తమిళ్ రాకర్స్ (వెబ్‌సిరీస్‌)

తమిళ్‌ రాకర్స్‌ 2022లో విడుదలైన వెబ్‌సిరీస్‌. ఏవిఏం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ గుహన్, అపర్ణ గుహన్ శ్యామ్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌ కు అరివఝుగన్‌ దర్శకత్వం వహించాడు.[1] అరుణ్ విజయ్, వాణి భోజన్, ఐశ్వర్య మీనన్, అళగమ్ పెరుమాళ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ ఆగష్టు 19న సోని లివ్‌ ఓటీటీలో విడుదలైంది.[2]

పోస్టర్

కథ మార్చు

యాక్షన్‌ స్టార్‌ ఆదిత్య కథానాయకుడిగా నిర్మాత మది (అజగమ్‌ పెరుమాళ్‌) 300 కోట్లతో 'గరుడ' సినిమాను నిర్మిస్తాడు. ఈ సినిమా విడుదలతున్న సమయంలో తమిళ రాకర్స్‌ ఆ చిత్రంలోని కొన్ని వీడియో క్లిప్స్‌ను విడుదల చేసి అక్కడితో ఆగాక పూర్తి సినిమాను విడుదల చేస్తామని బెదిరిస్తారు. దింతో మది పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసును పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోని స్పెషల్‌ ఆఫీసర్‌ రుద్ర (అరుణ్‌ విజయ్) కి అప్పగిస్తారు. ఈ కేసుకు లింక్‌గా ఉండే సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ సంధ్య (వాణి భోజన్‌)తో కలిసి రుద్ర తమిళ్‌ రాకర్స్‌ నెట్‌వర్క్‌ను పట్టుకున్నాడా ? లేదా అనేదే మిగతా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్:ఏవిఏం ప్రొడక్షన్స్
 • నిర్మాత: అరుణ గుహన్, అపర్ణ గుహన్ శ్యామ్
 • కథ: మనోజ్ కుమార్ కలైవానన్
 • స్క్రీన్‌ప్లే & డైలాగ్స్ : మనోజ్ కుమార్ కలైవానన్, రాజేష్ మంజునాథ్
 • దర్శకత్వం: అరివఝుగన్‌
 • సంగీతం: వికాస్ బాడిస
 • సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్
 • యాక్షన్ డైరెక్టర్  : స్టంట్ సిల్వా
 • ఆర్ట్ డైరెక్టర్ : పిపి.శరవణన్
 • ఎడిటర్: వీ.జ్.సాబు జోసెఫ్

మూలాలు మార్చు

 1. Namasthe Telangana (14 August 2022). "పైరసీ వెబ్‌సైట్‌ కహానీ". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
 2. Andhra Jyothy (13 August 2022). "తమిళ్‌ రాకర్స్‌ వస్తున్నారు" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
 3. Eenadu (19 August 2022). "రివ్యూ: తమిళ్‌ రాకర్స్‌". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
 4. Sakshi (12 August 2022). "పైరసీ సినిమాలు చూడకూడదు: హీరో అరుణ్‌ విజయ్‌". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.

బయటి లింకులు మార్చు