తడఖండ్రిగ

తిరుపతి జిల్లా, తడ మండలం లోని జనగణన పట్టణం
(తడ ఖండ్రిగ నుండి దారిమార్పు చెందింది)

తడఖండ్రిగ, తిరుపతి జిల్లా, తడ మండలానికి చెందిన జనగణన పట్టణం.[1]

తడఖండ్రిగ
—  జనగణన పట్టణం  —
తడఖండ్రిగ is located in Andhra Pradesh
తడఖండ్రిగ
తడఖండ్రిగ
అక్షాంశరేఖాంశాలు: 13°36′53″N 80°01′43″E / 13.614697°N 80.028734°E / 13.614697; 80.028734
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం తడ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,123
 - పురుషులు 3,066
 - స్త్రీలు 3,057
 - గృహాల సంఖ్య 1,616
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

జనాభా గణాంకాలు

మార్చు

తడ ఖండ్రిక, తిరుపతి జిల్లా, తడ మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, తడ ఖండ్రిక పట్టణంలో మొత్తం 1,616 కుటుంబాలు నివసిస్తున్నాయి. తడ ఖండ్రిక పట్టణంలో మొత్తం జనాభా 6,123 అందులో 3,066 మంది పురుషులుకాగా, 3,057 మంది స్త్రీలు ఉన్నారు.[2] సగటు లింగ నిష్పత్తి 997.పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 707, ఇది మొత్తం జనాభాలో 12%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 374 మంది మగ పిల్లలు, 333 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 890, ఇది సగటు లింగ నిష్పత్తి (997) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 77.7%.దీనిని అవిభాజ్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 68.9% అక్షరాస్యతతో పోలిస్తే తడ ఖండ్రిక అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. తడ ఖండ్రిగలో పురుషుల అక్షరాస్యత రేటు 85.44%, స్త్రీల అక్షరాస్యత రేటు 70.08%.

దేవాలయాలు

మార్చు

తడకండ్రిగ గ్రామదేవత పోలేరమ్మకు 2014, జూన్-11, బుధవారంనాడు, ఘనంగా అంబళ్ళుపోసారు. మంగళవారం సాయంత్రం నుండియే వీధులలో వేపాకు తోరణాలు కట్టి, విద్యుద్దీపాల ఆర్చీలతో జాతరను తలపించేలా ఏర్పాట్లు చేసారు. ఉదయం అమ్మణ్ణికి సర్వాభిషేకాల అనంతరం, ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. తప్పెట్లు వెంటరాగా, బాణాసంచా వేడుకల మధ్య, స్త్రీల సంఖ్య అంబళ్ళను ఊరేగింపుగా తెసుకొనివచ్చి, అమ్మణ్ణికి నైవేద్యం సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పొంగలి సామాగ్రితో స్త్రీల సంఖ్య ఊరేగింపుగా తరలి వెళ్ళి, చెల్లాతమ్మకు పొంగళ్ళు పెట్టి పూజలు చేసారు.

గ్రామ విశేషాలు

మార్చు

ఈ పంచాయితీ పరిధిలోని బోడిలింగాలపాడు గ్రామంలోని మర్రి చెట్టుని ఆశ్రయించుకొని ఏటా పక్షులూ, నీటికాకులూ విడిది చేస్తుంటాయి. వర్షాలు ఆరంభం కాగానే ఇవి భారీ సంఖ్యలో వచ్చి, చుట్టుపక్కలనుంచి పుల్లలు సేకరించి చెట్టుమీద గూళ్ళు కట్టుకొని ఇక్కడ కొంతకాలం నివసిస్తాయి. ఇవి చూపరులను బాగా ఆకట్టుకొంటాయి.

మూలాలు

మార్చు
  1. "Villages and Towns in Tada Mandal of Sri Potti Sriramulu Nellore, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-11-27. Retrieved 2022-11-27.
  2. "Tada Khandrika Population, Caste Data Sri Potti Sriramulu Nellore Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-11-27. Retrieved 2022-11-27.

వెలుపలి లింకులు

మార్చు