తమెంగ్‌లాంగ్ జిల్లా

మణిపూర్ లోని జిల్లా

తమెంగ్‌లాంగ్ జిల్లా మణిపూర్ రాష్ట్ర జిల్లా. జిల్లా ప్రధానకార్యాలయాలు తమెంగ్‌లాంగ్ పట్టణం వద్ద ఉన్నాయి. 2011 గణాంకాలను అనుసరించి మణిపూర్ రాష్ట్ర జిల్లాలలో తమెంగ్‌లాంగ్ అత్యంత అధికమైన జనసాంద్రత కలిగిన జిల్లాగా గురించబడింది.[1]

తమెంగ్‌లాంగ్
జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంతమెంగ్‌లాంగ్
Area
 • Total4,391 km2 (1,695 sq mi)
Population
 (2011)
 • Total1,40,143
 • Density32/km2 (83/sq mi)
భాషలు
 • అధికారికరోంగ్మీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

భౌగోళికం మార్చు

తమెంగ్‌లాంగ్ జిల్లా తూర్పు, ఉత్తర సరిహద్దులో సేనాపతి జిల్లా, పడమర సరిహద్దులో వెస్ట్ ఇంఫాల్ జిల్లా, అస్సాం రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో నాగాలాండ్ రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో చురచంద్‌పూర్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 439 చ.కి.మి.

ఆర్ధికం మార్చు

పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో తమెంగ్‌లాంగ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మణిపాల్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలు మార్చు

తమెంగ్‌లాంగ్ జిల్లా తమెంగ్‌లాంగ్, తమేయీ, టౌసెం, నంబా అనే 4 ఉపవిభాగాలుగా వుభజించబడింది. నంబా ఉపవిభాగం కింద ఖౌపం చాలా జనసాంధ్రత కలిగిన ప్రదేశం. అంతేకాక మణిపూర్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ. గైఖంగం గనమేయీ స్వస్థలమిదే.

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 140,143, [1]
ఇది దాదాపు సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 607 వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత 32 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 25.69%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 953:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 70.4%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అల్పం

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Saint Lucia 161,557 July 2011 est.

వెలుపలి లింకులు మార్చు