మొండితోక జగన్ మోహన్ రావు
మొండితోక జగన్ మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో నందిగామ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
మొండితోక జగన్ మోహన్ రావు | |||
పదవీ కాలం 23 మే 2019 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | నందిగామ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 22 జులై 1966 రైతుపేట్, నందిగామ , కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | మొండితోక కృష్ణ, కస్థాల మరియమ్మ | ||
జీవిత భాగస్వామి | డాక్టర్ రమాదేవి | ||
బంధువులు | మొండితోక అరుణ్ కుమార్ (తమ్ముడు) | ||
సంతానం | శివసాయి కృష్ణ & కృష్ణ సమీర్ | ||
నివాసం | గీతా మందిర్ రోడ్డు, నందిగామ | ||
పూర్వ విద్యార్థి | ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుమొండితోక జగన్ మోహన్ రావు 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం, చందర్లపాడు లో కృష్ణ, మరియమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఎం.డి పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుడాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. జగన్‌మోహనరావు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు చేతిలో 5212 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.
డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య పై 10881 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఫిబ్రవరి 2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికార వికేంద్రీకరణ & మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా కృష్ణా జిల్లా నందిగామ నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేశాడు.[2]
మూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "Nandigama Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
- ↑ Sakshi (29 February 2020). "వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.