తనూశ్రీ దత్తా (ఆంగ్లం: Tanushree Dutta) (జ. మార్చి 19, 1981) భారతీయ సినిమా నటి, మోడల్. ఈమె 2005లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ ను గెలుచుకొన్నది. ఈమె సోదరి ఇశితా దత్తా భారతీయ సినిమా, టెలివిజన్ నటి.

తనూశ్రీ దత్తా

తనూశ్రీ దత్తా
జననం మార్చి 19, 1984
జంషెడ్‌పూర్, జార్ఖండ్, భారత్
క్రియాశీలక సంవత్సరాలు 2004-ప్రస్తుతం

జీవితచిత్రం

మార్చు

తనూశ్రీ దత్తా జార్ఖండ్ రాష్ట్రంలోని (అప్పట్లో బీహార్ రాష్ట్రం) జంషెడ్‌పూర్ లో ఒక బెంగాళీ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఈమె పాఠశాల విద్య జెంషెడ్‌పూర్లోని డి.బి.ఎం.ఎస్ ఇంగ్లీషు పాఠశాలలో జరిగింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనక ముందు బల్కర్ సిద్ధూ యొక్క పంజాబీ మ్యూజిక్ వీడియో లౌంగ్ తవితేరియాన్లో పనిచేసింది. 20 యేళ్ళ వయసులో 2004లో ముంబాయిలో జరిగిన మిస్ ఇండియా పోటీలో ప్రథమ స్థానంలో గెలిచింది. ఆ తరువాత క్వీటో (ఈక్వడార్) లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో మొదటి 10 స్థానాల్లో నిలచింది.

2005లో బాలీవుడ్లో అడుగుపెట్టిన తనుశ్రీ ఒకేసారి చాకొలేట్, ఆషిక్ బనాయా ఆప్నే సినిమాల్లో నటించింది. చాకొలేట్ తొలి చిత్రం కాగా ఆషిక్ బనాయా ఆప్నే చాకొలేట్ కంటే ముందే విడుదలైంది.

తనూశ్రీ దత్తా నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతరాలు
2007 స్పీడ్ సంజన హిందీ
2007 ఢోల్ రీతు హిందీ
2007 గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్ డింకీ కపూర్ హిందీ
2007 రిస్క్ శ్రద్ధ హిందీ
2006 భాగం బాగ్ అతిధి పాత్ర హిందీ " సిగ్నల్..ప్యార్ కా సిగ్నల్" పాటలో
2006 36 చైనా టౌన్ అతిధి పాత్ర హిందీ "జబ్ కభీ" పాటలో
2006 వీరభద్ర మాలతి తెలుగు
2005 ఆషిక్ బనాయా ఆప్నే స్నేహ హిందీ
2005 చాక్లెట్: డీప్ డార్క్ సీక్రెట్స్ సిమ్రన్