తబీష్ ఖాన్
తబీష్ ఖాన్ (జననం 1984, డిసెంబరు 12) పాకిస్తానీ క్రికెటర్.[1] సింధ్ తరపున ఆడుతున్నాడు. 2021 మే లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[2]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | కరాచీ, పాకిస్తాన్ | 1984 డిసెంబరు 12
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం |
పాత్ర | బౌలర్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు |
|
ఏకైక టెస్టు (క్యాప్ 245) | 2021 మే 7 - జింబాబ్వే తో |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2014/15—2015/16 | Sui Southern Gas Company |
2016 | కరాచీ వైట్స్ |
2017/18—2018/19 | Pakistan Television |
2018 | కరాచీ కింగ్స్ |
2019— present | Sindh |
మూలం: Cricinfo, 7 May 2021 |
కెరీర్
మార్చు2017 నవంబరులో, 2018 పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్లేయర్స్ డ్రాఫ్ట్‌లో కరాచీ కింగ్స్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు.[3]
2017-18 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో పాకిస్తాన్ టెలివిజన్ తరపున ఆరు మ్యాచ్‌లలో 37 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[4] 2018 సెప్టెంబరులో, 2018-19 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ రెండవ రౌండ్‌లో, లాహోర్ బ్లూస్‌పై పాకిస్తాన్ టెలివిజన్ కోసం 41 పరుగులకు 8 వికెట్లు తీసుకున్నాడు.[5] ఐదు మ్యాచ్‌లలో ఇరవై ఎనిమిది అవుట్‌లతో, పాకిస్తాన్ టెలివిజన్‌కి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా టోర్నమెంట్‌ను ముగించాడు.[6] 2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజామ్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సింధు జట్టులో ఎంపికయ్యాడు.[7][8]
2021 జనవరిలో, దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[9][10] 2021 మార్చిలో, జింబాబ్వేతో సిరీస్ కోసం మళ్ళీ పాకిస్తాన్ టెస్ట్ జట్టులో స్థానం పొందాడు.[11] [12] 2021 మే 7న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున అరంగేట్రం చేశాడు.[13] 36 ఏళ్ళ వయసులో అరంగేట్రం చేసిన ఇతను, పాకిస్థానీ టెస్టు అరంగేట్రం చేసిన మూడో అతి పెద్ద ఆటగాడిగా నిలిచాడు.[14]
2021 నవంబరులో, 2021-22 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో, తబిష్ తన 600వ ఫస్ట్-క్లాస్ వికెట్‌ను తీశాడు.[15]
మూలాలు
మార్చు- ↑ "Tabish Khan's 15 years of relentless toil". The Express Tribune. Retrieved 11 September 2018.
- ↑ "Tabish Khan". ESPN Cricinfo. Retrieved 8 November 2015.
- ↑ "How the PSL squads stack up". ESPN Cricinfo. Retrieved 13 November 2017.
- ↑ "Quaid-e-Azam Trophy, 2017/18: Pakistan Television Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 April 2018.
- ↑ "Rawalpindi beat ZTBL by five wickets". The International News. Retrieved 11 September 2018.
- ↑ "Quaid-e-Azam Trophy, 2018/19: Pakistan Television Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 23 October 2018.
- ↑ "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
- ↑ "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 4 September 2019.
- ↑ "Shan Masood, Mohammad Abbas, Haris Sohail dropped from Pakistan Test squad". ESPN Cricinfo. Retrieved 15 January 2021.
- ↑ "Nine uncapped players in 20-member side for South Africa Tests". Pakistan Cricket Board. Retrieved 15 January 2021.
- ↑ "Pakistan squads for South Africa and Zimbabwe announced". Pakistan Cricket Board. Retrieved 12 March 2021.
- ↑ "Sharjeel Khan returns to Pakistan T20I side for tour of South Africa and Zimbabwe". ESPN Cricinfo. Retrieved 12 March 2021.
- ↑ "2nd Test, Harare, May 7 - 11 2021, Pakistan tour of Zimbabwe". ESPN Cricinfo. Retrieved 29 April 2021.
- ↑ "Tabish Khan becomes Pakistan's third-oldest Test debutant". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-07.
- ↑ "Back-to-back centuries for Huraira, maiden ton for Azam and 600 wickets for Tabish". Dunya News. Retrieved 4 November 2021.