తంగిరాల ప్రభాకరరావు

తంగిరాల ప్రభాకరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో నందిగామ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

తంగిరాల ప్రభాకరరావు
తంగిరాల ప్రభాకరరావు


ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం నందిగామ నియోజకవర్గం
పదవీ కాలం
2014 – 15 జూన్ 2014
నియోజకవర్గం నందిగామ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1952-05-01)1952 మే 1
పరిటాల గ్రామం , కంచికచర్ల మండలం , కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భారతదేశం
మరణం 2014 జూన్ 15(2014-06-15) (వయసు 62)
రాజకీయ పార్టీ టీడీపీ
సంతానం 3

జననం, విద్యాభాస్యం

మార్చు

తంగిరాల ప్రభాకరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం , పరిటాల గ్రామంలో 1952 మే 1వ తేదీన షడ్రక్, సుందరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఎల్.ఎల్.బి వరకు చదివాడు.

రాజకీయ జీవితం

మార్చు

తంగిరాల ప్రభాకరరావు న్యాయవాద వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన వీరులపాడు జెడ్పీటీసీగా, ఎంపీపీగా పని చేశాడు. 2009లో నందిగామ నియోజకవర్గం జనరల్ నుండి ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేల్పుల పరమేశ్వర రావు పై 5171 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తంగిరాల ప్రభాకరరావు 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు పై 5212 ఓట్లతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

తంగిరాల ప్రభాకరరావు 15 జూన్ 2014న రాత్రి 11గంటల సమయంలో గుండెపోటు రావడంతో మదర్ థెరిస్సా ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మరణించాడు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించాడు.[1][2]

మూలాలు

మార్చు
  1. Deccan Chronicle (16 June 2014). "TDP MLA T Prabhakara Rao passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 3 సెప్టెంబరు 2021. Retrieved 3 September 2021.
  2. Sakshi (16 June 2014). "నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ హఠాన్మరణం". Archived from the original on 3 సెప్టెంబరు 2021. Retrieved 3 September 2021.