తమ్మినేని యదుకుల భూషణ్

తమ్మినేని యదుకుల భూషణ్, నేటి కాలంలో తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న కవి. వీరు ఎనిమదవ ఏట నుండే కవిత్వాన్ని రచించారు.

మొట్ట మొదట అచ్చులో వచ్చిన కవితా సంకలనం "నిశ్శబ్దంలో నీ నవ్వులు". వైవిధ్యమైన సాహిత్యాన్ని తెలుగు వారికి అందించారు.

రచనలు

మార్చు

భూషణ్ గారి రచనలని కవిత్వం, విమర్శ, అనువాదం, కథలుగా వర్గీకరించవచ్చు. ఇప్పటి వరకు అచ్చులో వచ్చిన పుస్తకాలు

  1. నిశ్శబ్దంలో నీ నవ్వులు - కవిత్వం
  2. వాన కురిసిన పగలు - కవిత్వం
  3. చెల్లెలి గీతాలు - కవిత్వం
  4. సముద్రం - కథా సంకలనం
  5. నీ చేయి నా చేతిలో - అనువాదాలు
  6. నేటి కాలపు కవిత్వం తీరు తెన్నులు - విమర్శ

శిల్పంలా పటిష్ఠమైన కవిత్వం.వజ్రఘాతం వంటి విమర్శ . మూలానికి దీటైన అనువాదాలు, ఏకబిగిన చదివించే కథాశైలి యదుకుల భూషణ్ గారిని సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి.

రచనల నుండి ఉదాహరణలు

మార్చు

సాహితీ సేవ

మార్చు

తెలుగు సాహిత్యంలో రెండు వార్షిక పురస్కారాలను మొదలుపెట్టారు. అవి ఇస్మాయిల్ అవార్డు మరియూ సి పి బ్రౌన్ పురస్కారం

బయటి లింకులు

మార్చు