నాగాలాండ్
నాగాలాండ్, ఈశాన్య భారత దేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు మణిపూర్ రాష్ట్రాలు మరియు మయన్మార్ దేశము సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని కోహిమా. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడింది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతికి చెందిన వారు. ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 అస్సామీలు మరియు 14,000 బెంగాళీ ముస్లింలు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో నాగాలాండ్ ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న మిజోరాం మరియు మేఘాలయ రాష్ట్రాలతో పంచుకొంటున్నది.
నాగాలాండ్ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
కోహిమా - |
పెద్ద నగరము | దీమాపూర్ |
జనాభా (2001) - జనసాంద్రత |
1,988,636 (24వది) - 120/చ.కి.మీ |
విస్తీర్ణము - జిల్లాలు |
16,579 చ.కి.మీ (25వది) - 11 |
సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1963-12-01 - కె.శంకరనారాయణన్ - నిఫూరియో - Unicameral (60) |
అధికార బాష (లు) | ఇంగ్లీషు |
పొడిపదం (ISO) | IN-NL |
వెబ్‌సైటు: nagaland.nic.in | |
నాగాలాండ్ రాజముద్ర |
ఇటీవలి చరిత్రసవరించు
నాగాలాండ్ డిసెంబర్ 1, 1963 న రాష్ట్రముగా అవతరించింది. 1956 నుండి భారత దేశములో అంతర్భాగముగా, మరియు దీనికి మునుపు స్వంతంత్ర భుభాగముగా దీని స్థాయి వివాదాస్పదమైనది. కొన్ని వర్గాలు దీన్ని ఆసరాగ తీసుకొని స్వతంత్ర ప్రతిపత్తికై ఆందోళన చేస్తున్నారు.
2004, అక్టోబర్ 2న జరిగిన దాడులలో, అస్సాం మరియు నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు రెండు వేర్పాటువాద తిరుగుబాటుదారు గ్రూపులు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం మరియు నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఈ చర్యలకు బాధ్యులని భావిస్తున్నారు.
ప్రజలుసవరించు
- జానాభా: 15.5 లక్షలు (2000)
- జాతి వర్గాలు:
- మతము:
- క్రైస్తవులు: 87.5% (60%+ బాప్టిస్టులు)
- హిందూ: 10.1%
- ముస్లింలు: 1.7%
- రాజధాని: కోహిమా (జనాభా. 63,000)
జిల్లాలుసవరించు
సంఖ్య | రాష్ట్రము. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణము | జనాభా (2001) | విస్తీర్ణము (కి.మీ.²) | జన సాంద్రత (/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|---|
1 | NL | DI | దీమాపూర్ | దీమాపూర్ | 308382 | 926 | 333 |
2 | NL | KO | కోహిమా | కోహిమా | 314366 | 3113 | 101 |
3 | NL | MK | మొకొక్‌ఛుంగ్ | మొకొక్‌ఛుంగ్ | 227230 | 1615 | 141 |
4 | NL | MN | మోన్ | మోన్ | 259604 | 1786 | 145 |
5 | NL | PH | ఫేక్ | ఫేక్ | 148246 | 2026 | 73 |
6 | NL | TU | తుఏన్‌సాంగ్ | తుఏన్‌సాంగ్ | 414801 | 4228 | 98 |
7 | NL | WO | వోఖా | వోఖా | 161098 | 1628 | 99 |
8 | NL | ZU | జునెబోటొ | జునెబోటొ | 154909 | 1255 | 123 |