తమిళ గంట
తమిళ గంట అనేది ఓ విరిగిన కంచు గంట. దీన్ని సుమారు 1836 లో విలియం కొలెన్సో అనే మిషనరీ కనుగొన్నాడు. న్యూజీల్యాండ్ ఉత్తర ప్రాంతం లోని వ్హాంగరెల్ సమీఫంలో అతను దాన్ని చూసినపుడు అక్కడి మావోరీ స్త్రీలు దాన్ని బంగాళదుంపలు ఉడకబెట్టుకునే కుండ లాగా వాడుతున్నారు.
ఈ గంట 13 సెం.మీ పొడవు, 9 సెం.మీ లోతుతో ఉంది. దానిపై ఒక శాసనం లిఖించి ఉంది. గంట అంచు చుట్టూ ఉన్న శాసనం పాత తమిళ భాషలో ఉందని గుర్తించబడింది. శాసనంలో "ముకయ్యతిన్ వక్కుచు. ఉతయ . . కప్పల్ ఉతయ మణి" అని తమిళంలో రాసి ఉంది. దాని అర్థం "మొహోయిడెన్ బక్స్ నావకు చెందిన గంట" అని. [1] ఈ శాసనంలోని కొన్ని అక్షరాలు ఆధునిక తమిళ లిపిలో లేవు. అవి ప్రాచీన లిపిలో ఉండేవి. అందువల్ల ఈ గంట దాదాపు 500 సంవత్సరాల నాటిదని, బహుశా మలి పాండ్య కాలం నాటిది కావచ్చునని అంచనా వేసారు. [1] దీన్ని కొన్నిసార్లు బయటి నుండి వచ్చిన కళాఖండం అని పిలుస్తారు.
ఇండాలజిస్ట్ VR రామచంద్ర దీక్షితార్ తన ది ఆరిజిన్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ తమిళ్‌లో ప్రాచీన తమిళ సముద్ర యాత్రికులకు ఆస్ట్రేలియా, పాలినేషియాల గురించి తెలిసి ఉండవచ్చని పేర్కొన్నాడు. [2] గంట ఆవిష్కరణతో న్యూజిలాండ్‌లో తమిళ ఉనికి గురించిన ఊహాగానాలు వచ్చాయి. అయితే న్యూజిలాండ్‌తో తమిళులకు ఉన్న పరిచయానికి ఈ గంట మాత్రమే రుజువు కాదు. [3] వన్నీ దేశం, ఆగ్నేయాసియాల మధ్య వాణిజ్యం పెరిగిన కాలంలో ట్రింకోమలీ నుండి నావికులు న్యూజిలాండ్ చేరుకున్నారు. భారతీయులకు సన్నిహితులైన నావికులున్న పోర్చుగీసు ఓడ ఆ గంటను ఒడ్డు వద్ద పడవేసి ఉండవచ్చు. [4] అలాగే, ఈ కాలంలో అనేక భారతీయ నౌకలను యూరోపియన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంట, అలాంటి ఓడల్లో న్యూజిలాండ్ తీరంలో వదిలేసిన ఏదైనా ఓడకు చెందినదైనా కావచ్చు కూడా. [5]
విలియం కొలెన్సో ఈ గంటను డొమినియన్ మ్యూజియమ్‌కు అందజేసాడు. ఇప్పుడు ఆ మ్యూజియంను మ్యూజియం ఆఫ్ న్యూజిలాండ్ టె పాపా టోంగరేవా అని అంటారు.
ఇవి కూడా చూడండి
మార్చు- పాంపే లక్ష్మి - అగ్నిపర్వత విస్ఫోటనంలో ధ్వంసమైన ఇటలీ నగరం పాంపే శిథిలాల్లో దొరికిన చిన్న భారతీయ శిల్పం
- పల్లవ లిపి
- తమిళ లిపి
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Sridharan, K. (1982). A maritime history of India. Government of India. pp. 45–46, 405. Retrieved 4 September 2021.
- ↑ Dikshitar, V. R. Ramachandra (1947). Origin and Spread of the Tamils. Adyar Library. p. 30.
- ↑ Kerry R. Howe (2003). The Quest for Origins: Who First Discovered and Settled New Zealand and the Pacific Islands? pp 144–5 Auckland:Penguin.
- ↑ New Zealand Journal of Science. Wise, Caffin & Company. 1883. p. 58. Retrieved 3 June 2013.
- ↑ New Zealand Institute (1872). Transactions and Proceedings of the New Zealand Institute. New Zealand Institute. pp. 43–. Retrieved 3 June 2013.
[[వర్గం:తమిళ సంస్కృతి]]