తాడేపల్లి

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా, తాడేఫల్లి మండలం లోని పట్టణం
  ?తాడేపల్లి
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
తాడేపల్లి నివాస ప్రాంతం, జాతీయ రహదారి 16
తాడేపల్లి నివాస ప్రాంతం, జాతీయ రహదారి 16
అక్షాంశరేఖాంశాలు: 16°28′00″N 80°36′00″E / 16.4667°N 80.60°E / 16.4667; 80.60Coordinates: 16°28′00″N 80°36′00″E / 16.4667°N 80.60°E / 16.4667; 80.60
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) గుంటూరు జిల్లా
జనాభా 54,406[1] (2011 నాటికి)
భాష (లు) తెలుగు
సర్పంచి
పురపాలక సంఘం తాడేపల్లి పురపాలక సంఘము
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 522 501
• ++91-8645


తాడేపల్లి గుంటూరు జిల్లాలో, కృష్ణా నది ఒడ్డున ఉన్న పట్టణం.[1] ఈ పట్టణం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతములొ ఉంది, కొద్ది భాగం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరంలో కూడా భాగం.[2] పిన్ కోడ్ నం. 522501., యస్.ట్.డీ కోడ్=08645.

భౌగోళికంసవరించు

విజయవాడ నగరానికి సమీపాన 3 కి.మీ.దూరంలో కృష్ణకు అవతలి (కుడి) గట్టున ఉన్న ఈ గ్రామంలో కృష్ణా కెనాల్ జంక్షను పేరుతో రైల్వే జంక్షను ఉంది. విజయవాడ నుండి గుంటూరు, చెన్నై వైపు వెళ్ళే రైలు మార్గాలు చీలేదిక్కడే.

ggg

మౌలిక వసతులుసవరించు

ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంసవరించు

ఈ కేంద్రం తాడేపల్లిలో ప్రధాన రహదారికి ఆనుకొని, మార్కెట్ కూడలిలో ఉంది.

ప్రభుత్వం, రాజకీయంసవరించు

పౌర పరిపాలనసవరించు

తాడేపల్లి పురపాలక సంఘం 2009లొ స్థాపించారు. ఇది 23 వార్డులు కలిగి ఉన్న మూడవ గ్రేడ పురపాలక సంఘం.[3] ఉండవల్లి గ్రామం, తాడేపల్లి పురపాలక సంఘంకు ఔట్ గ్రొత్. ఈ రెండు విజయవాడ అర్బన్ ఎగ్లొమరెషన్ లోకి వస్తాయి.[4]

పట్ట్లణంలొని దర్శనీయప్రదేశాలు/దేవాలయములుసవరించు

 1. పోలకంపాడు శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2017,మార్చి-10వతెదీ శుక్రవారం ఉదయం స్వామివారిని సాంప్రదాయ బద్ధంగా పెళ్ళికుమారునిగా చేసి ధ్వజారోహణ, కలశ స్థాపన, మండపారాధన నిర్వహించారు. 11వతేదీ శనివారంనాడు స్వామివారి కల్యాణం నిర్వహించెదరు. [5]
 2. శ్రీ భద్రకాళీ వీరభద్ర సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం.
 3. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరిగానే ఆశ్వయుజమాసంలో, దసరా సందర్భంగా, బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు.
 4. శ్రీ మద్వీరాంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
 5. శ్రీ రాధాకృష్ణ ఆలయం:- ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-22వతేదీ బుధవారంనాడు రాధా కృష్ణుల ఉతవ విగ్రహాల ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆరాధన, రక్షాబంధనంతో పాటు, కలశాభిషేకం పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం తీర్ధగోష్ఠి జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద హోమం చేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీరామానుజయ భక్త సమాజం చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకున్నది. సాయంత్రం శ్రీ రాధకృష్ణుల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం సామూహిక లలితాసహస్రనామ పారాయణం చేసారు. రాత్రికి స్వామివారి పవళింపు సెవ మనోహరంగా సాగినది. [4]
 6. శ్రీ లక్ష్మీగణపతిస్వామివారి ఆలయం:- శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయం, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి దత్తత దేవాలయం. ఈ ఆలయాన్ని 2016,ఆగష్టు-12 నుండి మొదలైన కృష్ణానది పుష్కరాలలోగా 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించవలసియున్నది. [2]
 7. శ్రీ సువర్ణ మానస నాగసాయి ఆలయం:- తాడేపల్లి మహానాడు వద్ద ఉన్న సుందరయ్య నగర్ లోని ఈ ఆలయంలో, 2016,డిసెంబరు-5వతేదీ సోమవారంనాడు, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం 6 గంటలకు సుబ్రమణ్యస్వామివారికి క్షీరాభిషేకం, 9 గంటలకు స్వామివారి కళ్యాణం, 12 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం కోలాట ప్రదర్శన మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [3]
 8. ఇస్కాన్ మందిరం:- ఈ మందిరం, తాడేపల్లిలో కరకట్ట మార్గం మీద ఉన్నది.

ఆర్థిక వ్యవస్థసవరించు

ఒకప్పుడు ఇక్కడ ACC సిమెంటు కర్మాగారం ఉండేది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషను వారి చమురు ఉత్పత్తుల నిల్వ కేంద్రం ఇక్కడ ఉంది. ఈ కేంద్రం ఎంతో మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తోంది.

ప్రముఖులుసవరించు

కల్లం అంజిరెడ్డి - డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు.సవరించు

శ్రీ గంగ్రోత్రిసాయిసవరించు

వీరు నాటకరంగానికి 30 సంవత్సరాలుగా చేయుచున్న కృషికి గుర్తింపుగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, వీరికి 2015వ సంవత్సరానికి గాను, ప్రతిష్ఠాత్మక కీర్తి పురస్కారం ప్రకటించింది. వీరికి ఈ పురస్కారాన్ని 2017,మార్చి-30,31వతేదీలలో తెలుగు విశ్వవిద్యాలయంలో అందజేసెదరు. వీరు, రెండు దశాబ్దాలుగా భారత స్వాతంత్ర్య చరిత్రను పరిశోధించుచూ తెలుగు భాషలోనికి రాని విశిష్ట సమాచారాన్ని వెలికితీసి, వందలాది వ్యాసాలు వ్రాసినారు. 13 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను ప్రచురించారు. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు అందించుచున్నందుకు గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2015వ సంవతరానికి గాను, వీరికి ప్రతిష్తాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు నాటకరంగానికి చెందిన ప్రముఖుల ఛాయాచిత్రాలను సేకరించి, వాటిని పలుప్రాంతాలలో ప్రదర్శించటం ద్వారా అనేకమంది కళాకారులను పరిచయం చేసారు. వీరు అనేక నాటకాలలో నటించడమే గాకుండా దర్శకత్వం వహించారు. నంది నాటకోత్సవాలలో బంగారు నందులు ఆయనకు ఈ పురస్కారంగా లభించినవి. [6]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 1 August 2014.
 2. "Declaration of A.P. Capital City Area–Revised orders" (PDF). Andhra Nation. Municipal Administration and Urban Development Department. 22 September 2015. Archived from the original (PDF) on 24 జూన్ 2016. Retrieved 21 February 2016.
 3. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 8 ఆగస్టు 2016. Retrieved 23 June 2016.
 4. "Name of Urban Agglomeration and its State constituent Units-2011" (PDF). Census of India. p. 23. Retrieved 21 September 2015.

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=తాడేపల్లి&oldid=3200028" నుండి వెలికితీశారు