తమ్మా శ్రీనివాసరెడ్డి
తమ్మా శ్రీనివాసరెడ్డి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఫొటోగ్రాఫర్. ఈయన 15 మే 1968 న గుంటూరు జిల్లా తాడేపల్లి లో జన్మించాడు. ఇండియా టుడే కు ఫొటో జర్నలిస్టు. గత 32 సంవత్సరాలుగా అంతర్జాతీయ ఫొటోగ్రఫి పోటీలలో పాల్గొని 183 బంగారుపతకాలు, 494 అవార్డులు, 890 ప్రశంసాపత్రాలుతో పాటు ఈయన తీసిన 5847 ఛాయాచిత్రాలు ఎంపికై వివిధ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శింపబడ్డాయి. గడచిన 20 సంవత్సరాలుగా ప్రపంచస్థాయిలో తొలిపదిమందిలో ఒకరుగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
తమ్మా శ్రీనివాసరెడ్డి | |
---|---|
![]() | |
జననం | తమ్మా శ్రీనివాసరెడ్డి 1968 మే 15 తాడేపల్లి గుంటూరు జిల్లా |
ఇతర పేర్లు | శ్రీనివాసరెడ్డి |
వృత్తి | ఫోటో జర్నలిస్టు |
కోవిడ్-19 మహమ్మారి బారినపడిన సామాన్యులను రక్షించడానికి భారతదేశంలో వివిధ ప్రభుత్వాలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు పడిన పాట్లను కళ్ళకు కట్టినట్లుగా శ్రీనివాసరెడ్డి చిత్రీకరించాడు. ఐసియు వార్డుల్లో, వీధులలో, స్మశానవాటికల్లో వివిధ మారుమూల ప్రదేశాల్లో ఆవిష్కృతమైన హృదయవిదారక సన్నివేశాలను, అక్కడ సేవలందిస్తున్న కోవిడ్ వారియర్సను ఆయన తన ఛాయాచిత్రాలలో ప్రపంచం ముందుంచాడు.
అవార్డులు-సత్కారాలు
మార్చు- 2021 లో ప్రపంచ స్థాయి అత్యున్నత గుర్తింపు రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ (లండన్) ఫెలోషిప్(FRPS).
- 2015 లో అమెరికాలోని ప్రముఖ అంతర్జాతీయ ఫొటోగ్రఫి సంస్థ అయిన ఇమేజ్ కొలీగ్ సొసైటీ ఒకే ఏడాది 7 అంతర్జాతీయ పురస్కారాలు సాధించినందులకుగాను గ్రాండ్ మాస్టర్ అవార్డు
- 2007 లో రామ్ నాథ్ గోయంకా మెమోరియల్ అవార్డు
- 2012 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫొటోజర్నలిజంలో జీవితసాఫల్య పురస్కారం
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |