తప్పక చదవాల్సిన వంద కథానికలు

తప్పక చదవాల్సిన వంద కథానికలు గురజాడ అప్పారావు వందో వర్ధంతి సందర్భంగా నవంబరు 30 2015 న త్యాగరాయ గానసభలో విడుదలైన పుస్తకం. దీనిని వేదగిరి రాంబాబు వ్రాసారు. ఇది గురజాడకు నివాళిగా ఆవిష్కరింపబడింది. ఈ వ్యాసాలు సూర్య దినపత్రిక సాహిత్యం పేజీలో ప్రతివారం ప్రచురింపబడ్డాయి. అట్లూరి పిచ్చేశ్వరరావు మొదలుకొని హితశ్రీదాకా అక్షరక్రమంలో వందమంది కథకుల కథానికల పరిచయం ఈ పుస్తకంలో ఉంది.

తప్పక చదవాల్సిన వంద కథానికలు
"తప్పక చదవాల్సిన వంద కథానికలు" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: వేదగిరి రాంబాబు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: గురజాడ అప్పారావు వందో వర్ధంతి సందర్భంగా త్యాగరాయ గానసభలో విడుదలైన ఈ పుస్తకం గురజాడకు నివాళిగా ఆవిష్కరింపబడింది.[1]
ప్రచురణ: శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్
విడుదల: నవంబరు 30 2015
పేజీలు: 226
ప్రతులకు: శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్, హెచ్.ఐ.జి.1, బ్లాకు 6, ఫ్లాట్ 10, బాగ్‌లింగంపల్లి, హైదరాబాదు 44

పుస్తక ఆవిష్కరణ

మార్చు

గురజాడ శత వర్ధంతి నివాళిగా కళాసుబ్బారావు కళావేదికలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం వేదగిరి కమ్యూనికేషన్స్ నిర్వహించింది.[2] గురజాడ అప్పారావుకు అంకితమిస్తూ ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు ఎంతో శ్రమ కోర్చి ఆణిమత్యాల వంటి కథానికలను ఏర్చి కూర్చి ఈ సంకలనాన్ని తెచ్చారు. ఇందులో ఎన్నో వైవిధ్య భరితమైన కథానికలు ఉన్నాయి. 'సూర్య ' దినపత్రిక పాఠకులకు గతంలో ధారావాహిక రూపంలో అందించిన ఈ కథానికలను ఆయన పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఈ పుస్తకం చదవితే చాలు వేర్వేరు కథానికల కోసం వేర్వేరు పుస్తకాలు శోధించాల్సిన పని లేదు.[3]

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు