayback Machine
  21. ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో శంకరన్‌ సుందరేశన్‌
  22. ఒక ఇంటర్‌నెట్‌ కంపెనీ ప్రజల్లోకి వెళ్లినప్పుడు, దాని స్టాక్‌ విలువ వ్యూహాన్ని నిర్దేశిస్తుందా?
  23. హార్వర్డ్‌లో ఎల్‌. మహదేవన్‌
  24. మెక్‌ ఆర్డర్‌ ఫెలో ఎల్‌. మహదేవన్‌
  25. మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌లో పి. ఆనందన్‌
  26. యాహు రీసెర్చ్‌లో ప్రభాకర్‌ రాఘవన్‌ Archived 2010-11-24 at the Wayback Machine
  27. క్లియర్వెల్ సిస్టమ్స్‌లో వెంకట్‌ రంగన్‌ Archived 2010-12-04 at the Wayback Machine

బాహ్య లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.