తపాల్ పూర్
తపాల్ పూర్, మంచిర్యాల,జన్నారం మండలం,సింగారాయిపేట్ పంచాయితీకి చెందిన ఒక నివాస ప్రాంతం.ఇది రెవెన్యూ గ్రామం కాదు.ఇది ఖానాపూర్ (యస్.టి) రిజర్వుడు నియోజకవర్గం పరిధి కిందికి వస్తుంది.ఈ నివాసప్రాంతంలోని జనాభా మొత్తం 2436 అందులో పురుషులు 1220, స్ర్తీలు1216.[1]
ఈ నివాస ప్రాంతం (Habitation) మండల కేంద్రానికి 15 కి.మీ ల దూరములో, గోదావరి ఒడ్డు నుండి 1 కి.మీ. దూరములో ఉంది. ఇక్కడి ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. దట్టమైన అటవీ ప్రాంతంగా పేరు పొందింది. ప్రభుత్వం ప్రస్తుతం ఈ కవ్వాల్ అటవి ప్రాంతాన్ని కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం (జాతీయ పులుల సంరక్షణ కేంద్రం)గా ప్రకటించింది.[2] ఈ నివాస ప్రాంతం జాతీయ రహదారికి 3 కి.మీ. దూరములో ఉంది.రహదారికి అవతలి వైపున సింగరాయిపేట అనే గిరిజనుల గూడెం ఉంది.ఈ గిరిజనులు అటవీ సంరక్షణలో ప్రభుత్వానికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు.
విశేషాలు
మార్చు1970 దశకంలో ఈ గ్రామంలో జరిగిన సంఘటన దేశ వ్యాప్త సంచలనం రేకెత్తించింది. భూస్వాములపై జరిగిన నక్సలైట్ల దాడిలో ఈ గ్రామంలోని ఇద్దరు దొరలతోపాటు వారి ఇంటిముందు నివాసం ఉంటున్న కమ్మల అశోక్ పటేల్, పక్క గ్రామంలోని వారి పెదనాన్న కమ్మల వెంకటయ్య పటేల్ ను దారుణంగా చంపినారు. ఈ సంఘటనలో ప్రస్తుత మావోయిస్టు కేంద్ర కమిటి కార్యదర్శి గణపతితో పాటు కొండపల్లి సీతారామయ్య మొదలైన నాయకుల మీద చార్జిషీట్ నమోదు చేయడము జరిగింది.
కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు ఈ గ్రామానికి చెందినవారున్నారు. గ్రామ పెద్ద కమ్మల లచ్చయ్య దాదాపు 42 సం.లు గ్రామ సర్పంచ్ గా పనిచేసాడు. ఇతని బంధువులు ఎక్కువగా ఈ గ్రామంలోనే స్థిరపడినారు. ఇతని అన్న పక్క గ్రామం తిమ్మాపూర్లో శ్రీరాముల వారి గుడి కట్టించాడు. వీరి మరో సోదరుడు కమ్మల రాజయ్య. కమ్మల లచ్చయ్య గ్రామ సర్పంచ్ గా ఉన్న సమయములో కమ్మల లచ్చయ్యతో కలసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాడు. ఆ కాలంలో గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. గ్రామంలో ఉన్నత పాఠశాల కలదు,ఇక్కడికి ప్రతిరోజు పక్క గ్రామాల నండి విద్యార్థులు చదువుకోడానికి వస్తారు,కీ.శే.జి.వి.శ్రీనివాసరావు వారి తండ్రి గారి పేరు మీదుగ జి.వి.పితాంబర రావ్ స్మారక ఆయుర్వేద వైద్యశాలని కట్టించారు,ఈ ఆసుపత్రి నిర్మాణంతో ప్రజలకు వైద్య సేవలు అందుబాటు లోకి రావడం జరిగింది.
ఇతని సోదరుడు కెప్టెన్ జి.వి.విజయకుమార్ రావు ఆర్మీలో సేవలందించారు.
మూలాలు
మార్చు- ↑ "తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీరాజ్ & గ్రామీణాభివృద్ది శాఖ గ్రామ జ్వోతి వెబ్‌సైట్". Archived from the original on 2017-08-02. Retrieved 2018-09-10.
- ↑ నవ తెలంగాణ, ఆదిలాబాదు (17 November 2019). "పర్యాటకుల మదిదోస్తున్న కవ్వాల్". NavaTelangana. Archived from the original on 26 ఏప్రిల్ 2020. Retrieved 26 April 2020.