ఇస్మాయిల్ అవార్డు

ఇస్మాయిల్ అవార్డు తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇచ్చే అవార్డు. ఇది తమ్మినేని యదుకుల భూషణ్ గారిచే 2005 లో ఇస్మాయిల్ గారి సంస్మరణార్థం ప్రారంభించబడింది. ప్రతి ఏటా నవంబరు 24 వ తారీకున ఈ అవార్డు (పదివేల నూట పదహారు రూపాయలు) గ్రహీతకు బహూకరిస్తారు.

చెట్టుకవి ఇస్మాయిల్(మే 26, 1928 - నవంబరు 25, 2003)

ఎంపిక పద్దతి

మార్చు

ఇస్మాయిల్ అవార్డ్ ఎంపికలో పాటించే పద్ధతులు:

  • ఇస్మాయిల్ అవార్డ్ ఇచ్చేది కొత్త కవుల సంకలనానికే.
  • అంతేకాక,అది కవి మొదటి సంకలనం అయి తీరాలి.
  • ఒకవేళ సంకలనం లేక పోయినా,అవార్డ్ కమిటీ ప్రచురిస్తుంది.
  • అవార్డ్ గ్రహీతలు తమకు నచ్చిన కవిని సూచించవచ్చు
  • తుది నిర్ణయం ఐదుగురు సభ్యులున్న కమిటీదే.

పురస్కార గ్రహీతలు

మార్చు
సంవత్సరం రచయిత పుస్తకం సభాస్థలం
2005 పాలపర్తి ఇంద్రాణి వానకు తడిసిన పువ్వొకటి కాకినాడ
2006 గోపిరెడ్డి రామకృష్ణా రావు హైకూ కవిత్వం కాకినాడ
2007 గరికపాటి పవన్ కుమార్ ఆ సాయంత్రం హైదరాబాదు
2008 పి. మోహన్ కిటికీ పిట్ట హైదరాబాదు
2009 వైదేహి శశిధర్ నిద్రిత నగరం న్యూజెర్సీ
2010 గండేపల్లి శ్రీనివాసరావు ప్రేమ కవితలు హైదరాబాదు
2011 అయల పద్మలత మరో శాకుంతలం చెన్న పట్నం
2012 రామినేని తులసి కవితలు గుంటూరు
2013 బండ్లమూడి స్వాతి కుమారి కవితలు తిరుపతి
2014 కె. మమత రంగులు మాయని సీతాకోక చిలుక హైదరాబాదు
2015 చామర్తి మానస కవితలు బెంగళూరు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు